![PM 2nd Special Plane Prez, Takes Off for Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/24/65.jpg.webp?itok=t1o5N7mW)
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించడం కోసం మరో విమానం సిద్ధం అయ్యింది. వారు ప్రయాణించడానికి రెండు బోయింగ్ 777 విమానాలు సిద్ధం చేయగా వాటిలో రెండోది ప్రేజ్ శనివారం నాడు రాజధాని ఢిల్లీకి చేరుకోనుంది.
వీటిలో మొదటి విమానం, అక్టోబర్ 1వ తేదీన ఢిల్లీలో ల్యాండ్ అయ్యేలా కాన్ఫిగర్ చేయబడింది. బోయింగ్ 777-300 ఈఆర్ అనే రెండు విమానాలు 2018లో ఎయిర్ ఇండియాలో చేరాయి. ఈ రెండు విమానాలు క్షిపణి రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి 2024లో అమెరికా అధ్యక్షుడికి ఏర్పాటు చేయబోయే విమానాలులాగా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-200 బీ సిరీస్ విమానాలు సిద్ధం చేస్తున్నారు. ఇవి కూడా వాటితో సమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇప్పటి వరకు రాష్టపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ఎవరు విదేశాలకు ప్రయాణించాలన్నా ప్రతిసారి ప్రభుత్వం ఎయిర్ ఇండియాను అభ్యర్థించి విమానాలను సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా వారి కోసమే ప్రత్యేకవిమానం వచ్చేసింది. ఇవి ఈ ఏడాది ఆగస్టులోనే ఇండియాకు రావాల్సి ఉండగా కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అయ్యింది. ఎయిర్ ఇండియాతో పాటు భారత వైమానిక దళం నుంచి వచ్చిన పైలట్ల ఈ విమానాన్ని నడుపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment