ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని నియామక ప్రక్రియ అవకతవకలపై ఆధారాలు దొరికిన నేపథ్యంలో సీబీఐ ఆ రాష్ట్ర సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్‌పై విచారణ తీవ్రతరం చేయనుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని నియామక ప్రక్రియ అవకతవకలపై ఆధారాలు దొరికిన నేపథ్యంలో సీబీఐ ఆ రాష్ట్ర సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్‌పై విచారణ తీవ్రతరం చేయనుంది. నియామకాలకు సంబంధించి సీబీఐ నాలుగు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకానికి సంబంధించిన ఫైలులో చాలా పేజీలు లేవన్న విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియపై మరింత లోతుగా విచారణ చేయాలని సీబీఐ భావిస్తోంది.
అవినీతిలో మరింతమంది అధికారులు ఉండే అవకాశం ఉందని యోచిస్తున్న సీబీఐ విచారణ పరిధిని పెంచాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై సీబీఐ ఏ నిర్ణయమూ తీసుకోలేదు.