end to end encryption
-
ఫేస్బుక్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇప్పుడు అందరికీ అందుబాటులో..!
మెటాకు చెందిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందించింది. ఎట్టకేలకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్బుక్ సొంతం. ది వెర్జ్ ప్రకారం 2016లోనే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. టెక్స్ట్ సందేశాలు అలాగే గ్రూప్ చాట్లు, కాల్‌లను E2EE ఫీచర్ వస్తోందని ది వెర్జ్ నివేదిక తెలిపింది. అయితే 2023లోపు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (End to end encryption) ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్కు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా మరిన్నీ ఫీచర్స్..! మెసేంజర్‌లో ఈ ఫీచర్ పూర్తి రోల్ అవుట్‌తో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్లలో, యూజర్లు GIFలు, స్టిక్కర్లు, రియాక్షన్లు, మెసేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి లాంగ్ ప్రెస్ ఉపయోగించవచ్చును. అంతేకాకుండా సదరు యూజర్‌కు పంపిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీస్తే ఇట్టే రెసిపెంట్‌కు తెలిసిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం వానిష్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. చదవండి: బ్రాటా యమడేంజర్.. ముందు బ్యాంక్ అకౌంట్, ఆపై పర్సనల్ డాటా.. గుర్తించి జాగ్రత్త పడండి ఇలా! -
Meta: యూజర్ సేఫ్టీ.. ఇప్పట్లో అది కష్టమేనా!
end to end encryption To FB Messenger And Instagram: పేరు మారినా.. తీరు మారుతుందా? అంటూ మెటా (ఫేస్బుక్ కంపెనీ) వ్యవహారశైలిపై విసుర్లు విసురుతున్నారు నెటిజనులు. పైగా కంపెనీ పేరు మారాక నష్టాలతో పాటు విమర్శలూ పెరిగిపోయాయి. ఈ తరుణంలో యూజర్ల భద్రతకు సంబంధించిన ఓ అప్డేట్ను ఇప్పట్లో తేవడం కష్టమేనని తేల్చేసింది మెటా. వాట్సాప్ తరహాలోనే మెటా సర్వీసులైన ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ end-to-end encryption సేఫ్టీ ఫీచర్‌ను మెటా (ఫేస్బుక్ కంపెనీ) అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే!. తద్వారా యూజర్ల గోప్యత హామీని నెరవేర్చే ఆలోచనలో ఉంది. అయితే వచ్చే ఏడాదిలోనే ఈ సర్వీస్‌ను యూజర్ల దాకా తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడది మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వీలైతే 2023 నుంచే ఆ ప్రయత్నాలు మెటా కంపెనీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యూజర్ సేఫ్టీకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు తేవడం కాస్త ఆలస్యం అవుతుందని మెటా సేఫ్టీ హెడ్ అయిన ఆంటీగాన్ డేవిస్ ‘ది టెలిగ్రాఫ్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని ఆయన తేల్చేశారు. అయితే ఈ సర్వీస్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతందనే వాదనను మాత్రం మెటా అంగీకరించదని డేవిస్ చెబుతున్నారు. మరోవైపు పిల్లల భద్రతకు సంబంధించి(ఇన్స్టాగ్రామ్) మెటాపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో.. విమర్శలకు చెక్ పెట్టేందుకైనా E2EE సేవల్ని వీలైనంత త్వరగతిన అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల ఛాటింగ్ చాలా భద్రంగా ఉంటుందని whatsapp తొలి నుంచి ప్రకటించుకుంటోంది. అయితే నేరాలు జరిగిన సమయంలో వారెంట్ జారీ అయినప్పుడు.. నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ‘ఎన్క్రిప్షన్ యాసెస్’కు అనుమతులు ఇచ్చే చట్టాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తలొగ్గాల్సిందేనని కొన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో భారత్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, యూకే ఉండగా.. కిందటి ఏడాది ఈ దేశాలతో అమెరికా కూడా గళం కలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ బ్రెస్ట్ మసాజర్! ఎలా పని చేస్తుందంటే.. -
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్
వాట్సాప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్. ఇద్దరి మధ్యగానీ, గ్రూపులోగానీ సంభాషణలకు, వ్యక్తిగత కాల్స్‌కు ఇంటర్నెట్ స్వేచ్ఛతో అనుమతించ్చే యాప్. అయితే వాట్సాప్‌లో యూజర్ భద్రత గురించి బోలెడు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఫేస్బుక్ స్వయంగా వాట్సాప్ యూజర్ల డాటాపై కన్నేసిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరుణంలో యూజర్ల కోసం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ చాట్ డాటాకు భద్రత భరోసా ఇస్తున్న వాట్సాప్.. ఇప్పుడు మరో ప్రైవసీ అప్డేట్ ఇచ్చింది. చాట్ బ్యాకప్ల విషయంలోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వర్తిస్తుందని ప్రకటించింది. ‘‘ఒకవేళ ఎవరైనా వాట్సాప్ హిస్టరీని బ్యాక్ అప్ చేసినప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుతుంది. అది కేవలం వాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. సంబంధిత డ్రైవ్‌లోని సమాచారాన్ని ఎవరూ అన్‌లాక్ చేయలేరు’’ అని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ గురువారం వెల్లడించాడు. క్లిక్: ఫేస్బుక్ వల్లే న్యూడిటీ ప్రమోషనా? అయితే సంబంధిత డ్రైవ్‌ల్లో(ఐక్లౌడ్స్ లేదంటే గూగుల్ డ్రైవ్) ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కీ’ సాయంతో యాసెస్కి అనుమతి ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్ యూజర్‌కు అందుబాటులో రానుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. ఇది డిఫాల్ట్‌గా ఆన్ కాదు. పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేసుకోవడం గానీ, 64 డిజిట్ ఎన్క్రిప్షన్ కీ మీద యూజర్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ గనుక మర్చిపోతే.. అకౌంట్ రికవరీకి వాట్సాప్ కూడా ఎలాంటి సాయం అందించలేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా.. భారత్‌లో యూజర్ల సంఖ్య 40 కోట్లకు పైనే అని ఓ అంచనా. చదవండి: ఫేస్బుక్ కాదు.. పక్కా ఫేక్ బుక్ -
Facebook Whatsapp: దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతూ..
ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్.. వాట్సాప్ మొదటి నుంచి ఇస్తున్న భద్రత హామీ. యూజర్ల మధ్య జరిగే వాట్సాప్ చాట్, అందులోని ఇతరత్ర సమాచారం ఎట్టిపరిస్థితుల్లో మూడో మనిషి చేతికి వెళ్లదంటూ చెప్తూ వస్తోంది. అయితే వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ ఈ విషయంలో నైతిక విలువల్ని పక్కనపెట్టిందన్న ఆరోపణలు ఫేస్‌బుక్‌పై వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ ‘ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్’ కథనం ప్రకారం.. కోట్లలో యూజర్ల వాట్సాప్ అకౌంట్లపై ఫేస్బుక్ కన్నేసిందని, ఆస్టిన్, టెక్సాస్, డబ్లిన్, సింగపూర్లలో వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈ వ్యవహారం నడిపిస్తోందని ఆరోపించింది. వాట్సాప్ నిఘాపై కన్నేయడంతో పాటు ఈ వ్యవహారం కోసం ఫేస్బుక్ తన సొంత ఆల్గారిథంనే ఉపయోగిస్తోందని ఈ కథనం వెల్లడించింది. చదవండి: యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కన్నా దారుణంగా ఫేస్బుక్లో.. అయితే దొంగచాటుగా మెసేజ్‌లు చదువుతోందన్న ఆరోపణల్ని ఫేస్బుక్ ఖండించింది. కథనంలో ఆరోపిస్తున్న టీం.. వాట్సాప్ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడమే పనిగా పెట్టుకుందని, యూజర్లు పంపించే రిపోర్ట్ అబ్యూజ్.. ఇతరత్ర ఫిర్యాదుల్ని సమీక్షించడం కోసమేనని చెప్పింది. ఎన్క్రిప్షన్ కారణంగా.. వాట్సాప్ కాల్స్, వ్యక్తిగత మెసేజ్‌లను ఫేస్బుక్ ఎట్టిపరిస్థితుల్లో చదవలేదని స్పష్టం చేసింది ఫేస్బుక్. అంతేకాదు ఫేస్బుక్ యూజర్ల విషయంలోనూ తాము భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. 2014లో నాస్సెంట్ నుంచి వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్బుక్. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్‌లో.. మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్‌లు పంపించుకుంటున్నారని అంచనా. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్ ఉంటుందని, యూజర్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగబోదని ఫేస్బుక్-వాట్సాప్ ఎప్పటి నుంచో చెప్తోంది. క్లిక్: వాట్సప్ యూజర్లకు షాక్ -
ఫేస్‌బుక్‌లోని ఈ కొత్త ఫీచర్ సూపర్‌గా ఉందే....!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు కొత్తగా అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ యాప్‌లో ఉండే వాయిస్, వీడియో కాల్స్‌కు ఉండే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రస్తుతం ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. కాగా గతంలోనే వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ సేవల పోర్ట్‌ఫోలియోలో క్రమంగా ఆడియో ,వీడియో ఫీచర్లను జోడించింది. "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ లో భాగంగా సందేశాలు, కాల్ల కంటెంట్ మీ ఫోన్ నుంచి రిసీవర్‌కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్-షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఫేస్బుక్ మెసేంజర్‌లోని గ్రూప్ చాట్లకు కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావాలని ఫేస్బుక్ చూస్తుంది. దాంతో పాటుగా మెసేంజర్‌లో సందేశాలను నిర్ణీత సమయం వరకు కనిపించేలా, తరువాత ఆ మెసేజ్‌లు కన్పించకుండా నియత్రించవచ్చును. మెసేంజర్‌లో పంపే సందేశాలకు 5 సెకండ్ల నుంచి 24 గంటలపాటు టైమర్‌ను ఉపయోగించి మెసేజ్‌లను పంపవచ్చును. -
మీ ఫోన్ డెడ్ అయ్యిందా? ఇలా వినియోగించుకోండి
వాట్సాప్ వినియోగదారులకు కోసం వాట్సాప్ మల్టీ డివైజ్ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గత కొంతకాలంగా యూజర్లు మల్టీ డివైజ్ఆప్షన్ను ఎనేబుల్ చేయాలంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. వాట్సాప్‌ను వినియోగదారుడు తన ఫోన్‌తో పాటు మరో నాలుగు రకాల డివైజ్‌లలో వినియోగించుకోవచ్చు. వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. మల్టీ డివైజ్ ఫీచర్‌ను ఎలా వినియోగించాలి ఈ మల్టీ డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వినియోగించడం అసాధ్యం. వాట్సాప్ బీటా బ్లాగ్ పోస్ట్‌లో ప్రస్తుతం మల్టీ డివైజ్ ఆప్షన్‌ను కొంతమంది యూజర్లకు మాత్రమే అనుమతిస్తూ టెస్ట్ ట్రయిల్స్‌ను నిర్వహిస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొంది. దానికి తోడు అదనంగా మరిన్ని ఫీచర్స్‌ను యాడ్స్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 -
కేంద్రం ప్రతిపాదనకు వాట్సాప్ నో
న్యూఢిల్లీ: సందేశాలు తొలుత ఎక్కడి నుంచి వచ్చాయో కనిపెట్టగలిగే సాంకేతికతను అభివృద్ధి చేస్తే యూజర్ల వ్యక్తిగత గోప్యతతో పాటు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉద్దేశాలు దెబ్బతింటాయని ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ వాట్సాప్ భారత ప్రభుత్వానికి స్పష్టంచేసింది. నకిలీ సందేశాలను అడ్డుకునేందుకు వార్తల మూలాలను కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ‘దీనివల్ల వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిష్షన్(మెసేజ్ పంపేవారు, రిసీవ్ చేసుకునేవారు తప్ప మరెవరూ సమాచారాన్ని చూడలేని సాంకేతికత) ఉద్దేశాలు దెబ్బతింటాయి. ఒకవేళ అలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తే మా యూజర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం, గోప్యత తీవ్రమైన ప్రమాదంలో పడతాయి. యూజర్ల గోప్యత నిబంధనల్ని ఉల్లంఘించే పనులను వాట్సాప్ ఎన్నడూ చేయబోదు’ అని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, వదంతుల కారణంగా సంభవిస్తున్న మూకహత్యలను నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కేంద్రం గతంలో వాట్సాప్‌ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నకిలీ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇందుకోసం భారత్‌లో ఓ బృందాన్ని నియమించామని, వాట్సాప్‌లో ఓసారి గరిష్టంగా పంపగలిగే సందేశాల సంఖ్యను తగ్గించామని పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొనుగోలు చేసిన వాట్సాప్‌కు ప్రస్తుతం భారత్‌లో 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. -
ఫేస్బుక్లో మరో సరికొత్త ఆప్షన్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్.. తన మెసెంజర్ యాప్ కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేటపుడు ఉండే ఎన్క్రిప్షన్ సదుపాయం ఇప్పటివరకు వాట్సప్‌లో మాత్రమే ఉండగా, ఇకమీదట అలాంటి అవకాశం ఫేస్బుక్ మెసెంజర్‌లోనూ ఉంటుంది. 'సీక్రెట్ కన్వర్సేషన్స్' అనే ఫీచర్‌ను టాగిల్ కీ లా ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్సప్‌లో అయితే మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా కూడా ఎన్క్రిప్షన్ ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కానీ మెసెంజర్లో మాత్రం మనం కావాలనుకున్న వాటికి మాత్రమే అది ఉంటుంది. అయితే.. ఇక్కడో మెలిక కూడా ఉంది. ఒకసారి మనం ఆటోమేటిక్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకుంటే.. మెసెంజర్లో ఉన్న దాదాపు వంద కోట్ల మంది యూజర్లు కూడా ప్రతి మెసేజికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ సమస్య ఉండబోదని, కొత్త మెసేజి స్క్రీన్ మీద కుడిచేతి వైపు పైన 'సీక్రెట్' అనే కీ కనపడుతుందని, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుందని ఫేస్బుక్ వర్గాలు అంటున్నాయి. అయితే సందేశాలు పంపేవాళ్లు, అందుకునేవాళ్లు కూడా కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.