
దేశంలో ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతి ఎయిర్‌లైన్ కంపెనీ రాబోయే పదేళ్లలోపు కొత్త విమానాలు కొనబోతున్నదని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా (సీఏపీఏ ఇండియా) తెలిపింది.
ఇటీవల టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బోయింగ్ నుండి 220 విమానాలను, ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పోటాపోటీగా ఇతర విమానయాన సంస్థలు రెండేళ్లలో మరో 1,200 విమానాలను ఆర్డర్ చేయబోతున్నాయి.
ఎయిరిండియా తర్వాత.. ఇండిగో 300 విమానాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇండిగో సంస్థ గతంలోనే విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కానీ కోవిడ్ వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ ఇప్పుడు ఆర్ధిక మాద్యం, సప్లై చెయిన్ సమస్యలు లేకపోతే భారీగా విమానాలు కొనుగోలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
2022 డిసెంబర్ 31 నాటికి ఎయిర్‌బస్, బోయింగ్‌లు కలిపి 12,669 ఆర్డర్‌లను డెలివరీ చేయాల్సి ఉంది కానీ ఇప్పటికీ సాధ్యం కాలేదు. డెలివరీ స్లాట్ల కోసం కనీసం రెండేళ్ళ వరకు ఆగాలని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్‌ఐఏ)కు చెందిన అనుబంధ సంస్ధ స్కూట్ తొమ్మిది ఎంబ్రాయర్ 190-ఈ2 ఎయిర్ క్రాఫ్ట్‌లు, కొనుగోలు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment