మెటాకు చెందిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందించింది. ఎట్టకేలకు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్‌బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్‌బుక్ సొంతం. ది వెర్జ్ ప్రకారం 2016లోనే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. టెక్స్ట్ సందేశాలు అలాగే గ్రూప్ చాట్‌లు, కాల్‌లను E2EE ఫీచర్ వస్తోందని ది వెర్జ్ నివేదిక తెలిపింది. అయితే 2023లోపు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (End to end encryption) ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.
దాంతో పాటుగా మరిన్నీ ఫీచర్స్..!
మెసేంజర్‌లో ఈ ఫీచర్ పూర్తి రోల్ అవుట్‌తో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లలో, యూజర్లు GIFలు, స్టిక్కర్‌లు, రియాక్షన్‌లు, మెసేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి లాంగ్ ప్రెస్ ఉపయోగించవచ్చును. అంతేకాకుండా సదరు యూజర్‌కు పంపిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీస్తే ఇట్టే రెసిపెంట్‌కు తెలిసిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం వానిష్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది.
చదవండి: బ్రాటా యమడేంజర్.. ముందు బ్యాంక్ అకౌంట్, ఆపై పర్సనల్ డాటా.. గుర్తించి జాగ్రత్త పడండి ఇలా!
Comments
Please login to add a commentAdd a comment