
మనుషుల్ని చీమల్లా తొక్కించారు..
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. భద్రత అధికారులు ఆందోళనకారుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.
మనీలాలో అమెరికా ఎంబసీ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నవారిని పోలీసులు విచక్షణరహితంగా కొట్టారు. పోలీసు వాహనాలను నిరసనకారులపై దూసుకెళ్లించారు. వాహనాలను ముందుకు, వెనుకకు పోనిస్తూ ఆందోళనకారులపై నడపడటంతో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. పోలీసులు కనిపించినవారినందిరినీ చితకబాదుతూ లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. చాలామంది నిరసనకారులకు కాళ్లు, చేతులు విరిగాయి. మరికొందరికి రక్తగాయాలయ్యాయి. పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.