మనీలా: పిలిఫ్పీన్స్లో భద్రత దళాల, తిరుగుబాటుదారులు మధ్య ఘర్షణ చోటు చేసుకుని 18 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పిలిఫ్పీన్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఉన్నతాధికారుల కథనం ప్రకారం... బంగ్సామారో ఇస్లామిక్ ఫ్రీడం ఫైటర్స్ (బీఐఎఫ్ఎఫ్) చెందిన తిరుబాటుదారులు ఈ రోజు తెల్లవారుజామున పిలిఫ్పీన్స్ మిలటరీ దళాలకు చెందిన కంపెనీపై అకస్మాత్తుగా దాడి చేశారు. భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. దాంతో 17 మంది బీఐఎఫ్ఎఫ్ తిరుగుబాటుదారులు మరణించారని చెప్పారు. ఓ సైనికుడు కూడా మృతి చెందాడని తెలిపారు. మృతుల్లో అయిదుగురిని గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.