న్యూలుక్‌లో ఫేస్‌బుక్‌ మెసెంజ‌ర్‌ | Facebook Messenger Gets New Look | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ మెసెంజ‌ర్‌లో మరో ఫీచర్‌

Published Wed, Oct 14 2020 4:55 PM | Last Updated on Wed, Oct 14 2020 4:55 PM

Facebook Messenger Gets New Look - Sakshi

ప్ర‌పంచ సాంకేతిక దిగ్గ‌జం ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను కొత్త అవ‌తారంలో తీసుకురానుంది. అంతే కాకుండా దానికి చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్క‌ర్లు, స‌రిప‌డా ప్ర‌తిస్పంద‌న‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ‘భ‌విష్య‌త్ మెసెజింగ్‌కు అనుగుణంగా మార్పులు ఉంటాయి. ఈ మ‌ధ్యే ఇన్ స్టాగ్రామ్ తో మెసెంజ‌ర్ అనుసంధానం జ‌రిగింది' అని ఫేస్‌బుక్ వెల్ల‌డించింది. 

ఫేస్‌బుక్‌ మెసెంజర్ కొత్త లోగో దాని సాంప్రదాయ సాలిడ్ బ్లూ(నీలం) రంగు నుంచి కొద్దిగా మార‌నుంది. దానికి బదులుగా, ఇది ఇన్‌స్టాగ్రామ్ లోగో మాదిరిగా నీలం- నుండి- పింక్ ప్రవణతకు రూపుదిద్దుకోనుంది. త్వరలో వినియోగదారులు ఇన్‌కమింగ్ సెల్ఫీ స్టిక్కర్ల ఫీచ‌ర్లను ఉపయోగించగలుగుతారు. అది వారి సెల్ఫీల‌తో పాటు స్టిక్కర్లను త‌యారుచేయ‌డానికి వీలు కల్పిస్తుంది.

ఫేస్‌బుక్‌ కూడా డార్క్ మోడ్ లక్షణాన్ని విడుదల చేస్తుంది, దీని ద్వారా మీరు చాట్ నుండి నిష్క్రమించినప్పుడు లేదా అవి చూసిన తర్వాత సందేశాలు అదృశ్యమవుతాయి. "మా క్రొత్త లోగో భ‌విష్య‌త్ మెసెజింగ్ విష‌యంలో జ‌ర‌గాల్సిన మార్పును ప్రతిబింబిస్తుంది. మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరింత డైనమిక్, ఆహ్లాదకరమైన, సమ్మిళిత‌ మార్గం దిశ‌గా మ‌ళ్ల‌నుంది. ఈ మార్పు మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము.  కేవ‌లం  మెసేజులు మాత్రమే పంపుకునే ద‌శ నుంచి ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో  వివిధ యాప్‌లు, ప‌రిక‌రాల ద్వారా హ్యాంగ‌వుట్ అయ్యేందుకు నూత‌న మార్పులు వీలు క‌ల్పిస్తాయి” అని మెసెంజర్  వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గ‌త నెల‌లోనే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించింది. దీంతో మెసెంజ‌ర్ లేదా ఇన్‌స్టాలలో దేన్నుంచైనా దేనికైనా సందేశాలు పంపుకునే వీలుంది. (చదవండి: యూజర్లకు షాక్.. ఐఫోన్ 12లో అవి మిస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement