Boing airplane
-
గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్’ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూయార్క్: ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి బోయింగ్ సీఈవో పదవి నుంచి డేవ్ కాల్హౌన్ దిగిపోనున్నారు. ఆయనతో పాటు మేలో జరగనున్న వార్షిక సమావేశంలో సంస్థ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న లారీ కెల్నర్ సైతం రాజీనామా చేయనున్నట్లు బోయింగ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి 171 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం 16వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమవైపున తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నుంచి బోయింగ్‌కు చెందిన పలు విమానాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాలపై, ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బోయింగ్ సీఈవో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు బోయింగ్ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది. -
భారత్‌కు మరో 2,500 విమానాలు అవసరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన రంగానికి 2042 నాటికి మరో 2,500కు పైగా విమానాలు అవసరం అవుతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. ‘పెరుగుతున్న ప్రయాణికులు, సరుకు రవాణా డిమాండ్‌ను తీర్చడానికి దక్షిణాసియాకు చెందిన విమానయాన సంస్థలు రాబోయే రెండు దశాబ్దాలలో తమ విమానాల పరిమాణాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని అంచనా. వృద్ధి, విమానాల భర్తీని పరిష్కరించడానికి ఈ కంపెనీలకు 2,705 కంటే ఎక్కువ కొత్త విమానాలు అవసరమవుతాయి. ఇందులో 92 శాతం భారత్ కైవసం చేసుకుంటుంది’ అని బోయింగ్ కమర్షియల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ డేరిన్ హస్ట్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. అంచనా వేసిన మొత్తం విమానాల్లో.. తక్కువ దూరం ప్రయాణించడానికి అనువైన చిన్న విమానాలు 2,300లకుపైగా, సుదూర ప్రాంతాల కోసం సుమారు 400 విమానాలు అవసరం అవుతాయని చెప్పారు. ఆసియాలో దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పరంగా మహమ్మారి ముందస్తు స్థాయికి పుంజుకున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద మార్కెట్ భారత్ మాత్రమేనని ఆయన అన్నారు. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..
ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రూస్ క్యాంపెబెల్కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్ ఉంది. హెయిర్ స్టయిలిస్ట్ జాన్ ఉస్సేరీ.. బోయింగ్ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది. అందుకోసం క్యాపెంబెల్ ఒరెగాన్లోని హిల్స్‌బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్ ఎయిర్వేస్ నుంచి బోయింగ్ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్‌బెల్. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్‌బెల్. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు. ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్ మిషన్, షింక్ వంటివి, కిచెన్‌కి కావల్సిన ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్ వంట చేసేందుకు మైక్రోవేవ్, టోస్టర్‌ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్‌ప్లేన్ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్లా ప్లేన్హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ. (చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు) -
ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు!
దేశంలో ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఎయిర్‌లైన్ కంపెనీ రాబోయే పదేళ్లలోపు కొత్త విమానాలు కొనబోతున్నదని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) తెలిపింది. ఇటీవల టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 220 విమానాలను, ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పోటాపోటీగా ఇతర విమానయాన సంస్థలు రెండేళ్లలో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి. ఎయిరిండియా తర్వాత.. ఇండిగో 300 విమానాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇండిగో సంస్థ గతంలోనే విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆర్ధిక మాద్యం, సప్లై చెయిన్ సమస్యలు లేకపోతే భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2022 డిసెంబర్ 31 నాటికి ఎయిర్‌బస్, బోయింగ్‌లు కలిపి 12,669 ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది కానీ ఇప్పటికీ సాధ్యం కాలేదు. డెలివరీ స్లాట్ల కోసం కనీసం రెండేళ్ళ వరకు ఆగాలని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ)కు చెందిన అనుబంధ సంస్ధ స్కూట్ తొమ్మిది ఎంబ్రాయర్ 190-ఈ2 ఎయిర్ క్రాఫ్ట్‌లు, కొనుగోలు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) చేసుకుంది. -
ఎయిరిండియా చరిత్రలో ఎన్నడూ లేని భారీ డీల్.. లక్షల కోట్లతో..
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మకుటంలో మరో కలికితురాయి చేరుకోనుంది. ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. ఇప్పటికే గత డిసెంబర్ నెలలో ఎయిరిండియా భారీ ఎత్తున విమానాల్ని కొనుగోలు చేస్తున్నట్లు అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ కథనాలకు కొనసాగింపుగా వచ్చే వారంలో విమానాల కొనుగోలుపై ఎయిరిండియా ప్రకటన చేయనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. 500 ఎయిర్ క్రాఫ్ట్‌లలో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 210 సింగిల్ ఐస్లె (asile) ఏ320నియోస్, 40 వైడ్ బాడీ ఏ 350ఎస్‌లను, అమెరికా ఎయిర్క్ట్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ నుంచి 220 ఫ్లైట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో 190 737 మ్యాక్స్ న్యారో బాడీ జెట్స్ 20 787 వైడ్ బాడీ, 10 777ఎక్స్‌లను కొనుగులుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్‌బస్- ఎయిరిండియా విమానాల కొనుగోళ్లపై నిన్ననే ( ఫిబ్రవరి 10న) ఒప్పందంపై సంతకం చేయగా..బోయింగ్ జనవరి 27న ఎయిర్‌లైన్‌తో తన ఒప్పందాన్ని అంగీకరించింది. జనవరి 27న ఉద్యోగులకు రాసిన నోట్లో ఎయిర్‌లైన్ కొత్త విమానాల కొనుగోళ్ల కోసం చారిత్రాత్మకమైన ఆర్డర్ ఖరారు చేస్తున్నట్లు తెలిపింది. -
ఎయిర్ ఇండియాకు కొత్త విమానాలు
-
గాల్లోకి ఎగిరాక ఊడిపోయిన విమానం టైర్
రోమ్: అట్లాస్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 747 విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే దాని ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. ఈ సంఘటన ఇటలీలోని టరంటో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కాసేపటికే జరిగింది. ఈ భారీ విమానాన్ని ప్రధానంగా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ పరికరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటలీలోని టరంటో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాలోని చార్లెస్టన్కు చేరుకోవాల్సి ఉంది. విమానం టైర్ ఊడిపోయిన దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. భారీ రవాణా విమానం రన్‌వేపై వేగంగా వెళ్తూ గాల్లోకి ఎగిరింది. అయితే, ఆ కాసేపటికే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. రన్‌వేపై పడి కొంత దూరం దొర్లుతూ వెళ్లింది. చక్రం ఊడిపోయిన క్రమంలో నల్లటి పొగ సైతం వచ్చినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. టైర్ ఊడిపోయినప్పటికీ అలాగే అమెరికా చేరిన విమానం.. చార్లెస్టన్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. టైర్ టరంటో ఎయిర్పోర్ట్ రన్‌వే చివరిలో గుర్తించారు. బోయింగ్ 747 డ్రీమ్‌లిఫ్టర్ రవాణా విమానం. బోయింగ్ 747-400 ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆధునికీకరించి రవాణా విమానంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విమాన పరకరాలను రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సెప్టెంబర్, 2006లో తొలిసారి గాల్లోకి ఎగిరింది. అయితే, వస్తు రవాణాకు మాత్రమే అనుమతి ఉంది. కేవలం విమాన సిబ్బంది మినహా మానవ రవాణాకు దీనిని ఉపోయోగించేందుకు అనుమతి లేదు. Un Boeing 747 Dreamlifter operat de Atlas Air (N718BA) care a decolat marți dimineață (11OCT22) din Taranto (IT) spre Charleston (SUA) a pierdut o roată a trenului principal de aterizare în timpul decolării. Avionul operează zborul #5Y4231 și transportă componente de Dreamliner. pic.twitter.com/R95UHkLD7V — BoardingPass (@BoardingPassRO) October 11, 2022 ఇదీ చదవండి: Work From Pub Trend: యూకేలో నయా ట్రెండ్ ‘వర్క్ ఫ్రమ్ పబ్’.. ఆడుతూ పాడుతూ పని! -
విమానం టాయిలెట్లో కెమెరా.. రెండేళ్లుగా పోరాటం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఇద్దరు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు విమానంలో కెమెరాను ఉంచారన్న అభియోగంతో ఫిబ్రవరి 2017 అరీదీనా కోర్టులో కేసు నమోదైంది. ఈ ఘటన గురించి ఫ్లైట్ అటెండెంట్ రెనీ స్టెయినాకర్ మాట్లాడుతూ తాను కాక్‌పీట్‌లోకి ప్రవేశించగానే పైలట్లు ఐపాడ్లో ప్రత్యక్షంగా వీడియోను చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనతో పాటు ఫ్లైట్ 1088 లో ఉన్న మరో ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్లు, విమానంలో లేని స్టెయినాకర్ భర్తను సైతం తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ నియమాల ప్రకారం ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో కెప్టెన్ టెర్రీ గ్రాహం టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో తనను కాక్‌పిట్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడంది. అప్పుడే ఈ విషయం తన కంటపడిందని.. కో పైలెట్ రస్సెల్ తన ఐపాడ్లో కెమెరాలో సదరు వీడియోలు చూస్తున్నాడని తెలిపింది. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా భద్రతా చర్యలలో భాగంగా నైరుతి బోయింగ్ 737-800 విమానాలన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని రస్సెల్ తనను నమ్మించే ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మాత్రం విమానంలో కెమెరాలు పెట్టారన్న వార్తలను ఖండించింది. తమ ఎయిర్‌లైన్స్ మీద వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులు, ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని తెలిపారు. ఇక 2017లో పిట్స్బర్గ్ నుంచి ఫోనిక్స్‌కు విమానం వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసు ప్రస్తుతం ఫోనిక్స్‌లోని ఫెడరల్ కోర్టుకు మార్చబడింది. ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా తన క్లైంట్ స్టెయినాకర్‌ను మాదకద్రవ్య పరీక్షల కంటే కూడా ఎక్కువగా వేధించారని ఆమె తరుపు న్యాయవాది చెప్పారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. -
ఎయిరిండియా విమానంలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాంలో మంటలు కలకలం రేపాయి. ఢిల్లీ విమానాశ్రయంలోని న్యూఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో బోయింగ్ 777 విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా ఎయిర్ ఇండియా బోయింగ్ 777 లోని ఏసీ మరమ్మత్తు సందర్భంగా మంటలొచ్చాయని, వెంటనే వాటిని అదుపు చేసినట్టు తెలిపింది. ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరని వివరించింది. -
భద్రతే ప్రాణప్రదం
అయిదు నెలల వ్యవధి...రెండు విమాన ప్రమాదాలు! ఆ రెండూ బోయింగ్ సంస్థ ఉత్పత్తి చేసినవే కావడం, పైగా 737 మ్యాక్స్–8 మోడల్‌కి చెందినవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా 51 దేశాలు ఆ రకం విమానాల వినియోగంపై ప్రస్తుతానికి నిషే«ధం విధించాయి. మరో 11 దేశాల్లో వేర్వేరు విమానయాన సంస్థలు వాటి వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. గత అక్టో బర్లో ఇండొనేసియాకు చెందిన లయన్ ఎయిర్ సంస్థ విమానం జావా సముద్రంలో కుప్పకూలి 189మంది మరణించారు. మొన్న ఆదివారం ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ రకం విమా నమే కూలి 157మంది దుర్మరణం పాలయ్యారు. ఆ రెండూ బయల్దేరిన కొన్ని నిమిషాలకే అనూ హ్యంగా కూలడంతో సహజంగానే అన్ని దేశాల్లోనూ ఆ మోడల్ విమానాలపై సంశయాలు బయ ల్దేరాయి. తమ విమానం డిజైన్‌లో లోపం లేదని, దాన్ని నడుపుతున్న పైలెట్ల అవగాహన లోపం వల్లే ప్రమాదాలు జరిగి ఉండొచ్చునని బోయింగ్ సంజాయిషీ ఇస్తోంది. అదొక్కటే కాదు... అమె రికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) కూడా దాని తరఫున వకాల్తా తీసుకుని ఆ మాటే చెబుతోంది. కానీ వీటిని విశ్వసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే నిరుడు అక్టోబర్‌లో కూలిన విమానాన్ని నడిపిన పైలెట్‌కు, కో పైలెట్‌కు కూడా 11,000 గంటలు విమానాలను నడిపిన అనుభవం ఉంది. తాజాగా ప్రమాదానికి లోనైన విమానాన్ని నడిపిన పైలెట్‌కు 8,000 గంటలకు మించి విమానాలను నడిపిన అనుభవం ఉంది. బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న ప్రయాణికుల విమానాల్లో 737 మ్యాక్స్–8 తాజా మోడల్. రెండేళ్ల క్రితం మార్కెట్లోకొచ్చిన ఆ రకం విమానాలు ఇంతవరకూ ప్రపంచంలో 350 వరకూ ఎగురుతు న్నాయి. మరో 5,000 విమానాలకు ఆర్డర్లున్నాయి. ఇందులో ఇంధనం 15శాతం ఆదా అవుతుందని తేలడమే దీనికి కారణం. కానీ తాజా పరిస్థితి బోయింగ్నూ, దాంతోపాటు ఎఫ్ఏఏనూ బెంబేలెత్తి స్తున్నాయి. ఈ విమానాల ఆర్డర్లు రద్దయినా, కనీసం ప్రస్తుతానికి వాయిదా వేయమని కొనుగోలు దారులు అడిగినా అది ఇబ్బందుల్లో పడుతుంది. దాని ప్రభావం అది ఉత్పత్తి చేసే ఇతర మోడళ్లపై కూడా ఉంటుంది. ఫలితంగా అది, దానితోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడతాయి. ఏ దేశంలోని విమానయాన సంస్థ అయినా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఓఏ) వెంటనే ఆ దేశాలను అప్రమత్తం చేస్తుంది. విమానయాన సంస్థల తీరుతెన్నులను గమనిస్తూ రేటింగ్ ఇస్తుంది. దాంతోపాటు ఎఫ్ఏఏ సైతం ఫిర్యాదులు చేస్తుం టుంది. కానీ ఇప్పుడు మ్యాక్స్–8 విమానాల భద్రతపై అనుమానాలు పెట్టుకోవద్దని ఎఫ్ఏఏ చెబు తోంది. గత 72 గంటల్లో పలు దేశాలు వీటిని నిలిపివేసినా ఎఫ్ఏఏ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రకం విమానాలను నడుపుతున్న అమెరికాలోని అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు రెండూ వాటిని యధావిధిగా ఉపయోగిస్తున్నాయి. అయితే అక్కడి ప్రయాణికులు, ఆ దేశంలోని విమాన సిబ్బంది సంఘాలు బోయింగ్, ఎఫ్ఏఏల ప్రకటనలను విశ్వసించడంలేదు. వాటిని నడపడానికి భయపడే పైలెట్లపైనా, అందులో సేవలందించడానికి సందేహించే ఇతర సిబ్బందిపైనా ఒత్తిడి తీసుకురావొద్దని విమాన సిబ్బంది సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందుకు దారితీసిన కారణాలపై పలు రకాల వాదనలు వినబడటం సర్వసాధారణం. వాటికుండే ప్రాతిపదికేమిటని కూడా ఆలోచించకుండా నమ్మేవారూ ఉంటారు. కానీ ఇప్పుడు మ్యాక్స్–8 రకం విమానం గురించి తలెత్తిన అనుమానాలు ఆ మాదిరి వేనా? అనుమానాలకు మాత్రమే కాదు... వాటిపై ఇచ్చే భరోసాకు కూడా సహేతుకమైన ప్రాతి పదిక ఉండాలి. మ్యాక్స్–8 రకంపై అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదని బోయింగ్‌తో పాటు ఎఫ్ఏఏ కూడా ఏ ధైర్యంతో చెబుతున్నట్టు? సుదీర్ఘకాలం నుంచి సర్వీసులో ఉండి, నమ్మ కంగా సేవలందిస్తుంటే ఆ భరోసాను జనం నమ్మడానికి వీలుంటుంది. కానీ మ్యాక్స్–8లు మార్కె ట్లోకి వచ్చి నిండా రెండేళ్లు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రయాణికుల విమానాల్లో వీటి వాటా ప్రస్తుతానికి 2శాతం మాత్రమే. ఇంత స్వల్ప సంఖ్యలో ఉన్న విమానాల్లో రెండు కేవలం ఆర్నెల్ల వ్యవధిలో ఒకే తరహాలో ప్రమాదానికి గురైనప్పుడు అనుమానాలు తలెత్తడంలో ఆశ్చర్య మేముంది? అయినా తాను అనుకుంటున్నదే సరైందని ఎఫ్ఏఏ ఎలా భావిస్తుంది? నిజానికి బోయింగ్ సంగతెలా ఉన్నా ఎఫ్ఏఏ తనకు తానే అయిదు నెలలక్రితం తొలి ప్రమాదం జరిగి నప్పుడే ఆ మోడల్లోని సాంకేతికతపై లోతుగా అధ్యయనం చేయించవలసింది. తమ దేశంలో కూడా వాటి వాడకం పెరిగింది గనుక ఇది అవసరమని ఎఫ్ఏఏ గుర్తించి ఉంటే వేరుగా ఉండేది. కనీసం ఇప్పటికైనా ఆ పని చేయకపోగా బోయింగ్‌ను వెనకేసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గత అక్టోబర్‌లో ప్రాణాలు కోల్పోయినవారికి చెందిన కుటుంబసభ్యులు కొన్ని రోజులక్రితమే బోయిం గ్‌పై అమెరికా న్యాయస్థానాల్లో పరిహారం కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సరిగ్గా ఇదే సమ యంలో తాజా ప్రమాదం చోటుచేసుకుంది. తొలి ప్రమాదం జరిగాక ఆ రకం విమానాలను నడిపేటప్పుడు పైలెట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోయింగ్ ఒక బులెటిన్ విడుదల చేసింది. ఆ మోడల్లో వినియోగించే విమాన నియంత్రణ సాఫ్ట్‌వేర్‌ను ఏప్రిల్‌నుంచి మరింత మెరుగు పరచనున్నట్టు రెండునెలల క్రితం తెలిపింది. ప్రమాదానికి లోనైన మ్యాక్స్–8 విమానాలు రెండూ ఒకే తరహాలో టేకాఫ్ దశలోనే నియంత్రణకు లొంగలేదని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే కూలి పోయాయని స్పష్టమవుతోంది. కనుక ప్రతిష్టకు పోకుండా ఆ విమానాల సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, లోపాలను గుర్తించి సరిచేయడం అవసరమని బోయింగ్ సంస్థ గుర్తిం చాలి. అంతవరకూ వాటిని తాత్కాలికంగా నిలిపేయమని వేరే దేశాల విమానయాన సంస్థలనూ కూడా అది కోరాలి. -
వారి కోసం లాంగ్రేంజ్ విమానం
న్యూఢిల్లీ: దేశంలో వేల కోట్ల మేర ఆర్థిక నేరాలకు పాల్పడి వెస్టిండీస్ దీవుల్లో ఆశ్రయం పొందుతున్న మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీయే లక్ష్యంగా ఈడీ/ సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. వేల కోట్లు మోసాలకు పాల్పడిన ఆ ఘరానా నేరగాళ్లను పట్టుకు వచ్చేందుకు ఎయిరిండియాకు చెందిన ఎక్కడా ఆగకుండా ప్రయాణించే లాంగ్రేంజ్ బోయింగ్ విమానంలో తమ అధికారులను అక్కడికి పంపించనున్నారు. వజ్రాల వ్యాపారులు మెహుల్ చోక్సీ, జతిన్ మెహతా తదితరులు.. డబ్బులిస్తే చాలు పౌరసత్వం చౌకగా దొరికే కరీబియన్ దీవుల్లోనే ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. జతిన్ మెహతా సెయింట్ కిట్స్, నెవిస్ దీవుల పౌరసత్వం, మెహుల్ చోక్సీ అంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. అయితే, నీరవ్ మోదీ యూరప్‌లో రహస్య ప్రాంతంలో ఉండి ఉంటాడని ఈడీ వర్గాలంటున్నాయి. చోక్సీతోపాటు యూరప్‌లో ఉన్న మోదీని తీసుకువస్తామని అధికారవర్గాలు చెబుతున్నాయి. గౌతమ్ ఖేతాన్ అరెస్ట్ నల్లధనం కలిగి ఉండటం, మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసు’ నిందితుడు, న్యాయవాది గౌతమ్ ఖేతాన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం∙కేసులో అరెస్టయిన మరో దళారీ క్రిష్టియన్ మిషెల్‌ను విచారించగా, అతను వెల్లడించిన వివరాల మేరకే ఖేతాన్‌ను ఎన్‌ఫోన్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్‌చేసినట్లు తెలుస్తోంది. -
డబుల్ డెక్కర్ విమానం వచ్చేస్తోంది!
ముంబై : ఇన్ని రోజులు డబుల్ డెక్కర్ బస్సు.. డబుల్ డెక్కర్ రైలు మాత్రమే చూసుంటాం. ఇక నుంచి డబుల్ డెక్కర్ విమానం కూడా అందుబాటులోకి వస్తోంది. పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా డబుల్ డెక్కర్ విమానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ డబుల్ డెక్కర్ విమానం రెండు కీలకమైన మార్గాల్లో ప్రయాణించనుంది. అవి ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ముంబై, కోల్‌కతా ప్రాంతాలకు. ఈ రెండు ప్రాంతాలకు 423 సీట్ల సామర్థ్యం కలిగిన డబుల్ డెక్కర్ బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 16 నుంచి డబుల్ డెక్కర్ విమానం ‘జంబో’ తన సేవలను అందించనుంది. ఇందులో 12 సీట్లు ఫస్ట్ క్లాస్‌వి, 26 బిజినెస్ క్లాస్‌వి, 385 ఎకానమీ క్లాస్‌వి ఉండనున్నాయి. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 21 మధ్యలో న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా, ముంబైలకు రోజుకు ఒక విమానం చొప్పున ‘జంబో’ విమానాన్ని నడుపనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్ డెక్కర్ విమానాన్ని నడపనుండగా, రెండో దశ(నవంబరు)లో ముంబైకి ఈ విమానం సేవలు అందించనున్నారు. సాధారణంగా నాలుగు ఇంజిన్ విమానాలను అంతర్జాతీయ మార్గాలలో, అదేవిధంగా వీవీఐపీల కోసం వినియోగిస్తుంటారు. న్యూఢిల్లీ-ముంబై-న్యూఢిల్లీ సెక్టార్లో నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రోజుకు రెండు జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపనున్నట్టు ఎయిరిండియా తెలిపింది. అక్టోబరులో దసరా, నవంబరులో దీపావళి పండగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎయిరిండియా. కాకతాళీయంగా ఈ ఏడాదే బోయింగ్ 747 ఆపరేషన్స్ ప్రారంభించి 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బోయింగ్ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌కు మరింత ఖ్యాతి అందించేందుకు డబుల్ డెక్కర్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది ఎయిరిండియా. -
తప్పిన ప్రమాదం..ఒకరు మృతి
రష్యాలోని సోచి విమానాశ్రయంలో దిగబోతూ రన్‌వే నుంచి పక్కకు జారి నదీ తీరంలో పడిపోయిన బోయింగ్ విమానం. ఈ ప్రమాదంలో ఒక సూపర్వైజర్ మృతిచెందగా, 164 మంది సురక్షితంగా బయటపడ్డారు. -
శకలం ధ్రువీకరణపై మలేసియా ఎదురుచూపు
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ ద్వీపంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదా కాదా ? అనేదానిపై ప్రెంచ్ పరిశోధకులనుంచి ధృవీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మలేసియా రవాణా మంత్రి లియో టైయాంగ్ లెయి శనివారం పేర్కొన్నారు. దీనిపై ఇప్పటివరకూ తమకు పూర్తి నివేదిక అందలేదని ఆయన అన్నారు. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం అంతుచిక్కని రీతిలో హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమాన శకలానికి సంబంధించిన ధృవీకరణ ఫలితం కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలో ఆ నివేదిక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవియేషన్ పరిశోధకులు వచ్చే వారం విశ్లేషించనున్నారు. విమాన శకలంపై నిర్థారణ పరిశోధన మేరకు మలేసియా రెండు బృందాలను ఏర్పాటుచేయగా, అందులో ఒక బృందాన్ని పారిస్‌కు, మరొక బృందాన్ని రీయూనియన్ ద్వీపానికి పంపినట్టు రవాణా మంత్రి లియో తెలిపారు.