Boeing 777
-
Anny Divya: దివ్యమైన విజయం
స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది. ‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు. కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్ఎల్బీ పట్టా కూడా పొందింది. ఎగతాళి చేసేవారు ‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు. సవాల్‌గా తీసుకున్నాను.. ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్షిప్ కూడా వచ్చింది. సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య. -
ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్
అమె అతి చిన్న వయసులో బోయింగ్ –777 నడిపింది. తోడుగా నలుగురు మహిళా కెప్టెన్లను తీసుకొని కమాండింగ్ ఆఫీసర్‌గా ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఎగరేసి శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరు చేరుకుంది. ఇంతకాలం జోయా అగర్వాల్ ఘనతలు తెలుసు. ఆమె జీవితం తెలియదు. పైలెట్ కావడానికి తాను ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందో చెప్పి ‘ఎనిమిదేళ్ల వయసులోనే నేను ఈ కలను కని సాధించుకున్నాను’ అందామె. ఆమె స్ఫూర్తి గాథ ఇది. జోయా గురించి ఏం చెప్పాలి? కోవిడ్ మొదలయ్యాక ప్రభుత్వం తలపెట్టిన ‘వందే భారత్ మిషన్’లో ఒక మహిళా పైలెట్‌గా పాల్గొని ఎయిర్ ఇండియా విమానాలను ఎగరేసి 12 దేశాల నుంచి 64 ట్రిప్పులు వేసి దాదాపు 15000 మంది భారతీయులను స్వదేశం చేర్చింది ఆమె. 2021 జనవరి నెలలో మరో నలుగురు మహిళా పైలెట్లతో కలిసి ఎయిర్ ఇండియా విమానం ముఖ్య పైలెట్‌గా శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకూ ఉత్తర ధ్రువం మీదుగా (ఆ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల వరకూ ఉంటుంది) 17 గంటలు ఏకధాటిగా నడిపి రికార్డు సృష్టించిందామె. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే జోయా అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలు పంచుకుంది. ఢిల్లీ ఆకాశంలో ఆకాశంలో ఎగిరే విమానాన్ని అందరూ చూస్తారు. కాని ఆ విమానం వీపున ఎక్కి ప్రపంచాన్ని చుట్టాలని కొందరే కలలు గంటారు. ఢిల్లీకి చెందిన జోయ చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు చూసేది. అప్పుడు ఆమెకు 8 ఏళ్ల వయసు. ‘ఆ విమానంలో నేను ఉంటే చుక్కలను చుట్టేద్దును కదా’ అని అనుకునేది. ఆ సమయంలోనే దూరదర్శన్‌లో రాజీవ్ గాంధీ కనిపించేవారు. ఎవరి మాటల్లోనో రాజీవ్ గాంధీ గతంలో పైలెట్‌గా పని చేశారని వింది జోయ. అప్పుడు ఆమెకు అనిపించింది తాను కూడా పైలెట్ కావాలని. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. అలాంటి కుటుంబంలో ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనకూడదని సమాజం అనుకుంటుంది. కాని జోయకు లెక్కలేదు. తానొక కల కంది. దానిని నిరూపించుకుంటుంది అంతే. పది తర్వాత పదోక్లాసు వరకూ ఎలాగో తన మనసులోని కోరికను ఉగ్గపట్టుకున్న జోయ పది రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన మనసులోని కోరిక తల్లిదండ్రులకు చెప్పింది. ‘ఓరి దేవుడో... డిగ్రీ చేయించి ఏదో ఒక మంచి ఇంట్లో పెళ్లి చేద్దామంటే ఈ అమ్మాయికి ఇదేం కోరిక’ అని తల్లి ముక్కు చీదడం మొదలెట్టింది. తండ్రి ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని ఆందోళన చెందాడు. జోయ మరో దారిలేక ఇంటర్లో చేరింది. మంచి మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ చేస్తూ మరోవైపు ఒక ఇన్స్టిట్యూట్లో ఏవియేషన్ కోర్సు చేసింది. అంటే తల్లిదండ్రుల కోసం డిగ్రీ... తన కోసం ఏవియేషన్. డిగ్రీలో కూడా మంచి మార్కులు వచ్చాక ‘నన్ను ఇప్పటికైనా పైలెట్‌ను కానివ్వండి’ అని తల్లిదండ్రులను కోరింది. తండ్రి అప్పుడు కూడ భయం భయంగానే లోను తెచ్చి ఆమె పైలెట్ కోర్సుకు డబ్బు కట్టాడు. మనసంతా పెట్టి ఆ కోర్సు పూర్తి చేసింది జోయ. 3000 మందితో పోటీ పడి పైలెట్ చదువు పూర్తయ్యాక రెండేళ్లు ఖాళీగా ఉన్న జోయ ఎయిర్ ఇండియాలో 7 పైలెట్ పోస్టులు పడ్డాయని తెలిసి ఎగిరి గంతేసింది. అయితే ఆ 7 పోస్టుల కోసం 3000 మంది దరఖాస్తు చేశారని తెలిసి కంగారుపడినా పట్టుదలగా ప్రయత్నించింది. ముంబైలో వారంలో పరీక్ష అనగా తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తండ్రి ప్రోత్సాహంతో పరీక్షకు హాజరై ఇంటర్వ్యూలు దాటి ఆపాయింట్మెంట్ లెటర్ సాధించింది. 2004లో తన మొదటి ఫ్లయిట్‌ను దుబాయ్‌కు నడిపింది. ‘ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. నాన్న చేసిన అప్పులు తీర్చేశాను. అమ్మకు డైమండ్ కమ్మలు తెచ్చి పెట్టాను’ అంటుంది జోయ. ఆమె బోయింగ్ – 777ను నడిపిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది కూడా. స్త్రీల ప్రపంచం ‘నేను పైలెట్ అయినప్పుడు కోర్సులో చదువు చెప్పేవారు, ఉద్యోగంలో సహ ఉద్యోగులు అందరూ పురుషులే. మహిళా పైలెట్లు వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉండేవారు. స్త్రీలు తమ సమర్థతను చాటుకునేందుకు చాలా ఘర్షణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాని ప్రయత్నిస్తే ఆ ఘర్షణకు ఆవల విజయం ఉంటుంది. నేను ఎప్పుడూ నా హృదయం చెప్పినట్టే వింటాను. నాకేదైనా సవాలు ఎదురైనప్పుడు 8 ఏళ్ల వయసు లో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది కదా... ఇప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటాను అనుకుని ముందుకు సాగుతాను.’ అంటుంది జోయ. ‘స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అనుకునే సమాజం ఇంకా మన దేశంలో ఉంది. కాని స్త్రీలు తమ హృదయం చెప్పినట్టు విని తాము దేనికైతే సమర్థులో ఆ సమర్థత చాటుకోవాలి. వారే కాదు ప్రతి ఒక్కరూ తమదైన కలను కని సాధించుకోవాలి’ అంటుంది జోయ. ఢిల్లీలో డాబా ఎక్కి విమానం చూసిన 8 ఏళ్ల చిన్నారి ఒకనాడు సుదీర్ఘమైన విమానయానం చేసి రికార్డు సృష్టించడాన్ని మించిన స్ఫూర్తిగాథ ఉందా. అలాంటి గాథలకు ఉదాహరణలుగా మనమెందుకు నిలవకూడదు? -
ఇంజిన్‌లో మంటలు..24 విమానాలు బంద్!
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని డెన్వర్, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో చోటుచేసుకున్న బోయింగ్ విమాన ప్రమాదాలు కలకలం రేపాయి. డెన్వర్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు నేలపై పడడం, అత్యవసర ల్యాండింగ్ ఘటనలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) దర్యాప్తుకు ఆదేశించింది. ప్రమాదానికి గురైన ఆ బోయింగ్–777 రకం విమానానికి ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉందని గుర్తించింది. ఈ రకం ఇంజిన్ ఉన్న అన్ని బోయింగ్–777 విమానాలను తనిఖీ చేయాలనీ, వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టాలని ఆదేశించింది. సోదాలు పూర్తయ్యే వరకు ఆ మోడల్ ఇంజిన్ ఉన్న విమానాలను ఉపయోగించరాదని బోయింగ్ కూడా విమానయాన సంస్థలకు ఎఫ్ఏఏ సూచించింది. విమానయానసంస్థలు, అధికారులతో సహకరించేందుకు తమ బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తెలిపింది. డెన్వర్ ఘటనతో 24 విమానాలను వినియోగించరాదని నిర్ణయించినట్లు ఆ సంస్థ తెలిపింది. డెన్వర్ శివారు ప్రాంతంలో ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్–777 విమానం ఇంజిన్ నుంచి పొగలు రావడంతోపాటు, రెక్క, తదితర భాగాలు నేలపై పడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి, పరీక్షించగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు రెండు విరిగిపోగా మిగతా వాటికి పగుళ్లు వచ్చినట్లు తేలింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు 231 మంది, 10 మంది సిబ్బంది సహా ఎవరికీ హాని జరగలేదని అధికారులు తెలిపారు. ఈ రకం ఇంజిన్ ఉన్న బోయింగ్ విమానాలు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మాత్రమే ఉన్నాయి. డెన్వర్ ఘటన నేపథ్యంలో జపాన్ ఎయిర్వేస్, ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ సంస్థలు తమ 32 బోయింగ్ రకం విమానాలను ప్రస్తుతానికి నడపరాదని నిర్ణయించాయి. నెదర్లాండ్స్ ఘటన.. నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్లో బోయింగ్–747 రకం సరకు రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలోనూ డెన్వర్ ఘటనకు కారణమైన ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తయారీ ఇంజిన్ ఉండటం గమనార్హం. లాంగ్ టెయిల్ ఏవియేషన్‌కు చెందిన ఈ విమానం మాస్ట్రిచ్ నుంచి న్యూయార్క్‌కు ఆదివారం సాయంత్రం బయలుదేరి కొన్ని నిమిషాలకే పొగలు రేగి, ఇంజిన్ నుంచి కొన్ని భాగాలు పడిపోవడం మొదలైంది. వీటి కారణంగా వృద్ధురాలు, బాలుడు గాయపడ్డారు. ఇంజిన్ భాగాల తాకిడికి మీర్సెన్లోని పలు గృహాలు దెబ్బతిన్నాయి. ఈ విమానాన్ని పొరుగునే ఉన్న బెల్జియంలోని లీజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే అందులోని నాలుగు ఇంజిన్లలో ఒకదాని నుంచి మంటలు లేచాయని డచ్ ఎయిర్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఇంజిన్లోకి ఒక వస్తువు అడ్డుపడటంతో టర్బైన్ బ్లేడ్లు విరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అన్నారు. మా గగనతలంలోకి రావద్దు డెన్వర్ ఘటన నేపథ్యంలో యూకే స్పందించింది. ప్రాట్ అండ్ విట్నీ తయారీ ఇంజిన్లున్న బోయింగ్–777 విమానాలు తమ గగనతలంలో ప్రయాణించరాదంటూ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విమానాలు యూకే ఎయిర్‌లైన్స్‌లో లేవనీ, వీటి వినియోగాన్ని అమెరికా, జపాన్, ద.కొరియా అధికారులు నిలిపివేశారని తెలిపింది. చదవండి: విమానంలో మంటలు.. 231 మంది ప్రయాణికులు! -
16 వేల కిమీ.. 17 గంటలు.. అంతా మహిళలే
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది రికార్డు సృష్టించబోతున్నారు. లాంగెస్ట్ కమర్షియల్ ఫ్లైట్ జర్నీ చేయబోతున్నారు. సుమారు 17 గంటల పాటు.. 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానంలో ఈ ప్రయాణం చేయబోతున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగుళూరు వరకు ఈ ప్రయాణం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏఐ 176 విమానంలో ప్రధాన పైలట్, కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘సుమారు 16 వేల కిలోమీటర్ల దూరం పూర్తిగా మహిళా సిబ్బందితోనే ఈ సుదీర్ఘ ప్రయాణం కొనసాగబోతుంది. మేం ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర విమానయానం చేయనున్నాం.. అయితే ఇది ఇది సౌర వికిరణాలు, అల్లకల్లోలం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండనుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కానీ మేం దీన్ని పూర్తి చేయాలని బలంగా నిర్ణయించకున్నాం. చరిత్రని తిరగరాస్తమనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ విమానం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు (స్థానిక సమయం) సాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరి 2021 జనవరి 11 న తెల్లవారుజామున 3.45 గంటలకు (స్థానిక సమయం) బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. (చదవండి: ఆమె పేరుతో ‘ఎయిర్ ఇండియా’లో రికార్డు) ఆర్కిటిక్ మీదుగా ప్రయాణించడం వలన రెండు సాంకేతిక కేంద్రాలైన బెంగళూరు, సాన్ ఫ్రాన్సిస్కోల మధ్య దూరం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాలు సుమారు 13,993 కిలోమీటర్ల దూరంలో.. ప్రపంచం వ్యతిరేక చివరలలో 13.5 గంటల టైమ్ జోన్ లాగ్‌తో ఉంటాయి. ఈ మార్గంలో సాన్ ఫ్రాన్సిస్కో-సీటెల్-వాంకోవర్ ఉంటాయి. ‘మేము ఉత్తరాన 82 డిగ్రీల వరకు వెళ్తాము. సాంకేతికంగా చెప్పాలంటే మేం ధృవం మీద ప్రయాణం చేయం.. దాని పక్కనే ఉంటాము. ఆపై మేము దక్షిణాన, చాలావరకు రష్యా మీదుగా.. దక్షిణాన ఇంకా కిందుగా బెంగళూరుకు వస్తాము" అని విమానంలో ఉన్న నలుగురు పైలట్లలో ఒకరు, కెప్టెన్ పాపగారి తన్మై వెల్లడించారు. ఫ్లైట్ సేఫ్టీ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కెప్టెన్ నివేదా భాసిన్ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఎయిరిండియాపై టాటా గురి..) ఇది ప్రయాణం అమెరికా వెస్ట్ కోస్ట్, దక్షిణ భారతదేశం మధ్య మొట్టమొదటి నాన్-స్టాప్ రూట్ అని ఎయిర్‌లైన్ తెలిపింది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా తన మొదటి నాన్-స్టాప్ సర్వీసును హైదరాబాద్-చికాగో మధ్య జనవరి 15 నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. -
నార్త్‌పోల్ మీదుగా..!
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన మహిళా పైలట్ల బృందం చరిత్ర సృష్టించనుంది. బోయింగ్ 777 విమానంలో సాన్ ఫ్రాన్సిస్కో నుంచి ప్రారంభమై ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర వైమానిక మార్గంలో ప్రయాణించి నేడు(జనవరి 9)న బెంగళూరు చేరుకోనుంది. ఈ ప్రయాణంలో మొత్తం 16 వేల కిలోమీటర్లు ఈ బృందం పయనిస్తుంది. ఉత్తర ధృవం మీదుగా విమానాన్ని నడపడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. ఈ మార్గంలో వైమానిక సంస్థలు సహజంగా ఎంతో అనుభవం ఉన్న, అత్యుత్తమ పైలట్లనే పంపుతారు. ఈ సారి ఎయిర్ఇండియా ఈ బాధ్యతను ఒక మహిళా పైలట్‌కు అప్పగించింది. ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా మహిళా కెప్టెన్ జోయా అగర్వాల్ నాయకత్వంలోని మహిళా పైలట్ల బృందం నడుపుతోంది. ‘పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా నాపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఉత్తర ధృవం మీదుగా అత్యంత సుదూర మార్గంలో బోయింగ్ 777 విమానాన్ని నడిపే అద్భుత అవకాశం నాకు లభించింది’అని జోయా అగర్వాల్ పేర్కొన్నారు. తన్మయి పాపగిరి, ఆకాంక్ష సోనావానే, శివానీ మన్హాస్ వంటి అత్యంత అనుభవజ్ఞులైన మహిళా పైలట్ల బృందం తనకు సహకరిస్తోందని తెలిపారు. -
ప్రధాని కోసం మరో ప్రత్యేక విమానం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించడం కోసం మరో విమానం సిద్ధం అయ్యింది. వారు ప్రయాణించడానికి రెండు బోయింగ్ 777 విమానాలు సిద్ధం చేయగా వాటిలో రెండోది ప్రేజ్ శనివారం నాడు రాజధాని ఢిల్లీకి చేరుకోనుంది. వీటిలో మొదటి విమానం, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీలో ల్యాండ్ అయ్యేలా కాన్ఫిగర్ చేయబడింది. బోయింగ్ 777-300 ఈఆర్ అనే రెండు విమానాలు 2018లో ఎయిర్ ఇండియాలో చేరాయి. ఈ రెండు విమానాలు క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి 2024లో అమెరికా అధ్యక్షుడికి ఏర్పాటు చేయబోయే విమానాలులాగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-200 బీ సిరీస్ విమానాలు సిద్ధం చేస్తున్నారు. ఇవి కూడా వాటితో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు రాష్టపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎవరు విదేశాలకు ప్రయాణించాలన్నా ప్రతిసారి ప్రభుత్వం ఎయిర్ ఇండియాను అభ్యర్థించి విమానాలను సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా వారి కోసమే ప్రత్యేకవిమానం వచ్చేసింది. ఇవి ఈ ఏడాది ఆగస్టులోనే ఇండియాకు రావాల్సి ఉండగా కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. ఎయిర్ ఇండియాతో పాటు భారత వైమానిక దళం నుంచి వచ్చిన పైలట్ల ఈ విమానాన్ని నడుపనున్నారు. చదవండి: అక్కడ ఇక స్కాచ్ దొరకదా? కేంద్రం కీలక ఆదేశాలు -
ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్–777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకతలివీ ► ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)ను అమర్చారు. ► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు. ► అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది. ► ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. ► ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. -
ప్రధాని కోసం ప్రత్యేక విమానం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశంలోని అత్యంత ప్రముఖుల పర్యటనల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు బీ 777 విమానాలు ఈ సెప్టెంబర్‌లో ఎయిర్ ఇండియా సంస్థకు అందనున్నాయి. ఈ మేరకు బోయింగ్ సంస్థ నుంచి సమాచారం అందినట్లు సోమవారం అధికారులు తెలిపారు. నిజానికి ఆ విమానాల డెలివరీ జూలైలోనే జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా జాప్యం చోటు చేసుకుందన్నారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా, భారత వైమానిక దళానికి చెందిన పైలట్లు నడుపుతారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణాల కోసం ‘ఎయిర్ ఇండియా వన్’ పేరుతో ఉన్న బీ 747 విమానాలను వినియోగిస్తున్నారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లే నడుపుతున్నారు. వీవీఐపీ ప్రయాణాలు లేని సమయాల్లో ఈ విమానాలు సాధారణ వాణిజ్య ప్రయాణాలకు కూడా వినియోగిస్తున్నారు. అయితే, ఈ బీ 777 విమానాల్లో ఇకపై వీవీఐపీలు మాత్రమే ప్రయాణిస్తారు. ఈ రెండు విమానాలు 2018లోనే కొన్ని నెలల పాటు ఎయిర్ ఇండియా వాణిజ్య ప్రయాణాల్లో భాగంగా ఉన్నాయి. తరువాత వాటిని వీవీఐపీ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మార్పులు చేయాలని కోరుతూ బోయింగ్ సంస్థకు తిరిగి పంపించారు. బీ 777 విమానాల్లో ‘లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్(ఎల్ఏఐఆర్సీఎం) పేరుతో అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ, సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీట్స్(ఎస్పీఎస్) ఉంటాయి. 19 కోట్ల డాలర్ల విలువైన ఈ రెండు రక్షణ వ్యవస్థలను భారత్‌కు అమ్మేందుకు అమెరికా ఈ ఫిబ్రవరిలో ఆంగీకరించింది. -
మోదీ కొత్త విమానం ఎప్పుడు వస్తుందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానాల లిస్ట్‌లో మరో రెండు అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. ప్రధాని సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు బోయింగ్-777 విమానాలను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయాణిండం కోసం కూడా ఈ విమానాలను ప్రభుత్వం వినియోగించనుంది. ఈ ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ విమానాల డెలివరీ ఆలస్యం అయ్యింది. దీంతో ఈ విమానాలు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ ఇక నుంచి అమెరికా బోయింగ్ సంస్థ రూపొందించిన బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించనున్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానం బోయింగ్ 747 ను ఎయిర్ఇండియా ఫైలట్లు నడుపుతుండగా బోయింగ్ 777 విమానాలను మాత్రం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైలెట్లు నడపనున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు పైలట్లకు B777 విమానం నడపడంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ విమానాల మెయింటెయినెన్స్‌ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ తీసుకుంటుంది. ఇక ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. ప్రధాన మంత్రికి మరింత రక్షణను ఇచ్చేలా లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ఉన్నాయని అమెరికా బోయింగ్ సంస్థ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లను 190 మిలియన్ డాలర్లకు భారత్‌కు అమ్మేందుకు అమెరికాతో ఒప్పందం జరిగింది. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’) -
గాల్లో ఉండగానే విమానంలో మంటలు
లాస్ ఏంజెల్స్ : ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు రేగడం కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఉదయం లాస్ ఏంజెల్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన అధికారులు అత్యవసర ల్యాండింగ్ పేరిట విమానాన్ని కిందకు దించారు.కాగా ఈ సమయంలో 347 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి గురైన విమానం113 బోయింగ్-777 రకానికి చెందినదని ఆయన పేర్కొన్నారు. విమానానికి మంటలు అంటుకోగానే గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి మాకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమయ్యామని తెలిపారు. ఇదే విషయమై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ స్పందిస్తూ.. ఎలాంటి నష్టం జరగకముందే పైలట్ చాక చక్యంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని తెలిపింది. మద్యాహ్నం 12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని లాస ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ' గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానానికి మంటలు వచ్చాయి. అచ్చం బైక్ కు మంటటు అంటుకున్నట్టుగానే కనిపించింది. తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నామని' 36 ఏళ్ల అండ్రూ అమెస్ పేర్కొన్నారు. అయితే గతంలోనూ బోయింగ్-777 కు చెందిన 737 మాక్స్ విమానంలోనూ ఇదే రీతిలో మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు. -
విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు
వాంకోవర్ నుంచి సిడ్నీకి 296 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఒక్కసారిగా కొద్దిసెకన్లు కిందకు దూసుకెళ్లింది. దీంతో పెద్ద కుదుపులొచ్చాయి. సీటు బెల్టులు పెట్టుకోని ప్రయాణికులు పైకెగిరారు. వారి తలలు సీలింగ్‌కు కొట్టుకున్నాయి. మరికొందరు గాల్లో గింగిరాలు తిరిగారు. రెప్పపాటులో అంతా సద్దుమణిగింది. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి హొనలూలూకు తీసుకొచ్చారు. విమానం కుదుపులకు 35 మంది గాయపడ్డారు. ఎయిర్ కెనడాకు చెందిన ఏసీ33(బోయింగ్ 777–200) విమాన ప్రయాణికులకు గురువారం ఎదురయిందీ భయానక అనుభవం. ‘సీట్లలో కూర్చున్న వాళ్లం పైకెగిరి విమానం టాప్కు కొట్టుకున్నాం’ అని అనుభవాన్ని వివరించాడు జెస్ స్మిత్ అనే ప్రయాణీకుడు. విమానం 10,973 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇది జరిగిందని ఫెడరల్ ఏవియేషన్ ప్రతినిధి తెలిపారు. -
విమానంలోంచి కిందపడిన ఫ్లైట్ అటెండెంట్
ముంబై: ముంబై ఎయిర్‌పోర్టులో ఓ 53 ఏళ్ల మహిళా ఫ్లైట్ అటెండెంట్ ఎయిరిండియా విమానం డోర్‌ను మూసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. దాంతో ఆ మహిళకు తీవ్రగాయాలైనట్లు ఎయిర్‌లైన్స్, ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉన్న బోయింగ్–777 విమానం డోరును మూస్తూ ఫ్లైట్ అటెండెంట్ హర్షా లోబో అదుపుతప్పారు. దీంతో డోర్‌కు మెట్ల నిచ్చెనకు మధ్య ఖాళీలోంచి 20 అడుగుల కింద ఉన్న రన్‌వేపై పడ్డారు. ఆమె కాళ్ల ఎముకలు విరిగాయని.. నానావతి ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. -
ఆ విమానంలో జిమ్, పబ్..
న్యూయార్క్ : ప్రపంచంలో ఓ మూల నుంచి ఇంకో మూలకు 20 గంటల్లో చేరుకునేలా నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రవేశపెట్టేందుకు కాంటాస్ ఎయిర్వేస్ లిమిటెడ్ ఎయిర్‌బస్, బోయింగ్‌లను ఒప్పించింది. సిడ్నీ నుంచి నేరుగా లండన్ లేదా న్యూయార్క్‌లకు పెద్దసంఖ్యలో ప్రయాణీకులను చేరవేసేలా నాన్ స్టాప్ ఫ్లైట్‌ను రూపొందించాలని ఏడాది కిందట బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు తాము విసిరిన సవాల్‌ను అవి స్వీకరించాయని కాంటాస్ సీఈఓ అలన్ జోస్ స్పష్టం చేశారు. తాము కోరుకున్న విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చే స్థితిలో బోయింగ్, ఎయిర్‌బస్‌లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టు సన్‌రైజ్ పేరుతో ఈ భారీ విమానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో కాంటాస్ నిమగ్నమైంది. మూడు వందల మంది ప్రయాణీకులను వారి లగేజ్‌లతో సహా సుదీర్ఘ గమ్యస్ధానాలకు చేరవేసేందుకు అనువుగా ఉండే ఈ విమానంలో ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు అవసరమైన ఇంధనం ఉంటుందని, ఈ విమానంలో చైల్డ్ కేర్ సదుపాయాలు, జిమ్,బార్, స్లీపింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచుతారని కాంటాస్ తెలిపింది. ఈ భారీ విమానంపై ప్రజెంటేషన్స్ ఇచ్చేందుకు ఎయిర్‌బస్, బోయింగ్‌లు సిడ్నీ సందర్శించాయి. కాగా ఈ భవిష్యత్ విమానాలకు సంబంధించి వచ్చే ఏడాది ఆర్డర్ ఇచ్చేందుకు జోస్ సన్నాహాలు చేస్తున్నారు. కాంట్రాక్టు కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లు పోటీపడుతుండటంతో కోరుకున్న ధర, డిజైన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కాంటాస్కు లభించింది. తాము 2022 నాటికి ఈ తరహా తొలి విమానాన్ని అందుబాటులోకి తెస్తామని జోస్ చెబుతున్నారు. -
ఇంతవరకూ చూడని విమానం..!
దుబాయ్ : గల్ఫ్ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కొత్త బోయింగ్ విమానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఇది సాధారణ విమానం కాదు. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి విమానం లేదు. దానిపై కప్పు మొత్తం గాజుతో చేసిందట. సాధారణంగా ఏ విమానంలో అయిన చిన్న కిటికిలోంచి మాత్రమే బయటికి చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ బోయింగ్ 777ఎక్స్‌లో ప్రయాణిస్తూ అందమైన ఆకాశం, విమానాన్ని ఢీ కొడుతున్నట్లు కనిపించే మబ్బులను వీక్షించవచ్చంటూ ఎమిరేట్స్ సంస్థ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో ఆ విమానానికి సంబంధించిన ఫోటోలను ఫోస్ట్ చేసింది. ఈ విమానాలను 2020 కల్లా అందుబాటులోకి తెస్తున్నట్టు కూడా సంస్థ వెల్లడించింది. ఫోటోలు చూసి, వివరాలు చదివిన జనాలు ఇక ఎంచక్క ఆ విమానంలో ఎగిరి ఆకాశపు అందాలను చూద్దాం అంటూ కలలు కన్న వారిని నిద్ర లేపినట్టు ఈ రోజు ఏప్రిల్ ఒకటి అంటే ‘ఫూల్స్ డే’ అంటూ అందర్ని ఫూల్స్‌ని చేసేసింది. గతేడాది కూడా ఈ సంస్థ ఇలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమానం తెస్తున్నామని ప్రకటించింది. దాని పేరును ఏపీఆర్001 గా చెప్పి అందులో స్విమ్మింగ్ పూల్, ఆటల గది, పార్కు, జిమ్ ఉంటాయంటూ అందర్ని ఫూల్స్ చేసింది. Emirates reveals SkyLounge, the most exclusive Onboard Lounge to be introduced on its Boeing 777X fleet from 2020. A completely transparent lounge with unmatched aerial views and unparalleled luxury, Emirates SkyLounge promises window views like no other. A post shared by Emirates (@emirates) on Mar 31, 2018 at 1:24pm PDT -
బోయింగ్ 777కు బాంబు బెదిరింపు
టర్కీ: టర్కీకి చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి కాకుండా మరో చోటకు తరలించి దించివేశారు. టర్కీకి చెందిన టర్కీష్ ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 777 హ్యూస్టన్ నుంచి ఇస్తాంబుల్‌కు బయలు దేరింది. మధ్యలో ఉండగా బాంబు బెదిరింపు రావడంతో ఐర్లాండ్ వైమానిక సంస్థ అధికారుల అనుమతి తీసుకుని ఇస్తాంబుల్ వైపు వెళ్లకుండా ఐర్లాండ్ లో పైలెట్ సురక్షితంగా దించి వేశాడు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారు. విమానం దించినవెంటనే వారందరినీ షానాన్ ఎయిర్ పోర్ట్ లోని సురక్షిత స్థావరానికి తరలించి విమాన తనిఖీ ప్రారంభించారు. -
మరో శకలం లభ్యం: ఎంహెచ్ 370 విమానానిదిగా అనుమానం
కౌలాలంపూర్: ఎంహెచ్ 370 విమానానిదిగా భాబిస్తున్న మరో శకలం హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో ఆదివారం లభించింది. బుధవారం కూడా ఇలాంటిదే ఓ శకలం వెలుగులోకి రావడం, పరీక్షల నిమిత్తం దానిని ఫ్రాన్స్ కు పంపిన సంగతి తెలిసిందే. ఆదివారం కనుగొన్న శకలం.. రీయూనియన్ ద్వీప రాజధాని సెయింట్ డెనిస్ నగరంలో దొరికింది. మొదట దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదేనని, ఏడాదిన్నర కిందట అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం కూడా ఇదే రకానికి చెందినదని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు శకలాలూ ఎంహెచ్ 370వే అయివుంటాయనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. కాగా, అదృశ్యమైన విమానంపై దర్యాప్తునకు సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా.. దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానిదైనా.. విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని కనిపెట్టడం కష్టమని పేర్కొంది. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే. అ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కాగా, ఇన్నాళ్లుగా గాలిస్తున్నా అదృశ్యమైన విమానానికి సంబంధించి ఏలాంటి ఆధారాలను దర్యాప్తు అధికారులు కనుక్కోలేకపోయారు. -
'ఆ శకలం ఎమ్హెచ్ 370 విమానానిదే'
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానికి చెందినదేనని మలేసియా రవాణా శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. గత ఏడాది మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఎమ్హెచ్ 370 బోయింగ్ 777 విమానం 40 నిమిషాల తర్వాత అదృశ్యమైంది. అందులోని 239 మంది మృతి చెందినట్టు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. 'ఈ శకలం బోయింగ్ 777 విమానానికి సంబంధించినది. మలేసియా ఎయిర్ లైన్స్ ఈమేరకు నాకు సమాచారం అందించింద'ని మలేసియా రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై 657 బీబీ నంబర్ ఉందని తెలిపారు. ఇప్పుడు దొరికిన శకలంతో ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహా సముద్రంలోనే కూలిందని ప్రాథమికంగా నిర్ధారణయింది. దీంతో ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ త్వరలోనే వీడడే అవకాశముంది. -
ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777
మానవుడి మేధస్సుకు అద్దం పట్టే ఆవిష్కరణల్లో విమానం ఒకటి. రైట్ సోదరులు దీనికి రూపకల్పన చేసినప్పటి నుంచి ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయి. విమానం వెళ్తున్న చప్పుడు వినగానే ఇంటి బయటకు వచ్చి దాన్ని చూస్తూ కేరింతలు కొట్టని బాల్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక్కసారైనా ఇందులో విహరించాలని కోరిక ఉంటుంది. ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలో అతి పెద్ద విమానంగా ప్రసిద్ధి చెందిన బోయింగ్-777 సేవలు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ భారీ విమానం విశేషాలు మీ కోసం! ప్రత్యేకతలు: బోయింగ్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ట్విన్జెట్ (రెండు ఇంజన్లతో నడిచే) విమానం. దీన్ని సాధారణంగా ‘ట్రిపుల్ సెవెన్’ అని పిలుస్తారు. ఇందులో సుమారు 300 మందికి పైగా ప్రయాణించొచ్చు. దీని వేగం సుమారు గంటకు 10,000 నుంచి 17,000 కి.మీ. ఇది పూర్తిగా కంప్యూటర్‌తో డిజైన్ చేసిన తొలి వాణిజ్య విమానం. భారీ పరిమాణంలో చేసిన టర్బో ఫ్యాన్ ఇంజన్లు, ల్యాండింగ్ గేర్‌పై ఆరు చక్రాలు, ఒక వృత్తాకారపు ఫ్యూజ్‌లేజ్ (సిబ్బంది, ప్రయాణికులుండే ప్రాంతం), బ్లేడ్ ఆకారంలో చేసిన తోక భాగం.. ఇందులో ప్రత్యేక విశిష్టతలు. తొలిసారిగా: యునెటైడ్ ఎయిర్‌లైన్స్ 1995లో దీన్ని తొలిసారిగా వాణిజ్య సేవలకు వినియోగించింది. 2010 మే నాటికి దీనిలో వివిధ మోడళ్లకు సంబంధించి 59 నిర్వాహక సంస్థలు 1,148 విమానాల కోసం ఆర్డరు చేయగా 864 విమానాలు సరఫరా అయ్యాయి. దీనిలో సాధారణ మోడల్లో మొత్తం 413 విమానాలను డెలివరీ చేశారు. ఈ మోడల్ విమానాలు అత్యధికంగా ఎమిరేట్స్ సంస్థ వద్ద 78 ఉన్నాయి. నేపథ్యం: 1970 ప్రారంభంలో బోయింగ్ 747, మెక్‌డోనెల్ డౌగ్లస్ డీసీ-10, లాకీడ్ ఎల్-1011 ట్రైస్టార్ విమానాల సేవలు ప్రారంభమయ్యి తొలి తరం వైడ్ బాడీ ప్రయాణ విమానాలుగా అవతరించాయి. 1978లో బోయింగ్ సంస్థ మరో మూడు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో ఎయిర్‌బస్ ఎ-300ను సవాలు చేసే రెండు ఇంజన్లు కలిగిన విమానాలతో పోటీ పడే విధంగా తయారు చేసిన ఒక ట్రైజెట్ విమానమే 777 మోడల్. డిజైన్: బోయింగ్ కొత్త ట్విన్జెట్ రూపకల్పన గత వాణిజ్య జెట్ విమానాలకు భిన్నమైంది. తొలిసారిగా ఎనిమిది అతిపెద్ద వైమానిక సంస్థలు ఆల్ నిప్పన్ ఎయిర్వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, కేథె పసిఫిక్, డెల్టా ఎయిర్‌లైన్స్, జపాన్ ఎయిర్‌లైన్స్, సంతాస్, యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌లు.. బోయింగ్ కొత్త ట్విన్జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాయి. ఉత్పత్తి: బోయింగ్ జెట్ విమాన తయారీ కాంట్రాక్ట్ కోసం అంతర్జాతీయ సంస్థలు ఊహించని రీతిలో పోటీపడ్డాయి. వీటిలో మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, ఫుజి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హాకర్ డి హావిల్లాండ్, ఎయిరోస్పేస్ టెక్నాలజీస్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయి. సేవల ప్రారంభం: తొలి 777 విమానాన్ని 1995 మే 15న బోయింగ్ సంస్థ డెలివరీ చేసింది. 1995 మే 30న ప్రాట్ అండ్ వైట్నీ పీడబ్ల్యూ 4084 ఇంజన్ కలిగిన విమానానికి 180 నిమిషాల ఈటీఓపీ క్లియరెన్స్‌ను ఎఫ్ఏఏ ఇచ్చింది. తద్వారా ఈటీఓపీఎస్ 180 రేటింగ్‌తో సేవలు ప్రారంభించిన మొట్టమొదటి విమానంగా గుర్తింపు పొందింది. పురోగతి: తొలి మోడల్ తర్వాత, బోయింగ్ 777-200ఈఆర్ను అభివృద్ధి చేసింది. ఇది విస్తృత శ్రేణి కలిగిన మోడల్. 1996 అక్టోబర్ 7న ట్రైల్ రన్‌ను నిర్వహించారు. 1997 జనవరి 17న జేఏఏ సర్టిఫికెట్‌ను అందుకుంది. 1997 ఫిబ్రవరి 9న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో సేవలు ప్రారంభించింది. అత్యంత సుదూర ప్రయాణాలు చేసే ఈ మోడల్ 2000 ప్రారంభంలో వైమానిక సంస్థలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వెర్షన్‌గా రికార్డుల కెక్కింది. సాంకేతిక పరిజ్ఞానం: 777 డిజైన్ ద్వారా బోయింగ్ అసంఖ్యాక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు ఆవిష్కరించింది. పూర్తిస్థాయి డిజిటల్ ఫ్లై బై వైర్ నియంత్రణలు, పూర్తి సాఫ్ట్వేర్ కాన్ఫిగడబుల్ అవియోనిక్స్, అధునాతన కాక్పిట్లు వీటిలో ముఖ్యమైంది. రద్దు చేసిన బోయింగ్ 7జే7 మోడల్‌పై జరిపిన పరిశోధనను బోయింగ్ కంపెనీ వినియోగించుకుంది. రెక్కల నిర్మాణం: 777 రెక్కలు సూపర్ క్రిటికల్ ఎయిర్ఫోయిల్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. రెక్కలు 31.6 డిగ్రీలతో తయారు చేశారు. మేక్ 0.83 వద్ద ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. రెక్కలను మరింత మందంగా, అంతకు ముందు విమానాల కంటే సుదీర్ఘ వెడల్పుగానూ రూపొందించారు. ఫలితంగా రవాణా సామర్థ్యం, దూరం, టేకాఫ్ సామర్థ్యాలు పెరిగాయి. ప్రమాదాలు: 2010 మే నాటికి బోయింగ్-777 మొత్తం ఏడు ప్రమాదాలకు గురైంది. అందులో ఒకటి వైమానిక ప్రమాదం. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2001 సెప్టెంబర్ 5న డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇంధనం తిరగ పోసుకునేటప్పుడు ఒక ట్విన్ జెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానం రెక్కలు కాలిపోయాయి. తర్వాత దీన్ని బాగుచేసి తిరిగి సేవలకు వినియోగించారు. -
మలేషియా విమానం పై వింత థియరీ!
అంత పెద్ద విమానం ఆకాశంలో ఆవిరైపోతుందా? అజా అయిపూ లేకుండా పోతుందా? గమ్యం చేర్చాల్సిన మలేషియా ఫ్లైట్ 370, దాని లోని 239 మంది వ్యక్తులు చిరునామా లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు? ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు ఇవి. విమానం దారిమళ్లింపులు, విమానంలో విస్ఫోటనాలు మాత్రమే ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలుసు. ఆకాశానికి, అగాథానికి కూడా తెలియకుండా కనికట్టు చేయడం మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. విమాన ప్రయాణ భద్రతకు, యాత్రీకుల సురక్షకు సరికొత్త సవాలు విసురుతోంది మటుమాయమైన మలేషియా విమానం! ఇప్పుడు ఈ విషయంలో ఎన్నెన్నో అంచనాలు, ఇంకెన్నో థియరీలు, మరెన్నో ఊహాగానాలకు ఊపిరిపోస్తోంది. ఈ క్రమంలోనే కీత్ లెడ్జర్వుడ్ అనే ఆయన ఒక కొత్త థియరీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఆ థియరీ హల్చల్ చేస్తోంది. లెడ్జర్వుడ్ సంచలన థియరీ లెడ్జర్వుడ్ టంబ్లర్ లో తన వాదనను పోస్ట్ చేశారు. ఆయన హాబీ విమానాలను నడపడం. ఏవియేషన్ రంగాన్ని మధించడం. ఆయన స్కై వెక్టర్ డాట్ కామ్ అనే ఆకాశయాన అధ్యయన వెబ్ సైట్ లో విమానం వెళ్లిన మార్గాన్ని, అది సందేశాలు పంపడం ఆగిపోయిన చోట ఆ సమయంలో నడుస్తున్న ఇతర విమానాల వివరాలను సేకరించారు. స్కై వెక్టర్ డాట్ కామ్ లో ఆ సమయంలో ఆకాశయానంలో ఉన్న విమానాలు, వాటి మార్గాల చిత్రం ఇలా ఉంది. ఎం హెచ్ 370 వెళ్తున్న మార్గంలో దాని ముందు సింగపూర్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎస్ ఐ ఏ 68 విమానం వెళ్తోందని గుర్తించారు. ఒక్క పావు గంట పాటు ఎస్ ఐఏ 68 వెనక వెళ్లాక సిగ్నల్స్ ఆపేసిందని ఆయన అంటున్నారు. దీనితో ఎం హెచ్ 320 ట్రాన్స్పాండర్లు పనిచేయకుండానే ముందుకు వెళ్తోంది. అంటే ఎస్ ఐ ఏ 68 నీడలో ఎంహెచ్ 320 వెళ్లింది. దీని వల్ల రేడార్ పై ఈ రెండూ ఒకటిగానే కనిపించాయని లెడ్జర్వుడ్ అంటున్నారు. ఈ రెండూ బోయింగ్ 777 విమానాలే. లెడ్జర్ వుడ్ ప్రకారం ఈ పటంలో చూపించినట్టు విమానాలు ఒకదానికి వెనుక వెళ్లాయి. ఈ మోసం తోటే మలేశియన్ విమాన పైలట్ భారత, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల మీదుగా, కిర్గిజిస్తాన్ వరకూ వెళ్లగలిగాడని అంటున్నారు. ముందున్న విమానానికి కూడా వెనక వస్తున్న విమానం ట్రాన్స్ పాండర్ ఆపివేయడంతో దాని కదలికలు తెలియలేదు. ఇలా విమానంలోని ట్రాన్స్ పాండర్ ను ఆపివేయడానికి వీలుంటుంది. లెడ్జర్ వుడ్ అంచనా ప్రకారం విమానాలు రెండూ ఈ పటంలో చూపిన మార్గంలో వెళ్లి ఉండవచ్చు. చాలా ప్రమాదకమైన ఆలోచన ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఒక విమానం వెనుక రాడార్ కు చిక్కకుండా ఇంకో విమానం వచ్చి ఉన్నట్టుండి దాడి చేయవచ్చు. అపార ప్రాణనష్టం జరగవచ్చు. ఇదే టెక్నిక్ ను ఉగ్రవాదులు ఉపయోగించుకోవచ్చు. అందుకే లెడ్జర్ వుడ్ థియరీని ఇంత నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏవియేషన్ రంగ నిపుణులు కొందరు మాత్రం ఈ థియరీపై పలు సందేహచిహ్నాలు పెడుతున్నారు. ఇలా అవడానికి వీల్లేదని కూడా అంటున్నారు. కానీ లెడ్జర్ వుడ్ థియరీని మాత్రం ఉగ్రవాద వ్యతిరేకపోరులో ఉన్న దేశాలు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నాయి. అయితే ఒక ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ జవాబు దొరకడం లేదు. ఇంతకీ విమానాన్ని పైలట్ స్వయంగా హైజాక్ చేసినా ఈ పాటికి తన డిమాండ్లేమిటో చెప్పి ఉండాలి కదా! ఏ ఫలితమూ, లక్ష్యమూ లేకుండా ఇన్ని రోజులు ప్రయాణికులకు ఉచితభోజన సదుపాయం కల్పించేందుకు ఆ పైలట్ ఏమీ బిల్ గేట్స్ కాదు కదా! -
టేకాఫ్ అయిన ఆరు గంటలకు వెనక్కి!
న్యూఢిల్లీ: షికాగోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సోమవారం టేకాఫ్ అయిన ఆరు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ‘బోయింగ్ 777-300 ఈఆర్’ ట్రాన్స్‌పాండర్‌లో వైఫల్యం తలెత్తడంతో ఉదయం 5 గంటలకు పైలట్ తిరిగి వెనక్కి తీసుకువచ్చినట్లు ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. సంఘటన సమయంలో విమానంలో 313 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత అఫ్ఘానిస్థాన్‌ను దాటుతుండగా విమానంలో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. దీంతో ట్రాన్స్‌పాండర్ పనిచేయకపోతే ఐరోపాలోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో పైలట్ విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులను షికాగో చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు. కాగా 15 రోజుల క్రితం కూడా అఫ్ఘానిస్థాన్ మీదుగా వెళుతుండగా ఓ ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లో ట్రాన్స్‌పాండర్ విఫలమైంది. గతకొద్ది నెలలుగా బోయింగ్ విమానాల్లో తరచూ ట్రాన్స్పాండర్లు విఫలమవుతుండటంతో అమెరికా సంస్థ బోయింగ్‌కు ఎయిరిండియా ఫిర్యాదు కూడా చేసింది. -
హైదరాబాద్‌కు ఖతార్ ఎయిర్వేస్ కార్గో సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్గో సేవలందిస్తున్న ఖతార్ ఎయిర్వేస్ కార్గో.. వైమానిక రవాణా సేవలను కొత్తగా హైదరాబాద్‌తోసహా లండన్ స్టాన్స్టెడ్కు(యూకే) విస్తరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వారంలో రెండు కార్గో సర్వీసులను హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభిస్తోంది. ఇక్కడి నుంచి ఐటీ ఉత్పత్తులు, ఔషధాలు ప్రధాన ఎగుమతులని కంపెనీ వెల్లడించింది. దోహ-హైదరాబాద్ మధ్య ప్రతిరోజు ఖతార్ ఎయిర్వేస్ ప్యాసింజర్ విమానం నడుస్తున్న సంగతి తెలిసిందే. -
అమెరికాలో కూలిన విమానం