సాక్షి,హైదరాబాద్: వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య తదితర విభాగాల బృందాలను నియమించినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మంగళవారం సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4,100 మందిని, మున్సిపల్ శాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బందితోపాటు మొబైల్ టాయిలెట్లు, ఎమర్జెన్సీ సామగ్రిని తరలించామని పేర్కొన్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతోపాటు పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల డైరెక్టర్లు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి వైద్య సేవలందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment