ఎగువ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, దిగువ భాగంలో వెళ్తున్న వ్యాన్పై పడిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఆ ఘటన ఈ రోజు తెల్లవారుజామున పిలిప్పిన్స్ రాజధాని మనీలా శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా, మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను నగరంలోని ఆసుపత్రికి తరలించలి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. మృతదేహలను వెలికి తీసే పనిని ముమ్మరం చేసినట్లు వివరించారు. అలాగే మృతులను గుర్తించవలసి ఉందని పేర్కొన్నారు.
అయితే బస్సు ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉన్నతాధికారులు వివరించారు. వర్షం కారణంగా ఆ దుర్ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.