సీబీఐచే విచారణ చేపట్టాలి | demand for CBI inquiry | Sakshi
Sakshi News home page

సీబీఐచే విచారణ చేపట్టాలి

Published Thu, Jul 28 2016 8:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం - Sakshi

ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం

  • సర్కార్‌ అసమర్థత వల్లే ఎంసెట్‌ -2 లీక్‌
  • సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలి
  • బీజేవైఎం డిమాండ్‌..  ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
  • సంగారెడ్డి టౌన్‌: ఎంసెట్‌ -2 ప్రశ్నపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు. లీక్‌  విషయం బహిర్గతం అయ్యే వరకు ప్రభుత్వానికి తెలవకపోవడం సిగ్గుచేటన్నారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్‌ వద్ద ప్రభుత్వ దిష్టబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌ -3 నిర్వహణను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు మందుల నాగరాజు, నాయకులు విజయ్‌ కుమార్‌, సంధీర్‌రెడ్డి, సతీష్‌గౌడ్‌, రమేష్‌, తరున్‌, సాయి, విష్ణు, నాగరాజ్‌, పండు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement