
‘డ్రగ్ మాఫియా నిర్మూలనకు కీలక నిర్ణయాలు..!’
మనీల: ఫిలిపైన్స్ పోలీసు కాల్పులో 32 మంది అనుమానిత డ్రగ్ డీలర్లు మృతిచెందారు. మరో 107 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ మాఫియాను నిర్మూలించే క్రమంలో దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు సుమారు 66 చోట్ల సోదాలు నిర్వహించారు.
సోదాల్లో భాగంగా పలువురు పోలీసులపైకి కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పెద్ద మొత్తంలో మెటాంఫెటామైన్, మారిజునా అనే డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక 34 ఆయుధాలను కూడా సీజ్ చేశారు.