గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్‌’ సంచలన నిర్ణయం | Boeing Ceo Dave Calhoun To Step Down Over Safety Incidents | Sakshi
Sakshi News home page

గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్‌’ సంచలన నిర్ణయం

Published Mon, Mar 25 2024 8:10 PM | Last Updated on Mon, Mar 25 2024 8:54 PM

Boeing Ceo Dave Calhoun To Step Down Over Safety Incidents - Sakshi

సాక్షి, న్యూయార్క్‌: ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం బోయింగ్‌ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి బోయింగ్‌ సీఈవో పదవి నుంచి డేవ్ కాల్హౌన్ దిగిపోనున్నారు. ఆయనతో పాటు మేలో జరగనున్న వార్షిక సమావేశంలో సంస్థ బోర్డ్‌ ఛైర‍్మన్‌గా ఉన్న లారీ కెల్నర్ సైతం రాజీనామా చేయనున్నట్లు బోయింగ్‌ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది.  

ఈ ఏడాది ప్రారంభంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్‌  9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్‌ ప్లగ్‌ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి 171 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం 16వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమవైపున తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత నుంచి బోయింగ్‌కు చెందిన పలు విమానాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్‌ విమానాలపై, ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బోయింగ్‌ సీఈవో, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు బోయింగ్‌ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement