
సౌదీఅరేబియాలో కళ్లకు గంతలతో నిరసన
నెల్లూరు(సెంట్రల్): విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై వెంటనే సీబీఐ విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని సౌదీ అరేబియాలోని వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు డిమాండ్ చేశారు. సౌదీఅరేబియాలోని రియాద్ సిటీలోని ముఝుమియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ సౌదీ అరేబియా యూత్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సౌదీఅరేబియా యూత్ లీడర్ షేక్ అర్హద్ ఆయుబ్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే హత్యాయత్నాన్ని నీరు కారుస్తోందన్నారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment