
మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురితోపాటు మరో ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. పీపర్–23 అపాచీ విమానం బులాకన్ ప్రావిన్స్‌లోని ప్లారిడెల్ పట్టణంలో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంటిని ఢీకొంది. దీంతో విమానం పేలి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఆరుగురు ప్రయాణించే ఈ విమానంలో ప్రమాద సమయంలో ఐదుగురు ఉన్నారు. వీరితోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వివరించారు. ఇంట్లోకి దూసుకెళ్లడానికి ముందు చెట్టును, విద్యుత్ స్తంభాన్ని విమానం ఢీకొట్టిందని ప్రత్యక్షసాక్షులు ఒకరు తెలిపారు.