ఎమ్హెచ్ 370 విమానం(ఫైల్)
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలో దొరికిన శకలం ఎమ్హెచ్ 370 విమానానికి చెందినదేనని మలేసియా రవాణా శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. గత ఏడాది మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఎమ్హెచ్ 370 బోయింగ్ 777 విమానం 40 నిమిషాల తర్వాత అదృశ్యమైంది. అందులోని 239 మంది మృతి చెందినట్టు మలేసియా ప్రభుత్వం ప్రకటించింది.
'ఈ శకలం బోయింగ్ 777 విమానానికి సంబంధించినది. మలేసియా ఎయిర్ లైన్స్ ఈమేరకు నాకు సమాచారం అందించింద'ని మలేసియా రవాణా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై 657 బీబీ నంబర్ ఉందని తెలిపారు. ఇప్పుడు దొరికిన శకలంతో ఎమ్హెచ్ 370 విమానం హిందూ మహా సముద్రంలోనే కూలిందని ప్రాథమికంగా నిర్ధారణయింది. దీంతో ఎమ్హెచ్ 370 విమానం అదృశ్యం మిస్టరీ త్వరలోనే వీడడే అవకాశముంది.