Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు | Shocking: Passengers Fly Off Their Seats As Miami-Bound Flight Faces Severe Turbulence, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు

Published Sat, Nov 16 2024 2:15 PM | Last Updated on Sat, Nov 16 2024 4:11 PM

Video: Passengers Fly Off Their Seats As Miami-Bound Flight Faces Severe Turbulence

సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. స్వీడన్ నుంచి అమెరికాలోని మియామి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని యూటర్న్‌ చేసుకొని తిరిగి యూరప్‌లో ల్యాండ్‌ చేశారు. విమానం కుదుపులకు లోనైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా  మారింది.

స్కాండినేవియన్ ఎయిర్ లైనస్‌కు  చెందిన విమానం 254 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉంది. ఇంతలో మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో ‍ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడగా.. మరికొందరైతే ఏకంగా ఫ్లైట్‌ పైకప్పుకు గుద్దుకున్నారు.

చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్‌లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు ఆందోళన చెందారు. గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో ల్యాండ్‌​ చేశాడు. 

అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని సంబంధిత స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రయాణీకులకు రాత్రిపూట హోటల్‌లో వసతి కల్పించామని, శుక్రవారం ఉదయం ఇతర విమానాలలో వియామికి వెళ్లేందుకు షెడ్యూల్‌ చేసినట్లు పేర్కొ​న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement