విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్‌ | Boeing Cargo Plane Engine Catches Fire Emergency Landing | Sakshi
Sakshi News home page

విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్‌

Published Fri, Jan 19 2024 4:16 PM | Last Updated on Fri, Jan 19 2024 4:41 PM

Boeing Cargo Plane Engine Catches Fire Emergency Landing - Sakshi

అట్లాస్‌ ఎయిర్‌ బోయింగ్‌ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. అట్లాస్‌ ఎయిర్‌ బోయింగ్‌ 747-8 కార్గో విమానం టేకాఫ్‌ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్‌లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ  విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే  సురక్షింగా మియామి ఎయిర్ట్‌లోనే ల్యాడింగ్‌ చేయించామని అట్లాస్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్‌ పోర్టు ఫైర్‌ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉ‍న్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement