సాక్షి, న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులను అనుమతించడంపై హోం మంత్రి అమిత్‌షా స్పందిచారు. విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టం, 2010పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్‌షా అన్నారు. ఇది సిక్కు సమాజ అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి తెలియజేస్తుంది’ అని తెలిపారు. ‘శ్రీ హర్‌మందిర్ సాహిబ్ వద్ద విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010పై ఒక మార్గదర్శకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మన సిక్కు సోదరీమణుల అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘శ్రీ దర్బార్ సాహిబ్ ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగత్ సేవ చేయలేకపోయింది. శ్రీ హర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్‌సీఆర్‌ఏను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంగత్, శ్రీ దర్బార్ సాహిబ్‌ల సేవ బంధాన్ని మరింత పటిష్టం చేసిన క్షణం’ అని అమిత్‌షా తన క్యాప్షన్‌లో జోడించారు.
ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥
— Amit Shah (@AmitShah) September 10, 2020
PM @narendramodi ji is blessed that Wahe Guru ji has taken Seva from him.
The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers.
పంజాబ్‌లోని సచ్‌ఖండ్ శ్రీ హర్మాందిర్ సాహిబ్-దర్బార్ సాహిబ్‌కు 2010లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశీ నిధులును సేకరించడానికి వీలు కల్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు లేదా సంఘాలు విదేశీ సహకారం పొందటానికి, విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించడానికి విదేశీ సహకార చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. విదేశీ నిధులను పక్కదోవ పట్టించడానికి చెక్ పెట్టేందుకు 2010లో ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని పార్లమెంట్ అమలు చేసింది.
చదవండి: కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు
Comments
Please login to add a commentAdd a comment