విమానంలో భారీ కుదుపులు.. 30 మందికి గాయాలు | Video: Turbulence on Spanish flight throws man into overhead bin 30 injured | Sakshi
Sakshi News home page

వీడియో: గాల్లో కుదుపులకు లోనైన విమానం.. ఓవర్‌హెడ్‌ బిన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

Published Tue, Jul 2 2024 10:44 AM | Last Updated on Tue, Jul 2 2024 11:28 AM

Video: Turbulence on Spanish flight throws man into overhead bin 30 injured

విమానం గాల్లో ఉండ‌గా కుదుపుల‌కు లోన‌వ‌డం అప్పుడ‌ప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఓ విమానం కుదుపులకు ప్రయాణికుడు ఏకంగా ఏగిరి పైకప్పులో ఇరుక్కుపోయాడు. ఈ ఘ‌ట‌న స్పెయిన్ నుంచి ఉరుగ్వే వెళ్తున్న ఓ అంతర్జాతీయ విమానంలో చోటుచేసుకుంది. ఎయిర్ యూరోపా 787-9 డ్రీమ్ లైన‌ర్ విమానం బ్రెజిల్‌కు స‌మీపంలోకి వ‌స్తుండ‌గా గాల్లో తీవ్ర కుదుపుల‌కు లోనైంది. దీంతో పైలట్లు విమానాన్ని ఎంత అదుపు చేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

అదే సమయంలో కదుపుల తీవ్రతకు ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పైకప్పులో ఉన్న హెడ్ బిన్‌లోకి దూరిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది, తోటి ప్రయాణికులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. మ‌రికొంత‌మంది త‌మ సీట్ల నుంచి దూరంగా నెట్టివేయ‌బ‌డ్డారు.

మొత్తం 30 మంది ప్రయాణికులు ఈ కుదుపుల కారణంగా తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో బ్రెజిల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఇందులో ఓ వీడియోలో విమానం ఓవర్ హెడ్ బిన్‌లో నుంచి ఒక వ్యక్తి కాళ్లను బయటకు తీయడం కూడా కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement