చూడు తమ్ముడూ! | dekh bhai app | Sakshi
Sakshi News home page

చూడు తమ్ముడూ!

Published Wed, Apr 29 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

చూడు తమ్ముడూ!

చూడు తమ్ముడూ!

విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్‌గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్‌లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్‌లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో రాజ్యమేలుతోంది.

ఈ మధ్య.. వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్‌లైన్‌లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్‌భాయ్ యాప్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్‌గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్‌బిల్ట్ మెసేజ్‌లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి.
 
హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ..
‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్‌షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్‌గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్‌కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు.
 
సెలబ్రిటీ హంగులు..
దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్‌లు ఆన్‌లైన్‌లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్‌కు ఈతరం యువత రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించే ఎల్లో కలర్‌ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్‌గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్‌ప్రెషన్స్‌నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్‌ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్‌లోడ్ కర్..!!’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement