ప్రయాణికుడికి చికిత్స చేస్తున్న సిబ్బంది
వాంకోవర్ నుంచి సిడ్నీకి 296 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఒక్కసారిగా కొద్దిసెకన్లు కిందకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద కుదుపులొచ్చాయి. సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు పైకెగిరారు. వారి తలలు సీలింగ్‌కు కొట్టుకున్నాయి. మరికొందరు గాల్లో గింగిరాలు తిరిగారు. రెప్పపాటులో అంతా సద్దుమణిగింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి హొనలూలూకు తీసుకొచ్చారు. విమానం కుదుపులకు 35 మంది గాయపడ్డారు. ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ33(బోయింగ్ 777–200) విమాన ప్రయాణికులకు గురువారం ఎదురయిందీ భయానక అనుభవం. ‘సీట్లలో కూర్చున్న వాళ్లం పైకెగిరి విమానం టాప్‌కు కొట్టుకున్నాం’ అని అనుభవాన్ని వివరించాడు జెస్ స్మిత్ అనే ప్రయాణీకుడు. విమానం 10,973 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇది జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment