లాస్ ఏంజెల్స్ : ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు రేగడం కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఉదయం లాస్ ఏంజెల్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన అధికారులు అత్యవసర ల్యాండింగ్ పేరిట విమానాన్ని కిందకు దించారు.కాగా ఈ సమయంలో 347 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి గురైన విమానం113 బోయింగ్-777 రకానికి చెందినదని ఆయన పేర్కొన్నారు. విమానానికి మంటలు అంటుకోగానే గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి మాకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమయ్యామని తెలిపారు.
ఇదే విషయమై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ స్పందిస్తూ.. ఎలాంటి నష్టం జరగకముందే పైలట్ చాక చక్యంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని తెలిపింది. మద్యాహ్నం 12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని లాస ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ' గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానానికి మంటలు వచ్చాయి. అచ్చం బైక్ కు మంటటు అంటుకున్నట్టుగానే కనిపించింది. తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నామని' 36 ఏళ్ల అండ్రూ అమెస్ పేర్కొన్నారు. అయితే గతంలోనూ బోయింగ్-777 కు చెందిన 737 మాక్స్ విమానంలోనూ ఇదే రీతిలో మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment