గాల్లో ఉన్న విమానంలో భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు! | Flyers Injured Turbulence Hits Air India Delhi-Sydney Flight | Sakshi
Sakshi News home page

గాల్లో ఉన్న విమానంలో భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు!

Published Wed, May 17 2023 4:42 PM | Last Updated on Wed, May 17 2023 4:42 PM

Flyers Injured Turbulence Hits Air India Delhi-Sydney Flight - Sakshi

ఢిల్లీ: ఎయిర్‌ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. విమానం భారీ కుదుపు కారణంగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణంలో విమానంలో భారీ కుదుపు కారణంగా ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయి ఆందోళనకు గురయ్యారు. 

వివరాల ప్రకారం.. ఎయిరిండియాకు చెందిన బీ787-800 విమానం ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరింది. అయితే, టేకాఫ్‌ అయిన కొద్దిసేపటి తర్వాత విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనైంది. ఒక్కసారిగా విమానం భారీ కుదుపునకు లోనుకావడంతో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా వణికిపోయారు. ఈ క్రమంలో​ కుదుపు కారణంగా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు. దీంతో, ప్రమాదం తప్పింది అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని.. మరెవరికీ ఆసుపత్రిలో చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్‌ తెలిపారు. ఈ ఘటన ప్రమాణికులను చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

ఇది కూడా చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్‌పైకి విసిరేసిన తండ్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement