
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు, అలాగే ప్రమాదాల్లో మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఈ విషయంలో రవాణా, పోలీసు, వైద్య శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని వివరించారు.
శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో రోడ్డు భద్రతపై సమావేశమయ్యారు. వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపార.