ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 10 కిమీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది. ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలు కావడం, భూకంపాలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment