Manila
-
ఫిలిప్పీన్స్‌లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..
మనీలా: పంజాబ్‌కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు. హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్(41), కిరణ్‌దీప్ కౌర్(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్‌ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు. చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి -
స్ట్రాంగ్ వార్నింగ్.. టీకా వేసుకుంటారా లేక జైలుకు వెళ్తారా?
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని జైలులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? అని బెదిరించారు. కాగా, ఫిలిప్పీన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. దేశంలో ఇప్పటివరకు 13 లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కొంతమంది వ్యాక్సిన్ పట్ల విముఖత చూపిస్తున్నారు. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన ప్రజలపై రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు. టీకా వద్దంటే ఖబర్దార్.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని వ్యాఖ్యానించారు. ‘దేశంలో కరోనా సంక్షోభం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, నన్ను తప్పుగా భావించవద్దు’ అని డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు. జూన్ 20 నాటికి, ఫిలిప్పీన్స్ అధికారులు 2.1 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశారని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. చదవండి: సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు -
సంచలన ఆదేశాలు : గీత దాటితే.. కాల్చి చంపండి
మనీలా : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు చేస్తున్న వారిపై ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను పెడచెవినపెట్టి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నవారి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు. దేశంలో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి 4బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆహారకొరతతో ఒక్కరు కూడా మరణించకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని కోరారు. ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలని రోడ్రిగో డ్యూటెర్టే కోరారు. అయితే మానవ హక్కుల కార్యకర్తలతోపాటూ, నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగాఖండించారు. దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు డ్యూటెర్టే ఇలా మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితిని పోలీసులు అర్థం చేసుకోగలరని, పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఎవరినీ కాల్చవద్దని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ కోరారు. -
‘ఆ విద్యార్ధులను తీసుకురండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో మూడు రోజులుగా చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది మెడికల్ విద్యార్ధులను తక్షణమే స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తిండి, నీరు లేకుండా కటిక నేలపై నిద్రిస్తూ మనీలా ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్ధులు పడుతున్న కష్టాలను ఆయన మంత్రికి వివరించారు. ఈ విద్యార్ధులంతా మనీలాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మనీలాలో విద్యా సంస్థలు మూసివేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులంతా మూడు రోజుల క్రితమే మనీలా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే మనీలా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు కూడా స్తంభించిపోవడంతో విద్యార్దులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేని దుర్భరమైన పరిస్థితుల్లో సహాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. రవాణా వ్యవస్థ యావత్తు నిలిచిపోవడంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి తమ హాస్టళ్ళకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మనీలా ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుబడిపోయిన 70 మంది విద్యార్ధులలో 36 మంది యువతులు ఉన్నారని, టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారని మంత్రికి తెలియచేశారు. విద్యార్ధులు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్ధులు వాపోతున్నట్లు మంత్రి జైశంకర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మనీలాలో చిక్కుబడిపోయిన విద్యార్ధులను స్వదేశానికి రప్పించాలని విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
గాల్లో ఉండగానే విమానంలో మంటలు
లాస్ ఏంజెల్స్ : ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు రేగడం కలకలం రేపింది. ఈ ఘటన గురువారం ఉదయం లాస్ ఏంజెల్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఫిలిప్పీన్స్‌కు ఎయిర్‌లైన్స్ విమానం లాస్ ఏంజెల్స్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన అధికారులు అత్యవసర ల్యాండింగ్ పేరిట విమానాన్ని కిందకు దించారు.కాగా ఈ సమయంలో 347 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి గురైన విమానం113 బోయింగ్-777 రకానికి చెందినదని ఆయన పేర్కొన్నారు. విమానానికి మంటలు అంటుకోగానే గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి మాకు సమాచారం అందించడంతో వెంటనే అప్రమత్తమయ్యామని తెలిపారు. ఇదే విషయమై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ స్పందిస్తూ.. ఎలాంటి నష్టం జరగకముందే పైలట్ చాక చక్యంతో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందని తెలిపింది. మద్యాహ్నం 12 గంటల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని లాస ఏంజిల్స్ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ' గాల్లోకి ఎగిరిన కాసేపటికే విమానానికి మంటలు వచ్చాయి. అచ్చం బైక్ కు మంటటు అంటుకున్నట్టుగానే కనిపించింది. తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నామని' 36 ఏళ్ల అండ్రూ అమెస్ పేర్కొన్నారు. అయితే గతంలోనూ బోయింగ్-777 కు చెందిన 737 మాక్స్ విమానంలోనూ ఇదే రీతిలో మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు. -
ఫిలిప్పైన్స్‌లో భారీ భూకంపం
మనీలా: ఫిలిప్పైన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర ఫిలిప్పైన్స్‌లో భూకంపం దాటికి రెండు భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. భూకంపం సంభవించిన సమయంలో రాజధాని మనీలాలోని కార్యాలయాలు అటూ ఇటూ ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి చేరుకున్నారు. మనీలాకు వాయువ్యంగా 60 కిలోమీటర్ల దూరంగా, భూమికి 40 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
థర్మకోల్ కేకు @ 5 లక్షల రూపాయలు
మనీలా : పెళ్లిరోజు అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. పెళ్లి రోజును మన జీవితంలో మర్చిపోలేము. మన దేశంతో పాటు చాలా దేశాల్లో పెళ్లిరోజును పండుగలా జరుపుకుంటారు.బంధువులను, స్నేహితులను పిలుస్తారు. వారందరికి విందు ఇస్తారు. ఇలా ఆ రోజును చాలా సంతోషంగా గడుపుతారు. అందరిలాగానే ఓ జంట కూడా తమ పెళ్లి రోజును ఘనంగాజరుపోవాలని భావించింది. దీని కోసం నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుంది. బంధువులకు, స్నేహితులకు ఆహ్వానం కూడా పంపారు. విందు కోసం రూ.5లక్షలులతో ఓ ప్రముఖక్యాటరింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. చివరకు క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి అందరి ముందు తలదించుకున్నారు. వారు ఆర్డర్ చేసిన పుడ్ సప్లై చేయకపోవడమే కాకుండా, భారీ కూల్ కేకుకు బదులు థర్మకోల్ కేకు పార్శిల్ ఇచ్చి నలుగురి ముందు నవ్వులపాలు చేశారు. వివరాలు.. ఫిలిప్పీన్స్ దేశంలో పాసిగ్ సిటీకి చెందిన షైన్ తమాయో తన పెళ్లి రోజు ఘనంగా జరుపోవాలకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్ సంస్థకు రూ. 5లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వింధు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు బంధువులు, స్నేహితులు అంతా తన ఇంటి వచ్చారు. వింధు కోసమై వెళ్లి చూడగా అక్కడ పుడ్ ఏర్పాటు చేయలేదు. దింతో పక్క వీధిలో ఉన్న హోటల్లో పుడ్ తెప్పించి వారికి వింధు ఇచ్చారు. అనంతరం కేకు కటింగ్ వెళ్లారు. అందరు చూట్టూఉండగా ఆ జంట కేక్ కట్ చేసింది. అది చూసి బంధువుతలతో పాటు, వారు కూడా షాకయ్యారు. అది కేకు కాదు థర్మకోల్. కేకు ఆకారంలో థర్మకోల్ను తయారు చేసి పైన రంగు వేశారు. ఇది చూసి పెళ్లి రోజు ఆ జంట బోరుమంది. క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి తాము బలైపోయామని వాపోయారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏదేమైనా పెళ్లి రోజు ఆ జంటకు తీవ్ర నిరాశ ఎదురైంది. -
విమానంలో తాను ఒక్కదాన్నే అని తెలిసి!
-
విమానంలో తాను ఒక్కదాన్నే అని తెలిసి!
విమానంలో ప్రయాణించాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. సమయం వృథా కాకుండా, ఇదివరకెప్పుడూ విమానం ఎక్కని వారైతే ఓ కొత్త ట్రావెలింగ్ అనుభవం సొంతం చేసుకోవాలంటే గాలి మోటార్లో తిరగాలనుకోవడం సహజమే. అయితే విమానంలో మనం ఒక్కరమే ఉన్నామని తెలిస్తే ఆశ్చర్యంతో పాటు కాస్త భయం కూడా వేస్తుంది కదా. లూసియా ఇరిస్పే అనే ఫిలిప్పీన్స్ మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దావో నుంచి మనీలాకు వెళ్లేందుకు ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్‌లో లూసియా గత వారం టికెట్ బుక్ చేసుకున్నారు. విమానం ఎక్కిన తర్వాత చూస్తే తాను తప్ప వేరే ప్రయాణికులెవరూ కనిపించక పోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి సంభవించే ఇలాంటి అరుదైన ఘటన.. తనకు ఓ మధుర ఙ్ఞాపకాన్ని మిగిల్చిదంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనతో పాటు విమానంలో ఉన్న ఏడుగురు సిబ్బంది(క్యాబిన్ క్రూ)తో కలిసి ఫొటోలు దిగి హల్చల్ చేశారు. కాగా గతంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేకువజామునే బయల్దేరే ఫ్లైట్ కావడంతో లాట్అమీ అనే మహిళా ప్రయాణికురాలికి లూసియా వంటి అనుభవమే ఎదురైంది. ఆ ఆనందంలో విమానమంతా కలియతిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియోనున లాట్అమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సందడి చేశారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురితోపాటు మరో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. పీపర్–23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్‌లోని ప్లారిడెల్ పట్టణంలో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంటిని ఢీకొంది. దీంతో విమానం పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆరుగురు ప్రయాణించే ఈ విమానంలో ప్రమాద సమయంలో ఐదుగురు ఉన్నారు. వీరితోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఇంట్లోకి దూసుకెళ్లడానికి ముందు చెట్టును, విద్యుత్ స్తంభాన్ని విమానం ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు ఒకరు తెలిపారు. -
క్లైమేట్ స్మార్ట్ రైస్ : ఆరోగ్యంగా జీవించొచ్చు
లాస్ బనోస్, మనీలా(ఫిలిప్పీన్స్) : ఏడు రకాల అటవీ వరి వంగడాల జన్యువుల ద్వారా కొత్త రకపు వరి విత్తనాల అభివృద్ధి పూర్తయినట్లు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్ఆర్ఐ) ప్రకటించింది. ఈ విత్తునాల ద్వారా ఉత్పత్తి చేసిన పంటను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని సాగించొచ్చని పేర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వంగడాలను ‘క్లైమేట్ స్మార్ట్ రైస్’ గా పేర్కొనచ్చని తెలిపింది. భూ మండలంపై సంభవించే వాతావరణ మార్పులను తట్టుకుని అధిక ఉత్పత్తిని ఈ వంగడాలు అందజేస్తాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని వెల్లడించింది. చాలా రకాల జీవ, నిర్జీవ సంబంధిత వ్యాధులను ఈ వంగడాలు నిరోధిస్తాయని వెల్లడించింది. ’నేచుర్ జెనెటిక్స్’ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని తెలిపింది. -
ఫిలిప్పీన్స్‌లో భారీ తుఫాను : 182 మంది మృతి
-
ఫిలిప్పీన్స్‌లో ప్రళయం : 182 మంది మృతి
మనీలా : భారీ తుపాను ధాటికి దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రజలు విలవిల్లాడారు. ‘టెంబిన్’ తుపాను సృష్టించిన బీభత్సానికి 182 మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. 153 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సివుందని అధికారులు వెల్లడించారు. టెంబిన్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్‌లో మెరుపు వరదలు సంభవించాయి. పెద్ద ఎత్తున్న కొట్టుకొచ్చిన మట్టి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని చెప్పారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కు పైగా పెను తుపానులు విరుచుకుపడుతుంటాయి. వీటి వల్ల దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ద్వీపాలకు జరిగే నష్టం తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలుస్తోంది. భారీగా కొట్టుకువచ్చిన మట్టి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు అడ్డుపడుతోంది. ఫిలిప్పీన్స్‌లో రెండో అతి పెద్ద ద్వీపమైన మిన్‌డనావోలో మెరుపు వరద సంభవించింది. దీంతో అక్కడ నివసించే 70 వేల మంది ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సీ) తెలిపింది. -
‘శిఖరాగ్ర’ సందడి!
వ్యూహాత్మక అంశాల్లో అంతర్జాతీయంగా ఒక రకమైన అనిశ్చితి అలుముకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం నుంచి మూడురోజుల విస్తృత పర్యటన జరిపారు. ఈసారి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వరస శిఖరాగ్ర సదస్సులతో సందడిగా మారింది. ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఆసి యాన్), తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) దేశాల సదస్సుల్లో మోదీ పాల్గొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోసహా పలు దేశాల అధినేతలను కలిశారు. ఈ సందర్భంగానే ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు మన దేశంతోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దౌత్యవేత్తలు విడిగా సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా మోదీ జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్క్బుల్తో చర్చించారు. ఈ దేశాలతో చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఆలోచన. ఈ సదస్సులకు ముందు వియత్నాంలో ఆసియా–పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ(ఎపెక్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ప్రపంచం ఇంతకు ముందున్నట్టులేదు. కొన్ని దశాబ్దాలనుంచి ఆర్ధిక సంస్కరణ లనూ, ప్రపంచీకరణనూ ప్రవచిస్తూ వాటి అమలుకు నాయకత్వంవహించిన అమెరికా... డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాక స్వరం మార్చింది. దాదాపు ఏడాది కాలంనుంచి ‘అమెరికా ఫస్ట్’ అంటూ ‘స్వీయ రక్షణ’ చర్యలు మొదలెట్టింది. భూతా పోన్నతిని, దాని వెన్నంటి వచ్చే పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడానికి రెండేళ్లక్రితం పారిస్‌లో కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోదల్చుకు న్నట్టు మొన్న జూన్‌లో ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఖాళీ చేస్తున్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు, ఆ రకంగా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకూ చైనా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అది తూర్పు, పడమరలను ఏకంచేసే బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టును నెత్తికెత్తుకుంది. ప్రపంచ పర్యావరణ రక్షణకు తాను చొరవ తీసుకుంటానంటోంది. తూర్పు చైనా సము ద్రంలోనూ, దక్షిణ చైనా సముద్రంలోనూ చైనాతో వివాదాలున్న జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఇవన్నీ మింగుడు పడటం లేదు. మరో పక్క హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా క్రమేపీ తన పలుకుబడిని విస్తరిం చుకుంటూ పోవడంతోపాటు మనకు సమస్యగా మారిన పాకిస్తాన్‌తో చేతులు కలపడం మన దేశానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇన్ని పరిణామాల మధ్య మనీలా వేదికగా జరిగిన ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సులకు సహజంగానే అమిత ప్రాధాన్యత ఉంటుంది. స్వీయ మార్కెట్ల పరిరక్షణ, దేశ పౌరులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడటం అన్న రెండు అంశాలపైనే కేంద్రీకరించి అందుకు అవసరమైతే చైనాతో చేతులు కలిపేందుకు కూడా సిద్ధపడుతున్న అమెరికా...అదే సమయంలో ఈ ప్రాంతంలోని తన చిరకాల మిత్రుల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టింది. ఇందులో మన దేశం ముఖ్యపాత్ర వహించాలన్నది దాని ఉద్దేశం. ‘ట్రంప్ ఎక్కడి కెళ్లినా, ఏమాత్రం అవకాశం దొరికినా భారత్ గురించే గొప్పగా చెబుతున్నార’ని ఆయనతో సమావేశమయ్యాక సోమవారం మోదీ అన్నారు. ఇందులో నిజముంది. ట్రంప్ వచ్చాక ‘ఆసియా–పసిఫిక్’ అనే మాటనే మార్చేసి ‘ఇండో–పసిఫిక్’ అనడం మొదలుపెట్టారు. ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రతలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఇదే సమయంలో ఇతర దేశాల తీరు తెన్నుల్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమాల్లో జరిగిన జాప్యం వల్ల తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పాలు పంచుకోలేదు. అంత కన్నా ముఖ్యమేమంటే 2007లో తొలిసారి జరిగిన చతుర్భుజ కూటమి దేశాల దౌత్యవేత్తల సమావేశానికి హాజరైన సింగపూర్ ఈసారి మాత్రం మొహం చాటేయడం. నాలుగు ప్రధాన దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో పాటు సింగపూర్ కూడా అప్పట్లో సమావేశంలో పాలుపంచుకుంది. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అది పునరాలోచనలో పడినట్టు కని పిస్తోంది. ముఖ్యంగా చైనా బీఆర్ఐ ప్రాజెక్టు ఆర్ధికంగా, వాణిజ్యపరంగా తమ కెంతో మేలు చేస్తుందన్న విశ్వాసం దానికుంది. అమెరికాకు అది మిత్ర దేశమే అయినా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న దాని వైఖరి సింగపూర్‌కు మింగుడుపడటం లేదు. అందుకే తన దోవ తాను చూసుకోదల్చుకున్నట్టు కన బడుతోంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతం సుస్థిరంగా, భద్రంగా ఉండాలంటే మోదీ చెప్పి నట్టు ‘నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం’ అవసరమే కావొచ్చు. ఆ ప్రాంతంలో చైనా దూకుడు వల్ల జపాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు సమస్యలెదుర్కొంటున్న మాట కూడా వాస్తవమే. అయితే మాట నిలకడలేని ట్రంప్‌ను నమ్ముకుని 2007 నాటి చతుర్భుజ కూటమి ఆలోచనకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేయడం, అందులో మన దేశం చురుగ్గా పాలు పంచుకోవడం ఎంతవరకూ అవసరమో ఆలోచించక తప్పదు. ఈ కూటమికి తనను ఆహ్వా నించకపోవడంపైనా, దాని ఉద్దేశాలపైనా చైనాకు సంశయాలున్నాయి. మరోపక్క చతుర్భుజ కూటమి గురించి, ఇండో–పసిఫిక్ ప్రాంతం గురించి మాట్లాడుతున్న ట్రంప్ చైనాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ దేశంతో తమకున్న వాణిజ్య లోటు భర్తీకి తహతహలాడుతున్నారు. అందువల్ల మనం కూడా చైనాతో ఉన్న ద్వైపాక్షిక సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ఆ దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియాన్ దేశా లతో చైనా వాణిజ్యం నిరుడు 35,000 కోట్ల డాలర్లుంటే మనది 6,000 కోట్ల డాలర్లు మాత్రమే. అలాగే ఆసియాన్ దేశాల్లో మన పెట్టుబడులు వంద కోట్ల డాలర్లు దాటలేదు. వీటిని మరింత పెంచుకోవడం, పరస్పర సహకారంతో సమష్టిగా ముందుకెళ్లడం ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అత్యవసరం. ఏ ప్రాంతీయ కూటమైనా అందుకు దోహదపడాలని ఆశించాలి. -
ద్వైపాక్షిక బంధాలను మించి..
మనీలా: భారత్–అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక బంధాల పరిధిని మించి మరింత విస్తృతంగా, బలంగా ఎదిగేందుకు అవకాశం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మార్పుల దృష్ట్యా ఆసియా భవిష్యత్తు కోసం భారత్–అమెరికాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్ ప్రత్యేకంగా 45 నిమిషాల సేపు భేటీ అయ్యారు. విస్తృతాంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అమెరికా అంచనాలను భారత్ అందుకుంటుందని మోదీ పేర్కొన్నారు. ట్రంప్ ఇటీవలి పర్యటనల్లో భారత్ గురించి గొప్పగా చెప్పడంపై కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ అంచనాలను అందుకుంటాం ‘ఇరుదేశాల మధ్య సహకారం ద్వైపాక్షిక బంధాలకన్నా ఎక్కువగా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచం, ఆసియా భవిష్యత్తు కోసం మేం కలిసి పనిచేస్తాం. ఇప్పటికే చాలా అంశాల్లో సంయుక్తంగా ముందుకెళ్తున్నాం’ అని ట్రంప్‌తో భేటీ తర్వాత మోదీ అన్నారు. ‘ట్రంప్ ఎక్కడికెళ్లినా, ఏమాత్రం అవకాశం దొరికినా భారత్ గురించే గొప్పగా చెబుతున్నారు. భారత్ నుంచి ప్రపంచం, అమెరికా కోరుకుంటున్న దాన్ని నెరవేరుస్తామని నేను భరోసా ఇస్తున్నాను. ఇప్పటికే ఈ దిశగా భారత్ పనిచేస్తోంది. ఈ పనిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం’ అని ప్రధాని వెల్లడించారు. అటు ట్రంప్ కూడా మోదీ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. పెట్టుబడులతో భారత్‌కు రండి అంతకుముందు, ఆసియాన్ బిజినెస్ ఫోరం బృందంతో మోదీ సమావేశమయ్యారు. భారత ఆర్థిక సంస్కరణలు శరవేగంగా జరుగుతున్నాయని తద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు సువర్ణావకాశం ఉందని సమావేశంలో ప్రధాని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం చాలా రంగాల్లో నిబంధనలను సరళీకృతం చేశామన్నారు. ‘భారత్‌లో సంస్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయి. సులభమైన, ప్రభావవంతమైన, పారదర్శకమైన పాలన అందించేందుకు మేం అహోరాత్రులు శ్రమిస్తున్నాం. 90 శాతానికిపైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగాల్లో ఆటోమేటిక్‌గా అనుమతులు వచ్చేస్తాయి’ అని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘గ్యాస్’కే పరిమితమైంది ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులను మోదీ కలిశారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో 3కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారమంతా గ్యాస్ సిలిండర్ల చుట్టే తిరిగింద న్నారు. సదస్సు ప్రారంభోత్సవంలో రామా యణం ఆధారంగా ప్రదర్శించిన ఓ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది. తర్వాత ‘మహావీర్ ఫిలిప్పీన్ ఫౌండేషన్’కు మోదీ వెళ్లారు. వికలాంగులకు జైపూర్ ఫుట్‌ను అందజేస్తున్న ఈ సంస్థను మోదీ ప్రశంసించారు. ఫిలిప్పీన్స్‌కు భారత వంగడాలు ఫిలిప్పీన్స్‌లోని మనీలా సమీపంలోని అంతర్జాతీయ వరి పరిశోధనాసంస్థ (ఐఆర్ఆర్ఐ)ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఆర్ఆర్ఐ జీన్ బ్యాంక్‌కు రెండు భారత వరి వంగడాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆకలి తీర్చే లక్ష్యంతో ఐఆర్ఆర్ఐ పనిచేస్తోంది. ప్రకృతి విపత్తులను, వరదలను తట్టుకునేలా రూ పొందించిన వరి వంగడాలను శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. 18 రోజుల పాటు నీటిలో మునిగినా హెక్టారుకు 1–3 టన్ను ల వరి ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. . -
‘డ్రగ్ మాఫియా నిర్మూలనకు కీలక నిర్ణయాలు..!’
మనీల: ఫిలిపైన్స్ పోలీసు కాల్పులో 32 మంది అనుమానిత డ్రగ్ డీలర్లు మృతిచెందారు. మరో 107 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ మాఫియాను నిర్మూలించే క్రమంలో దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు సుమారు 66 చోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా పలువురు పోలీసులపైకి కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పెద్ద మొత్తంలో మెటాంఫెటామైన్, మారిజునా అనే డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక 34 ఆయుధాలను కూడా సీజ్ చేశారు. -
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో బీభత్సం
-
కాసినోలో కాల్పులు
37 మంది మృతి ► ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘటన.. ► దోపిడీ కోసం కాల్పులు ► పొగతో ఊపిరాడక బాధితుల మృతి మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ కాసినో.. రంగురంగుల లైట్ల వెలుగుల్లో జనం కేరింతలు. ఒక్కసారిగా రైఫిల్ పేలిన శబ్దం.. ప్రజలు బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు టీవీ స్క్రీన్ పేలి పొగ దట్టంగా వ్యాపిం చడంతో చాలామంది అక్కడే కుప్పకూలారు. పోలీసులు కాసినోను చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. 5 గంటల తర్వాత.. కాల్పులు జరిపిన దుండగుడి మృతదేహంతోపాటు 37 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ గురువారం అర్థరాత్రి కాసినోలో జరిగిన హృదయవిదారక ఘటన. రూ. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్(ఆట కోసం వాడే కాయిన్స్) కోసమే దుండగుడు ఈ దారుణా నికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి కాసినోలోకి వచ్చినే దుండగుడు ఆటోమెటిక్ రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించాడు. జనాన్ని టార్గెట్ చేయకుండా టీవీ ్రïస్కీన్‌కు గురిపెట్టి కాల్చా డు. టీవీ పేలి మంటలు వ్యాపించాయి. కాసి నో అంతా దట్టమైన పొగతో నిండిపో యిం ది. ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. చాలామంది లోపలే చిక్కుకుపోయారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన ముష్కరుడు యూరో పియన్లా ఉన్నాడని, కాల్పుత తర్వాత అతడు పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకుని ఉంటాడని భావిస్తున్నారు. మృతుల్లో ఎవ రూ కాల్పుల్లో చనిపోలేదని, పొగలు వ్యాపిం చడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీ సులు తెలిపారు. ఇది ఉగ్రవాద దాడి కాద న్నారు. ఇదిలా ఉండగా ఈదాడికి పాల్ప డింది తామేనని ఐఎస్ ప్రకటించింది. -
ఫిలిప్పీన్స్ లో భూ ప్రకంపనలు
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. మనీలాకు దక్షిణ దిశగా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 42 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. తలాగ అనే పట్టణానికి సమీపంలో భూకంప తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా భూకంపం వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించినట్లు అధికారులు వివరించారు. -
మనీలా అంతర్జాతీయ సదస్సుకు చాడ
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు తెలంగాణ నుంచి చాడతోపాటు కె.యాదవరెడ్డి (టీఆర్ఎస్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి (టీపీసీసీ) హాజరవుతున్నట్లు సమాచారం. వీరితోపాటు సీపీఎం నుంచి మాజీ ఎంపీ నీలోత్పల్‌బసు హాజరుకానున్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (అయిప్సో) ప్రతినిధి బృందంలో సభ్యులుగా వీరు గురువారం రాత్రి ఇక్కడి నుంచి మనీలా బయలుదేరనున్నారు. క్యూబాపై ఆర్థిక, వాణిజ్య తదితర ఆంక్షలను అమెరికా, ఇతర దేశాలు విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశానికి సంఘీభావంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. -
మనుషుల్ని చీమల్లా తొక్కించారు..
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. భద్రత అధికారులు ఆందోళనకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మనీలాలో అమెరికా ఎంబసీ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నవారిని పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. పోలీసు వాహనాలను నిరసనకారులపై దూసుకెళ్లించారు. వాహనాలను ముందుకు, వెనుకకు పోనిస్తూ ఆందోళనకారులపై నడపడటంతో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. పోలీసులు కనిపించినవారినందిరినీ చితకబాదుతూ లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. చాలామంది నిరసనకారులకు కాళ్లు, చేతులు విరిగాయి. మరికొందరికి రక్తగాయాలయ్యాయి. పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
పోలీసు వాహనాలను జనంపైకి నడిపించి..
-
విమానం హైజాక్ కలకలం
మనీలా: సౌదీ అరేబియా విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో కలకలం రేగింది. 300 మందితో జెడ్డా నుంచి మనీలాకు వచ్చిన ఎస్ వీ 872 విమానం నినోయ్ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలియక విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఆందోళన చెందారు. విమానం హైజాక్ కు గురైందన్న సమాచారంతో పోలీసులు విమానాన్ని చుట్టుముట్టారు. విమానానికి ముప్పు ఉందని ఎయిర్ పోర్టు కంట్రోల్ రూముకు పైలట్ సమాచారం అందించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాన్ని ప్రత్యేక స్థలంలో కిందకు దించారు. పైలట్ పొరపాటున ’పానిక్ బటన్’ నొక్కాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ రెండుసార్లు పానిక్ బటన్ నొక్కడంతో కలకలం రేగిందని ఎయిర్ పోర్ట్ జనరల్ మేనేజర్ ఎడ్మండ్ మోనేరల్ తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. పైలట్ ను ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ప్రయాణికుల్లో చాలా మంది హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. -
సమాధుల చెంతనే హాయిగా పడుకోవచ్చు!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో చైనా కమ్యూనిటికి సుందరమైన సమాధులున్నాయి. వీధి వీధంతా ఎప్పుడూ సమాధులతో కళకళలాడుతుంటుంది. తమ అప్తులను సమాధి చేసిన కుటుంబాలు తరచుగా అక్కడికెళ్లి సమాధులను సందర్శించడమే కాకుండా కొన్ని రోజుల పాటు సమాధుల చెంతనే నివసించి పిల్లా పాపలతో సేదదీరుతుంటారు. అందుకు వారికి కావాల్సిన ఏసీ బెడ్ రూమ్‌లు, విశాలమైన హాళ్లు, అటాచ్డ్ కిచెన్లు, బాతురూమ్‌లు ఉన్నాయి. పోయిన వారిని తలుచుకుంటూ ఉన్నవారు అక్కడ ఆనందంగా గడిపేయవచ్చు. అందుకనే ఆ టూంబ్స్కు ‘ది బెవర్లీ హిల్స్ ఆఫ్ ది డెడ్’ అని నిక్ నేమ్ కూడా వచ్చింది. ఈ మధ్య సందర్శకుల తాకిడీ కూడా పెరగడంతో వారి సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వేడి వేడి వంటకాలను వడ్డించే ఏసీ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు కేథలిక్ శ్మశానాలకు చైనీయులను రాణించేవారు కాదు. దాంతో సంపన్న వర్గానికి చెందిన చైనీయులు పోయిన తమ వారి కోసం ఇలా కళావైభవం ఉట్టిపడేలా సమాధులను నిర్మించారు. ప్రాచీన వాస్తుకు ఆధునిక హంగులను జోడించడంతో టూంబ్స్ కాస్త సందర్శనీయ స్థలాలుగా మారిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా చనిపోయిన చైనా నాయకులను కూడా ఇక్కడే సమాధి చేశారట. అందుకని గత చరిత్రపట్ల ఆసక్తిగల పర్యాటకులు కూడా వస్తున్నారు. కానీ వారు ఇందులో నివసించడానికి వీల్లేదు. సమాధులున్న కుటుంబాలకు మాత్రమే ఆ అర్హత ఉంటుంది. బతికున్న వారికే ఉండడానికి ఇల్లులేక చస్తుంటే చచ్చిన వారికి ఇంత సుందరమైన సమాధులు ఎందుకో! అంటూ పర్యాటకులు చేసే కామెంట్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తాయి. ఇదేమైనా ఈ ప్రాంతంలో సమాధులకు డిమాండ్ విపరీతంగా పెరిగిన దృష్ట్యా టూంబ్స్ ప్రాంతాన్ని విస్తరించాలని మనీలా నగర పాలిక సంస్థ ఇప్పుడు నిర్ణయించింది. -
ఫిలిప్పైన్స్‌లో భూకంపం
మనీలా: దక్షిణ ఫిలిప్ఫైన్స్లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు అయింది. ఈ మేరకు భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కాని సంభవించినట్లు సమాచారం లేదని తెలిపారు. ఈ భూకంపం గురువారం తెల్లవారుజామున 2.21 గంటలకు వచ్చిందన్నారు. సియోకన్ ద్వీపంలోని 12 కిలోమీటర్ల అడుగు భాగంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాకు 750 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. -
ఇద్దరు భారతీయులకు మెగసెసె
ఐఎఫ్ఎస్ అధికారి చతుర్వేది, గూంజ్ ఎన్జీవో వ్యవ స్థాపకుడు అన్షు గుప్తాకు పురస్కారం * ఎయిమ్స్‌లో అవినీతిపై పోరాడిన చతుర్వేది * పాత బట్టలు, గృహోపకరణాలు సేకరించి పేదవారికి అందిస్తున్న గూంజ్ న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు ఇద్దరు భారతీయులను వరించింది. ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షు గుప్తా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి అయిన చతుర్వేది(40) ప్రస్తుతం ఎయిమ్స్‌కు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎయిమ్స్‌లో సంచలనం సృష్టించిన కుంభకోణాలపై ఈయన దర్యాప్తు ప్రారంభించి ప్రశంసలు అందుకున్నారు. నిజాయతీగల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కిందటేడాది ఆగస్టులో ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేశారు. అత్యంత సాహసం, నిజాయతీతో అవినీతి నిర్మూలనకు కృషి చేసినందుకుగాను ‘ఎమెర్జెంట్ లీడర్షిప్’ కేటగిరీ కింద చతుర్వేదిని పురస్కారానికి ఎంపికచేసినట్లు రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్(ఆర్ఎంఏఎఫ్) ప్రకటించింది. ఇక అన్షు గుప్తా కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 1999లో గూంజ్ ఎన్జీవోను స్థాపించారు. పాత బట్టలు, గృహోపకరణాలను సేకరించి వాటిని నిరుపేదలకు అందించే సదుద్దేశంతో ఈయన ఈ సంస్థను నెలకొల్పారు. ఇతరులకు సాయం చేయడంలో సృజనాత్మకతను జోడించి మానవత్వాన్ని చాటారంటూ ఆర్ఎంఏఎఫ్ కొనియాడింది. ‘ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అత్యావశ్యకం. కనీస అవసరమైన బట్ట అందరికీ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ అది దానం చేసే వస్తువుగా మారిపోయింది. నిజానికి పేదరికమే అతిపెద్ద విపత్తు. దీని నిర్మూలనకు దీర్ఘకాలిక సహాయక చర్యలు చేపట్టాలి’ అని అన్షు గుప్తా పేర్కొన్నారు. పీఎంవోపై చతుర్వేది అసంతృప్తి విధులు నిర్వర్తించిన ప్రతిచోటా చతుర్వేది అవినీతిపై ఉక్కుపాదం మోపారు. ఫలితంగా ఆయనకు బదిలీలే బహుమానంగా వచ్చాయి. గత ఐదేళ్లలో ఏకంగా 12 సార్లు బదిలీ అయ్యారు. మెగసెసె అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూనే ప్రధాని కార్యాలయం(పీఎంవో) పనితీరుపై చతుర్వేది తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘నిజాయితీ గల అధికారులకు ఈ అవార్డు నైతిక మద్దతు ఇచ్చింది. ‘నేను లంచం తీసుకోను.. మరొకరితో తీసుకోనివ్వను’ అంటూ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకే పని చేశా. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఇదే స్ఫూర్తితో ఎయిమ్స్‌లో అవినీతిపై పోరాడా. సంస్థలోని అవకతవకలన్నింటిపై సాక్ష్యాలు సేకరించి పీఎం వోకు పంపాను. పారదర్శక దర్యాప్తు జరిపించి అవినీతి జలగలపై చర్యలు తీసుకోవాలని కోరాను. కానీ ఏం జరగలేదు. పెపైచ్చు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండడం వల్లే నేను ఈరోజు బతికి ఉన్నా’’ అని ఆయన పేర్కొన్నారు. మరో ముగ్గురికి కూడా.. చతుర్వేది, అన్షు గుప్తాతోపాటు మరో ముగ్గురు కూడా మెగసెసె అవార్డుకు ఎంపికయ్యారు. లావోస్‌కు చెందిన కొమలై చాంతావాంగ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన లిగయా ఫెర్నాండో-ఎమిల్‌బంగ్సా, మయన్మార్‌కు చెందిన క్యావ్ తు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు ఆర్ఎంఏఎఫ్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్ మూడో అధ్యక్షుడు రామన్ మెగసెసె గౌరవార్థం 1957 నుంచి ఈ అవార్డును అందజేస్తున్నారు. అవార్డు నగదు పేదల సేవకే రామన్ మెగసెసే అవార్డు కింద వచ్చే నగదు మొత్తాన్ని పేద ప్రజల సేవా కార్యక్రమాలకే ఉపయోగించనున్నట్లు అవార్డు విజేతలు సంజీవ్ చతుర్వేది, అన్షు గుప్తా బుధవారం వెల్లడించారు. చతుర్వేది.. అవార్డు కింద వచ్చిన మొత్తం రూ. 19 లక్షలనూ ఎయిమ్స్ ఖాతాలో వేయనున్నట్లు తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి
మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎం/బీ కిమ్ నిర్వాణ అనే ఈ పడవ ఆర్మాక్ నుంచి కామోట్స్ దీవులకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. పోర్టు నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పడవ ప్రమాదం పాలైంది. బలమైన గాలుల కారణంగా సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారడంతో ఇది అదుపుతప్పి తిరగబడినట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో మొత్తం 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో చుట్టుపక్కల ఉన్న ఫిషింగ్ బోట్లలోనివారు, కోస్ట్‌గార్డు సిబ్బంది వెంటనే స్పందించారు. కనీసం 127 మందిని వీరు కాపాడినట్టు కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. -
సెల్ఫీల కోసం.. ఓ మ్యూజియం!!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఇపుడు సెల్పీల రాజధానిగా కూడా ఖ్యాతి గడిస్తోంది. ఇక్కడున్న ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీల మ్యూజియం ఫోటో ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. త్రీ డైమన్షనల్ పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. రండి...ఇక్కడ కావాల్సినన్ని సెల్ఫీలు తీసుకో్ండి... మీ ఆనందాన్ని ప్రపంచంతో పంచుకోండి...పండగ చేసుకోండి...అంటూ ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు. సాధారణంగా మ్యూజియం అంటే అక్కడ ప్రదర్శనకు ఉంచిన వస్తువులను, పెయింటింగ్స్, బొమ్మలు ఏవైనా చేతితో తాకడానికి కూడా అవకాశం ఉండదు. వేలమంది సందర్శకులు వాటిని చేతితో తాకితే పాడైపోతాయనే ఉద్దేశంతో అలాంటి నిషేధాజ్ఞలు ఉంటాయి. అంతేకాదు ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. కానీ మనీలాలో ఉన్న మ్యూజియంలో మాత్రం కావాల్సినన్నీ ఫోటోలు తీసుకోవచ్చు. ముట్టుకోవచ్చు. ఆడుకోవచ్చు, గెంతొచ్చు.. అంతెందుకు మీకు ఎలా కావాలంటే అలా పోటోలకు ఫోజులివ్వొచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. పైపెచ్చు మాకు అదే కావాలంటున్నారు నిర్వాహకులు. మీరు లేకపోతే ఈ మ్యూజియం లేదు.. మీరు ఫోటోలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ కు అర్థం లేదంటున్నారు మ్యూజియం కార్పొరేట్ సెక్రటరీ బ్లిత్ కాంబయా. ఇక్కడ మీ అనుభవాలను, మీరు తీసుకున్న ఫోటోలను ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా పంచుకోవచ్చంటున్నారు. మిగతా మ్యూజియంలలో అయితే సీరియస్‌గా ఉండాలి... కానీ ఇక్కడ మాత్రం సెల్ఫీలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు అమెరికా పర్యాటకులు. ఈ అనుభవం కొత్తగా, అద్భుతంగా ఉందంటున్నారు. -
ఇండియన్ ఏసెస్ శుభారంభం
మనీలా: టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)కు శుక్రవారం తెర లేచింది. ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల కలయికతో జరుగుతున్న ఈ లీగ్ తొలి అంచె పోటీలు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభమయ్యాయి. తొలి పోరులో భారత్‌కు చెందిన ఇండియన్ ఏసెస్ జట్టు దుమ్ము రేపింది. సానియా మీర్జా, రోహన్ బోపన్న, అనా ఇవనోవిచ్, సాంటోరో, మోన్ఫిల్స్లతో కూడిన ఈ జట్టు 26-16 స్కోరుతో సింగపూర్ స్లామర్స్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. పురుషుల డబుల్స్ మినహా అన్ని మ్యాచ్‌లను నెగ్గిన ఏసెస్ లీగ్‌ను ఘనంగా ఆరంభించింది. ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-4తో బ్రూనో సోర్స్, డానియేలా హంటుచోవాను ఓడించింది. ఆ తర్వాత పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంటోరో 6-5తో పాట్రిక్ రాఫ్టర్‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు. అయితే పురుషుల డబుల్స్‌లో మాత్రం ఏసెస్‌కు చుక్కెదురైంది. బోపన్న, మోన్ఫిల్స్ జోడి 2-6తో నిక్ కిర్గియోస్, టామస్ బెర్డిచ్ చేతిలో ఓడిపోయింది. కానీ మహిళల సింగిల్స్‌లో మాత్రం అనా ఇవనోవిచ్ చెలరేగింది. 6-0తో హంతుచోవాను ఓడించింది. ఆ తర్వాత చివరిగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ జట్టు విజయాన్ని పరిపూర్ణం చేశాడు. లీటన్ హెవిట్‌ను 6-1 తేడాతో ఓడించడంతో ఏసెస్ పాయింట్లు గణనీయంగా పెరిగాయి. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో యూఏఈ రాయల్స్ 29-24 తేడాతో మనీలా మావెరిక్స్‌ను ఓడించింది. -
‘మెగసెసె’లో మెరిసిన చైనా
మనీలా: ఆసియా నోబెల్‌గా ప్రఖ్యాతిగాంచిన ‘రామన్ మెగసెసె’ అవార్డుకు చైనాకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసే వారికి అందించే ఈ అవార్డును గురువారం మొత్తం ఆరుగురికి ప్రకటించగా.. వారిలో చైనా జర్నలిస్టు హు షులీ (61), న్యాయవాది వాంగ్ కన్ఫా (55) ఉన్నారు. ఇండోనేసియాకు చెందిన మానవతాశాస్త్రజ్ఞుడు సౌర్ మర్లీనా మనురంగ్ (42), అఫ్ఘానిస్థాన్ నేషనల్ మ్యూజియం డెరైక్టర్ ఒమారా ఖాన్ మసౌది (66), ఫిలిప్పీన్స్ టీచర్ రేండీ హలాసన్ (31), పాకిస్థాన్ ఎన్జీఓ ది సిటిజన్స్ ఫౌండేషన్ ఉన్నాయి. బిజినెస్ మ్యాగజైన్ కయ్జింగ్కు ఎడిటరైన షులీ పరిశోధనాత్మక కథనాలు చైనాలో ప్రభావం చూపాయని, కార్పోరేట్ మోసాల్ని, 2003లో సార్స్ వ్యాధిపై ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారని మెగసెసె ఫౌండేషన్ తెలిపింది. -
పిలిఫ్పీన్స్లో ఘర్షణ: 18 మంది మృతి
మనీలా: పిలిఫ్పీన్స్లో భద్రత దళాల, తిరుగుబాటుదారులు మధ్య ఘర్షణ చోటు చేసుకుని 18 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పిలిఫ్పీన్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల కథనం ప్రకారం... బంగ్సామారో ఇస్లామిక్ ఫ్రీడం ఫైటర్స్ (బీఐఎఫ్‌ఎఫ్) చెందిన తిరుబాటుదారులు ఈ రోజు తెల్లవారుజామున పిలిఫ్పీన్స్ మిలటరీ దళాలకు చెందిన కంపెనీపై అకస్మాత్తుగా దాడి చేశారు. భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. దాంతో 17 మంది బీఐఎఫ్‌ఎఫ్ తిరుగుబాటుదారులు మరణించారని చెప్పారు. ఓ సైనికుడు కూడా మృతి చెందాడని తెలిపారు. మృతుల్లో అయిదుగురిని గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
వ్యాన్‌పై పడిన బస్సు:21 మంది మృతి
ఎగువ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, దిగువ భాగంలో వెళ్తున్న వ్యాన్‌పై పడిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ ఘటన ఈ రోజు తెల్లవారుజామున పిలిప్పిన్స్ రాజధాని మనీలా శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా, మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించలి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. మృతదేహలను వెలికి తీసే పనిని ముమ్మరం చేసినట్లు వివరించారు. అలాగే మృతులను గుర్తించవలసి ఉందని పేర్కొన్నారు. అయితే బస్సు ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు వివరించారు. వర్షం కారణంగా ఆ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
ఫిలిప్పీన్స్‌లో వరద బీభత్సం
ఫిలిప్పీన్స్‌లోని సమర్ ప్రావెన్స్లో తుఫాన్ 'కొంగ్ రీ' వల్ల సంభవించిన వరద బీభత్సంతో దాదాపు 11 గ్రామల ప్రజలు నిరాశ్రయులైయ్యారని ఉన్నతాధికారులు ఇక్కడ వెల్లడించారు. అయా గ్రామాలకు చెందిన దాదాపు 500పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాల తరలించినట్లు తెలిపారు. ఆ ప్రావెన్స్లోని వివిధ పాఠశాలల్లో వారినికి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ వరద ప్రభావ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. నైరుతి రుతుపవనాల వల్ల ఫిలిఫైన్స్‌లో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని అయితే ఈ సారి బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని ఫిలిప్పీన్స్ ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఫిలిఫ్పీన్స్ నౌకా ప్రమాదంలో 24మంది మృతి
మనిలా : ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలిప్పీన్స్ ఓడరేవు సెబుకు సమీపంలో అర్థరాత్రి దాటాక జరిగిన నౌకా ప్రమాదంలో 24మంది దుర్మరణం చెందారు. 700 మందితో ప్రయాణిస్తున్న నౌక అటుగా వస్తున్న మరో కార్గో షిప్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కార్గోషిప్‌ను ఢీకొట్టిన గంటన్నరలోనే నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో నౌకలోని 24 మంది చనిపోయారు.మరో 217మంది గల్లంతు అయ్యారు. మిగతా వారిని కోస్టుగార్డులు కాపాడారు. నౌక ఢీకొన్న విషయాన్ని గుర్తించిన కొందరు సముద్రంలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మొత్తం 629 మందిని కోస్టు గార్డులు కాపాడారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రావస్థలో ఉన్నారని, చీకట్లో తమకు ఎటువెళ్ళాలో తెలియక ఇబ్బంది పడ్డామనీ ప్రయాణికులు చెప్పారు.