ఫిలిప్పీన్స్లోని సమర్ ప్రావెన్స్లో తుఫాన్ 'కొంగ్ రీ' వల్ల సంభవించిన వరద బీభత్సంతో దాదాపు 11 గ్రామల ప్రజలు నిరాశ్రయులైయ్యారని ఉన్నతాధికారులు ఇక్కడ వెల్లడించారు. అయా గ్రామాలకు చెందిన దాదాపు 500పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాల తరలించినట్లు తెలిపారు. ఆ ప్రావెన్స్లోని వివిధ పాఠశాలల్లో వారినికి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు.
అయితే ఆ వరద ప్రభావ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. నైరుతి రుతుపవనాల వల్ల ఫిలిఫైన్స్లో ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని అయితే ఈ సారి బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని ఫిలిప్పీన్స్ ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.