Turbulence
-
Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. స్వీడన్ నుంచి అమెరికాలోని మియామి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని యూటర్న్ చేసుకొని తిరిగి యూరప్‌లో ల్యాండ్ చేశారు. విమానం కుదుపులకు లోనైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్కాండినేవియన్ ఎయిర్ లైనస్‌కు చెందిన విమానం 254 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉంది. ఇంతలో మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడగా.. మరికొందరైతే ఏకంగా ఫ్లైట్ పైకప్పుకు గుద్దుకున్నారు.చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్‌లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు ఆందోళన చెందారు. గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో ల్యాండ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని సంబంధిత స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రయాణీకులకు రాత్రిపూట హోటల్లో వసతి కల్పించామని, శుక్రవారం ఉదయం ఇతర విమానాలలో వియామికి వెళ్లేందుకు షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.🚨 #BreakingNow A video from #SK957 cabin as extreme turbulence hit a SAS A330 over Greenland,throwing unbuckled passengers into the ceiling.This incident highlights how turbulence can occur without warning,making seatbelts essential for passenger safety. https://t.co/iYVA4IIUER pic.twitter.com/S4kCaKwnn0— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) November 15, 2024 -
విమానంలో భారీ కుదుపులు.. 30 మందికి గాయాలు
విమానం గాల్లో ఉండగా కుదుపులకు లోనవడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఏగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఓ అంతర్జాతీయ విమానంలో చోటుచేసుకుంది. ఎయిర్ యూరోపా 787-9 డ్రీమ్ లైనర్ విమానం బ్రెజిల్‌కు సమీపంలోకి వస్తుండగా గాల్లో తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.అదే సమయంలో కదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పైకప్పులో ఉన్న హెడ్ బిన్‌లోకి దూరిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. మరికొంతమంది తమ సీట్ల నుంచి దూరంగా నెట్టివేయబడ్డారు.మొత్తం 30 మంది ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో బ్రెజిల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇందులో ఓ వీడియోలో విమానం ఓవర్ హెడ్ బిన్లో నుంచి ఒక వ్యక్తి కాళ్లను బయటకు తీయడం కూడా కనిపించింది.Strong turbulence on an Air Europa Boeing 787-9 Dreamliner flight from Madrid to Montevideo threw passengers out of their seats, with one man stuck in an overhead compartment.A total of 30 passengers were injured, while the flight made an emergency landing in Brazil. There… pic.twitter.com/Q35hkl2VWe— Vani Mehrotra (@vani_mehrotra) July 2, 2024 -
విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్ ఎయిర్‌లైన్స్
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు. Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv— Josh Cahill (@gotravelyourway) May 21, 2024 Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC— Bandit (@BanditOnYour6) May 21, 2024 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు.ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు. -
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
వాతావరణ మార్పులతో... అల్లకల్లోలం
వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. అయితే ఠారెత్తించే ఎండలు లేదంటే కుండపోత వర్షాలతో కేవలం భారత్ మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాలు సతమతమవుతున్నాయి. 2022 సంవత్సరంలో 81 విపత్తులు ఆసియా దేశాలను వణికించాయి. అందులో అత్యధిక భాగం వరదలు తుపాన్లే ఉన్నాయి. కరువు కాటకాలతో కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా పోతే మరికొన్ని దేశాలు వరదలతో విలవిలలాడాయి. ఈ పరిస్థితులతో ఆసియాలో ఆహార భద్రత సమస్య తలెత్తుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సామాజికంగా ఆర్థికంగా ఈ దేశాలు మరింత విచి్ఛన్నమవుతాయని డబ్ల్యూఎంఒ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోనే ఆసియా ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతోంది. 1961–1990 మధ్య సగటు వేడి కంటే 1991–2022 మధ్య కాలంలో ఆసియా ఖండంలో వేడిమి రెట్టింపు అయింది. వరదలు, తుపాన్లతో పాటుగా పశి్చమాసియా దేశాలు ఇసుక తుపాన్లతో విలవిలలాడాయి. ‘‘2022లో వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా దేశాలపై విపరీతమైన ప్రభావం చూపించింది. సాధారణం కంటే అధిక వేడి, పొడి వాతావరణంతో చైనా కరువు పరిస్థితుల్ని ఎదుర్కొంది. దీని వల్ల నీటి లభ్యత తగ్గిపోవడమే కాకుండా విద్యుత్ రంగంపై కూడా ప్రభావం పడింది. కేవలం కరువు కారణంగా చైనాలో ఒక్క ఏడాది 706 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వచ్చింది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్, భారత్‌లు వరదలు, తుపాన్లతో అల్లాడిపోయాయి’’ అని డబ్ల్యూఎంఒ ప్రధానకార్యదర్శి ప్రొఫెసర్ పెట్రి టాలస్ వెల్లడించారు. ఈ అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల వ్యవసాయం, ఆహార భద్రతపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, ఆసియా దేశాల్లో ప్రభుత్వాలు ఆహార భద్రత సవాల్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. నివేదిక ఏం చెప్పిందంటే ..! ఆసియా ఖండంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. 2022 రెండో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది. 1991–2020 సగటు కంటే ఎక్కువగా 0.72డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ► కరువుతో ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోయాయి. నీటి వనరులు తరిగిపోయాయి. ఒక్క చైనాలో కరువు కారణంగా 706 కోట్ల అమెరికా డాలర్ల నష్టం వచి్చంది ► భారీ వర్షాలు, వరదలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం మూడు వారాల్లో ఏడాది మొత్తంగా కురవాల్సి వానలో 60% కురిసింది. పాక్ జనాభాలో 14% మందిపై వరదలు ప్రభావం చూపించాయి ► ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గత 40 ఏళ్లలో హిమానీనదాలు పరిమాణం భారీగా తగ్గిపోయింది. గత కొంతకాలంగా మరింత వేగంగా క్షీణిస్తోంది. 2022లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా చాలా హిమానీనదాలు వేగంగా కరిగిపోవడం మొదలైంది. తూర్పు తియెన్ షాన్‌లో ఉరుమ్కీ గ్లేసియర్ ఉపరితలం నుంచి 1.25 మీటర్ల మేర క్షీణించింది. ► ఆసియా ఖండంలో సముద్ర ఉపరితలాలు వేడెక్కిపోతున్నాయి. 1982 నుంచి సముద్రాలు వేడెక్కడం మొదలైంది. వాయవ్య అరేబియన్ సముద్రం, ఫిలిప్పైన్స్ సముద్రం, తూర్పు జపాన్‌లో సముద్రం మొదలైనవి ప్రపంచంలో సముద్రాలు వేడెక్కే సగటు రేటు కంటే మూడు రెట్లు అధికంగా వేడెక్కుతున్నాయి. గత దశాబ్దంలో 0.5డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడిమి నమోదైంది. ఈ ఏడాది ఇంతే ఆసియాలో ఈ ఏడాది కూడా వివిధ దేశాలను విపత్తులు వణికిస్తున్నాయి. ఇండోనేసియా సమత్రాలో కొండచరియలు విరిగిపడి 15 వేల ఇళ్లు ధ్వంసమైతే లక్ష మందికి పైగా నిరాశ్రయులయ్యారు. చైనాను గత ఏడాది కరువు కాటేస్తే, ఈ ఏడాది వరదలతో అతలాకుతలమవుతోంది. వచ్చే నెలలో మరిన్ని టైఫూన్లు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలు ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హరియాణాలను కూడా వణికించాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకి 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక పాకిస్తాన్‌లోనూ ఈ ఏడాది వరదలకి ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఇలా వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలకు సవాల్ విసురుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాల్లో ఉన్న విమానంలో భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు!
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం భారీ కుదుపు కారణంగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణంలో విమానంలో భారీ కుదుపు కారణంగా ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయి ఆందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. ఎయిరిండియాకు చెందిన బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనైంది. ఒక్కసారిగా విమానం భారీ కుదుపునకు లోనుకావడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా వణికిపోయారు. ఈ క్రమంలో కుదుపు కారణంగా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు. దీంతో, ప్రమాదం తప్పింది అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని.. మరెవరికీ ఆసుపత్రిలో చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్ తెలిపారు. ఈ ఘటన ప్రమాణికులను చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇది కూడా చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి -
విమానానికి భారీ కుదుపులు..
హొనొలులు: సెలవుల్లో సరదాగా గడపాలని బయలుదేరిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు లోనై 36 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. అరిజోనా రాష్ట్రం ఫోనిక్స్ నుంచి హవాయిలోని హొనొలులుకు బయల్దేరిన హవాయి ఎయిర్‌లైన్స్ విమానం అరగంటలో ల్యాండవుతుందనగా భారీ కుదుపులకు లోనైంది. ఆ తాకిడికి ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. పైనున్న లగేజీ క్యాబిన్‌కు గుద్దుకున్నారు. వాటర్ బాటిళ్లు, సెల్ఫోన్లు చెల్లా చెదురుగా పడిపోయాయి. -
Spicejet: భారీగా కుదిపేసిన విమానం.. ప్రయాణికులకు తీవ్రగాయాలు
కోల్‌కతా: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి గాల్లో ఉండగా భారీ కుదుపునకు గురైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ బీ-373 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్జీ-945 ముంబై నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఏడున్నర గంటలకు అది అండల్‌లోని కాజి నజ్రుల్ ఇస్లాం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే కాసేపట్లో గమ్యానికి చేరుతుందనగా.. గాల్లో ఉండగానే అది తీవ్రంగా కుదుపున లోనైంది. దీంతో లగేజీ మీద పడడంతో పలువురు ప్రయాణికులకు(40 మంది దాకా అని కొన్ని కథనాలు.. 17 మంది మరికొన్ని కథనాలు చెప్తున్నాయి ) తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు. అయితే.. ప్రమాదం జరిగినప్పటికీ ఫ్లైట్ దుర్గాపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్యాసింజర్లకు చికిత్స అందించారు. వీళ్లలో కొందరిని డిశ్చార్జి చేయగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పేమీ లేదని అధికారులు అంటున్నారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. బలమైన గాలుల వల్లే కుదుపునకు విమానం లోనైనట్లు తెలుస్తోంది. -
విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు
వాంకోవర్ నుంచి సిడ్నీకి 296 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఒక్కసారిగా కొద్దిసెకన్లు కిందకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద కుదుపులొచ్చాయి. సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు పైకెగిరారు. వారి తలలు సీలింగ్‌కు కొట్టుకున్నాయి. మరికొందరు గాల్లో గింగిరాలు తిరిగారు. రెప్పపాటులో అంతా సద్దుమణిగింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి హొనలూలూకు తీసుకొచ్చారు. విమానం కుదుపులకు 35 మంది గాయపడ్డారు. ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ33(బోయింగ్ 777–200) విమాన ప్రయాణికులకు గురువారం ఎదురయిందీ భయానక అనుభవం. ‘సీట్లలో కూర్చున్న వాళ్లం పైకెగిరి విమానం టాప్కు కొట్టుకున్నాం’ అని అనుభవాన్ని వివరించాడు జెస్ స్మిత్ అనే ప్రయాణీకుడు. విమానం 10,973 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇది జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ ప్రతినిధి తెలిపారు. -
కల్లోల కడలి తరంగం
ఇరోమ్ ఛాను షర్మిల! మణిపూర్ ఉక్కు మహిళ. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను (ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్స్) రద్దు చేయాలంటూ 16 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష చేసిన యువతి, పౌరహక్కుల కార్యకర్త, రాజకీయ నాయకురాలు, కవయిత్రి ఇలా భిన్న భూమికలు పోషించిన వ్యక్తి. ఇప్పుడు సామాజిక సేవ చేసేందుకు జమ్మూ, కశ్మీర్‌కు పయనమవుతామంటున్నారు. అక్కడ మహిళా సాధికారత సాధన కోసం కృషి చేస్తామంటున్నారు. మళ్లీ నిరాహారదీక్ష జోలికి వెళ్లనని, దానికి బదులు మహిళలను చేరుకుని, సమకాలీన ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చలు కొనసాగిస్తానని చెబుతున్నారు. ఇప్పుడిక భారత్ బోర్డర్‌కి మణిపూర్‌లో మాదిరిగానే కశ్మీర్‌లోనూ భద్రతాదళాల ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయి. అందువల్లే అక్కడకు వెళ్లి కశ్మీర్ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన, చైతన్యాన్ని కలిగించి ఈ నిరంకుశచట్టాలపై గళమెత్తేలా చేస్తానంటున్నారు షర్మిల. ‘‘కశ్మీర్లో వివిధ వయసుల్లోని మహిళలను కలుసుకుని వారి సమస్యలేమిటో తెలుసుకుంటాను. వాటికి పరిష్కారాలేమిటన్న దానిపై చర్చిస్తాను’’ అని ఆమె అంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని, కేవలం ప్రజలనే కలుసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. తన ఉద్యమం ద్వారా అక్కడి మహిళలు ప్రభుత్వాన్ని సరైన దిశలో కదిలించగలగాలన్నదే తన ఆశ, తాపత్రయమని అన్నారు.‘‘భారత్–పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం పాటు ఘర్షణలు కొనసాగడం బాధాకరం. పొరుగు దేశాలుగా స్నేహసంబంధాలుంటే బావుంటుంది. ఈ రెండుదేశాల మధ్య శాంతిస్థాపనకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధమే’’నని కూడా ఇరోమ్ ప్రకటించారు! ఓటమి మంచి అనుభవం! ప్రత్యేక అధికారాల పేరిట సైనిక దళాలు ప్రజల హక్కులు హరించడాన్ని ఎలుగెత్తి చాటి, విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాల రద్దు కోసం పోరాడిన ధీర వనితగానే షర్మిల గుర్తిండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహారదీక్ష చేసిన వ్యక్తిగా (ముక్కుకు అమర్చిన గొట్టం ద్వారా ఆహారం ) అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నా, రాజకీయ నాయకురాలిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి! ఈ ఎన్నికల ఫలితం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పిదం కాదని, అదో మంచి అనుభవం కింద గుర్తుంచుకుంటానని షర్మిల అంటున్నారు. ‘నా రాష్ట్ర, దేశ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని వారిని నేరుగా కలుసుకునేందుకు ఇదొ సువర్ణావకాశం’ అంటారు తన ఈ రెండో ప్రస్థానం గురించి. ‘ఓ మనిషిగా జీవించేందుకు, నేను కోరుకున్న హక్కుల సాధనకు కట్టుబడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాను. అందువల్లే నా మనుషులను, నా బంధువులను కాదని, నేను పుట్టిన నేల, సొంత ప్రాంతాన్ని విడిచి వచ్చేశాను’ అంటారు షర్మిల. అంతేకాదు, ఇక ప్రతీరోజు నేను పాటలు పాడుతూ, కూనిరాగాలు తీస్తూ, స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ప్రార్థిస్తాను అని కూడా ప్రకటించేశారు ఇరోమ్ షర్మిలా! ప్రస్తుతం ఆమె తరచు మణిపూర్, కశ్మీర్‌ల మధ్య ప్రయాణిస్తున్నారు. అన్నీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలే! 2000 నవంబర్‌లో భద్రతాదళాల కాల్పులకు 10 మంది అమాయకులు బలికావడాన్ని నిరసిస్తూ అనూహ్యంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నట్టు ప్రకటించి, పదహారేళ్ల పాటు కొనసాగించడం.. ఈ దీక్ష సందర్భంగా కన్నతల్లిని సైతం ఒకే ఒకసారి కలుసుకోవడం ఒక ఆశ్చర్యం! మాతృమూర్తిని పదే పదే కలిస్తే నిరాహారదీక్షపై తన ధృఢచిత్తం ఎక్కడ సడలుతుందోననే ఆమె భయం. అలాగే.. ఎంత సుదీర్ఘకాలం దీక్షలో కూర్చున్నా.. అంతే అకస్మాత్తుగా దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించడం, అందుకోసం రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం మరో ఆశ్చర్యం. పుట్టినగడ్డ అయిన మణిపూర్‌లో స్థానికుల హక్కుల పరిరక్షణకు వీరోచితంగా పోరాడి, ఆ నేలను విడిచిపెట్టి తమిళనాడులోని కొడైకెనాల్కి వచ్చి స్థిరపడాలని అనుకోవడం, అదీ కూడా.. గోవా మూలాలున్న బ్రిటిష్–భారత సంతతికి చెందిన డెస్మండ్ కౌటిన్హొతో లేఖల ద్వారా ప్రేమలో వాళ్లిద్దరూ ప్రేమలో పడి అది పెళ్లికి దారితీయడం వరకు.. ఇలా షర్మిల జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి నిర్ణయం ఆశ్చర్యం గొలిపేదే. – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెనుగాలి.. విమానం అతలాకుతలం
బీజింగ్: చైనాకు చెందిన ఓ విమానాన్ని పెనుగాలి అతలాకుతలం చేసింది. ప్యారిస్ నుంచి చైనాలోని కున్మింగ్కు వస్తున్న విమానాన్ని పెద్దగాలి చుట్టుముట్టడంతో దాదాపు అందులోని 26మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఎంయూ 774 అనే విమానం ప్యారిస్ నుంచి వస్తుండగా అనూహ్యంగా ఒక పెద్ద గాలి చుట్టుముట్టి గందరగోళం సృష్టించింది. రెండుసార్లు భారీగా, మూడుసార్లు మెల్లగా ఈ టర్బులెన్స్ తాకడంతో ప్రయాణీకుపై ఉండే లాకర్స్ తెరుచుకొని అందులోని వస్తువులు వారి తలలపై పడ్డాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే నెల 11న కూడా చైనాలోని షాంఘైకు చెందిన మరో విమానం ఎంయూ 736 కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది.