సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్లకు కొత్తగా అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ యాప్‌లో ఉండే వాయిస్, వీడియో కాల్స్‌కు ఉండే ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. కాగా గతంలోనే వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఫేస్‌బుక్ ఏర్పాటు చేసింది.
సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ సేవల పోర్ట్‌ఫోలియోలో క్రమంగా ఆడియో ,వీడియో ఫీచర్‌లను జోడించింది. "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ లో భాగంగా సందేశాలు, కాల్‌ల కంటెంట్ మీ ఫోన్ నుంచి రిసీవర్‌కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్‌బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్-షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో ఫేస్‌బుక్ మెసేంజర్‌లోని గ్రూప్ చాట్లకు కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తీసుకురావాలని ఫేస్‌బుక్ చూస్తుంది. దాంతో పాటుగా మెసేంజర్‌లో సందేశాలను నిర్ణీత సమయం వరకు కనిపించేలా, తరువాత ఆ మెసేజ్‌లు కన్పించకుండా నియత్రించవచ్చును. మెసేంజర్‌లో పంపే సందేశాలకు 5 సెకండ్ల నుంచి 24 గంటలపాటు టైమర్‌ను ఉపయోగించి మెసేజ్‌లను పంపవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment