సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ మహిళా నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారణ చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం(డిసెంబర్ 11వ తేదీన) ఆమె నివాసానికి వెళ్లనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఆర్‌పీసీ 160 కింద ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ. అంతకు ముందు.. పలానా తేదీల్లో తాను విచారణకు అందుబాబులో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీబీఐకు మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.
డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయనున్నారు సీబీఐ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment