ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఆప్షన్ | Encrypt your chats on Facebook Messenger now | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఆప్షన్

Published Wed, Oct 5 2016 11:25 AM | Last Updated on Fri, Jul 27 2018 1:16 PM

ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఆప్షన్ - Sakshi

ఫేస్‌బుక్‌లో మరో సరికొత్త ఆప్షన్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. తన మెసెంజర్ యాప్ కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేసేటపుడు ఉండే ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఇప్పటివరకు వాట్సప్‌లో మాత్రమే ఉండగా, ఇకమీదట అలాంటి అవకాశం ఫేస్‌బుక్ మెసెంజర్‌లోనూ ఉంటుంది. 'సీక్రెట్ కన్వర్సేషన్స్' అనే ఫీచర్‌ను టాగిల్ కీ లా ఉపయోగించుకోవచ్చు. అంటే వాట్సప్‌లో అయితే మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా కూడా ఎన్‌క్రిప్షన్ ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. కానీ మెసెంజర్‌లో మాత్రం మనం కావాలనుకున్న వాటికి మాత్రమే అది ఉంటుంది.

అయితే.. ఇక్కడో మెలిక కూడా ఉంది. ఒకసారి మనం ఆటోమేటిక్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకుంటే.. మెసెంజర్‌లో ఉన్న దాదాపు వంద కోట్ల మంది యూజర్లు కూడా ప్రతి మెసేజికి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ సమస్య ఉండబోదని, కొత్త మెసేజి స్క్రీన్ మీద కుడిచేతి వైపు పైన 'సీక్రెట్' అనే కీ కనపడుతుందని, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుందని ఫేస్‌బుక్ వర్గాలు అంటున్నాయి. అయితే సందేశాలు పంపేవాళ్లు, అందుకునేవాళ్లు కూడా కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement