ముంబై: రూపాయి లాభాల జోరు కొనసాగుతోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం 25 పైసలు బలపడి 66.50కు చేరింది. ఇది రెండున్నర నెలల గరిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ డాలర్‌తో రూపాయి మారకం బలపడింది. విదేశీ నిధులు వస్తున్న కారణంగా బ్యాంక్‌లు, ఎగమతిదారులు డాలర్లను విక్రయిస్తుండడం, స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియడం రూపాయి పుంజుకోవడానికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. గత మూడు రోజుల్లో రూపాయి 88 పైసలు(1.31 శాతం) బలపడింది.