
వాషింగ్టన్ : విమానాయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి షికార్లు కొట్టాడు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్న విమానాన్ని ఝామ్‌మని గగనతలంలోకి తోలుకెళ్లిన అతను.. ఆపై కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా గాలిలోకి ఎగరడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వెంటనే జెట్ విమానాలతో ఆ విమానాన్ని వెంబడించారు. తీరా ఇది ఉగ్రవాద చర్య కాకపోవడంతో ఊపిరి తీసుకున్నారు. అలాస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ మోకానిక్ ఈ చర్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ సమయంలో విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మోకానిక్ ఆ తరువాత కంట్రోల్ చేయలేకపోవడంతో వాషింగ్టన్ ప్రాంతంలో క్రాష్ చేశాడని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు. క్రాష్ అయిన విమానం 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు. విమానం క్రాష్ కావడంతో అతని గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ విమానం గాలిలో చక్కర్లు కొడుతూ.. క్రాష్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment