విమానంలో ప్రయాణించాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. సమయం వృథా కాకుండా, ఇదివరకెప్పుడూ విమానం ఎక్కని వారైతే ఓ కొత్త ట్రావెలింగ్ అనుభవం సొంతం చేసుకోవాలంటే గాలి మోటార్‌లో తిరగాలనుకోవడం సహజమే. అయితే విమానంలో మనం ఒక్కరమే ఉన్నామని తెలిస్తే ఆశ్చర్యంతో పాటు కాస్త భయం కూడా వేస్తుంది కదా. లూసియా ఇరిస్పే అనే ఫిలిప్పీన్స్ మహిళకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
దావో నుంచి మనీలాకు వెళ్లేందుకు ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్‌లో లూసియా గత వారం టికెట్ బుక్ చేసుకున్నారు. విమానం ఎక్కిన తర్వాత చూస్తే తాను తప్ప వేరే ప్రయాణికులెవరూ కనిపించక పోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి సంభవించే ఇలాంటి అరుదైన ఘటన.. తనకు ఓ మధుర ఙ్ఞాపకాన్ని మిగిల్చిదంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనతో పాటు విమానంలో ఉన్న ఏడుగురు సిబ్బంది(క్యాబిన్ క్రూ)తో కలిసి ఫొటోలు దిగి హల్‌చల్ చేశారు.
కాగా గతంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వేకువజామునే బయల్దేరే ఫ్లైట్ కావడంతో లాట్‌అమీ అనే మహిళా ప్రయాణికురాలికి లూసియా వంటి అనుభవమే ఎదురైంది. ఆ ఆనందంలో విమానమంతా కలియతిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న వీడియోనున లాట్‌అమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment