పెనుగాలి.. విమానం అతలాకుతలం
బీజింగ్: చైనాకు చెందిన ఓ విమానాన్ని పెనుగాలి అతలాకుతలం చేసింది. ప్యారిస్ నుంచి చైనాలోని కున్మింగ్‌కు వస్తున్న విమానాన్ని పెద్దగాలి చుట్టుముట్టడంతో దాదాపు అందులోని 26మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఎంయూ 774 అనే విమానం ప్యారిస్ నుంచి వస్తుండగా అనూహ్యంగా ఒక పెద్ద గాలి చుట్టుముట్టి గందరగోళం సృష్టించింది.
రెండుసార్లు భారీగా, మూడుసార్లు మెల్లగా ఈ టర్బులెన్స్ తాకడంతో ప్రయాణీకుపై ఉండే లాకర్స్ తెరుచుకొని అందులోని వస్తువులు వారి తలలపై పడ్డాయి. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే నెల 11న కూడా చైనాలోని షాంఘైకు చెందిన మరో విమానం ఎంయూ 736 కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది.