
మనీలా: ఫిలిప్పైన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తర ఫిలిప్పైన్స్‌లో భూకంపం దాటికి రెండు భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. భూకంపం సంభవించిన సమయంలో రాజధాని మనీలాలోని కార్యాలయాలు అటూ ఇటూ ఊగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి చేరుకున్నారు. మనీలాకు వాయువ్యంగా 60 కిలోమీటర్ల దూరంగా, భూమికి 40 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.