BIFF
-
ఇండియన్ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు
జాతీయ అవార్డు గ్రహీత అపర్ణసేన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది రేపిస్ట్’ 26వ బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ‘ఏ విండో ఆఫ్ ఏషియన్ సినిమా’ విభాగంలో ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారానికి ఎంపికైంది. పలు విదేశీ చిత్రాలతో పోటీ పడిన ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. కొంకొణాసేన్ శర్మ, అర్జున్ రాంపాల్, తన్మయ్ దనానియా ముఖ్య పాత్రలు పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఈ ముగ్గురి జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో కొంకణా అత్యాచారానికి గురైన మహిళ పాత్రను పోషిస్తుంది. అర్జున్ రాంపాల్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ది క్వెస్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు సైతం విమర్శకుల ప్రశంసలు పొందిన ‘స్కామ్ 1992’ వెబ్సిరీస్ని నిర్మించింది. చదవండి: బూసన్ ఫీల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’ -
బుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేట్ అయిన బాలీవుడ్ నటుడు
శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘రే’. ఇది సత్యజిత్ రే కథ 'బిపిన్ చౌదరి కా స్మృతి భ్రం' ప్రేరణలో దీన్ని తీశాడు. ఈ ఆంథాలజీని ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు ప్రశంసించారు. అయితే ఆసియాలో పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అయిన బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్)కి మూడో ఆసియా కంటెంట్ అవార్డ్స్‌లో భాగంగా ఉత్తమ నటుడు కేటగిరికి ఈ ఆంథాలజీలో లీడ్‌రోల్ నటించిన అలీ ఫజల్ నామినేట్ అయ్యాడు. మామూలుగా వేరే దేశాల్లో జరిగే ఇలాంటి కార్య్రమాల్లో ఇండియా నుంచి నామినేషన్లు దక్కడం చాలా అరుదనే చెప్పాలి. ఈ ఫిట్ సాధించిన తర్వాత బీఐఎఫ్‌ఎఫ్ నామినేట్ అవ్వడం ఊహించలేదని అలీ తెలిపాడు. ఇది జరగడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. ఆసియా కంటెంట్ అవార్డ్స్ సాధిస్తాననే ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. చదవండి: ఈ మూవీ సమయంలో తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురయ్యా: అలీ ఫజల్ -
బూసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’
నటనతోపాటు దర్శకత్వంలో ప్రతిభతో జాతీయ అవార్డులు పొందిన బెంగాలి నటి అపర్ణ సేన్. నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఈస్ట్ అవార్డులు పొందింది. అంతేకాదు పలుమార్లు ఉత్తమ ఫిల్మ్ మేకర్‌గా నిలిచింది. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ది రేపిస్ట్'. ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ బూసన్ ఇంటర్నేషనల్ ఫీల్మ్ ఫెస్టివల్ (బీఐఎఫ్‌ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ.. ‘మనుషులు రేపిస్టులుగా మారేందుకు దోహదపడే విషయాలను తెలుసుకోవడం, వారు మారేందుకు మార్గాలను అన్వేషిచడం నన్ను ఈ కథను ఎంచుకునేలా చేశాయి. అవే ఈ సినిమాలోని మూడు ముఖ్యపాత్రల్లో కనిపిస్తాయి’ అని తెలిపారు. ‘మనకు రెండు రకాలు ఇండియాలు ఉన్నాయి. పాత నమ్మకాలతో కూడిన మురికి వాడల్లో నివసించే ప్రజలతో ఒకటి, చదువుకుని ప్రగతిశీల విలువలతో ఉన్న ప్రజలతో మరొకటి నిండి ఉన్నాయి. రెండు రకాల భారతదేశాన్ని మా సినిమాలో చూపించాం’అని చెప్పారు. 'ది రేపిస్ట్' నేపథ్యం ఇదే.. అర్జున్ రాంపాల్, కొంకణ్ సేన్ శర్మ నటించిన 'ది రేపిస్ట్' మూడు ముఖ్యపాత్రల ప్రయాణం. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఆ మూడు పాత్రల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. నేరాల వెనుక జరిగే పరిణామాలు నేరస్తులనే కాకుండా, నేరం నుంచి బయటపడిన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. ఈ చిత్రాని నిర్మించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో సమీర్ నాయర్ మాట్లాడుతూ.. మా మొదటి ఫీచర్ ఫిల్మ్‌కి అపర్ణ సేన్ లాంటి ప్రతిభవంతురాలితో కలిసి ఇలాంటి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అది బీఐఎఫ్‌ఎఫ్ కోసం కిమ్ జిసెయోక్ అవార్డు నామినేట్ అవ్వడంతో ఆ ఉత్సాహం రెట్టింపు అయ్యింది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రపంచ ప్రేక్షకుల మదిని దోచుకుంటుందని ఆశిస్తున్నామ"ని తెలిపాడు. అపర్ణ సేన్ 1974 నుంచి 1983 వరకు ఉత్తమ నటిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకోడంతో పాటు దర్శకత్వం, స్క్రీన్ రైటర్ వంటి వివిధ శాఖల్లో తన ప్రతిభను చాటుకుని జాతీయ అవార్డులను పొందింది. దీంతో చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మశ్రీతో సత్కరించింది. కాగా ఆసియాలోనే అతి పెద్దదైన బీఐఎఫ్‌ఎఫ్ 26వ ఎడిషన్ అక్టోబర్ 6 నుంచి 15 వరకు జరగనుంది. -
పిలిఫ్పీన్స్లో ఘర్షణ: 18 మంది మృతి
మనీలా: పిలిఫ్పీన్స్లో భద్రత దళాల, తిరుగుబాటుదారులు మధ్య ఘర్షణ చోటు చేసుకుని 18 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారని... వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పిలిఫ్పీన్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఉన్నతాధికారుల కథనం ప్రకారం... బంగ్సామారో ఇస్లామిక్ ఫ్రీడం ఫైటర్స్ (బీఐఎఫ్‌ఎఫ్) చెందిన తిరుబాటుదారులు ఈ రోజు తెల్లవారుజామున పిలిఫ్పీన్స్ మిలటరీ దళాలకు చెందిన కంపెనీపై అకస్మాత్తుగా దాడి చేశారు. భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. దాంతో 17 మంది బీఐఎఫ్‌ఎఫ్ తిరుగుబాటుదారులు మరణించారని చెప్పారు. ఓ సైనికుడు కూడా మృతి చెందాడని తెలిపారు. మృతుల్లో అయిదుగురిని గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.