సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు.
‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్‌మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు.
‘‘ఏ స్టేట్‌మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు మార్చారు. అవినాష్‌రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్‌రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా?
‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్‌ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్‌మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్‌ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్‌మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు.
చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
Comments
Please login to add a commentAdd a comment