సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మంగళవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు డీఐజీ చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోరడంతో విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి వాన్‌పిక్, ఇందూ టెక్‌జోన్ చార్జిషీట్లలో సాక్షిగా ఉన్న పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రమాకాంత్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వూ్యను సాక్షి టీవీలో ప్రసారం చేశారని, పేపర్‌లో ప్రచురించారని, ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కొమ్మినేని... ఫ్రీలాన్స్ జర్నలిస్టు
అయితే, కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగునాట ప్రముఖ జర్నలిస్టు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ5 వంటి మీడియా సంస్థలలో సుదీర్ఘకాలం పని చేసి ప్రస్తుతం సొంతంగా బ్లాగ్ నడుపుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా ఉన్నారు. సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొమ్మినేని వారం వారం నిర్వహి స్తున్న ‘మనసులో మాట’ కార్యక్రమంలో భాగంగా రమాకాంత్‌రెడ్డిని ఇంటర్వూ్య చేశారు. ఈ ఇంటర్వూ్య పట్ల సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘బెయిల్ రద్దు చేయండి’
Published Wed, Mar 29 2017 1:04 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM
Advertisement