senior official
-
పాణీరావు కన్నుమూత.. బ్యాడ్మింటన్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి ఎస్. పాణీరావు శుక్రవారం మృతి చెందారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న 72 ఏళ్ల పాణీరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయనకు బ్యాడ్మింటన్‌తో అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం రోజులనుంచి ప్రస్తుతం తెలంగాణ సంఘం వరకు వేర్వేరు హోదా ల్లో ఆయన పని చేశారు. ముఖ్యంగా వివిధ వయో విభాగాలకు సంబంధించిన టోర్నీల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న పాణీరావు వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. చదవండి: సెమీఫైనల్లో సాత్విక్ జోడీ -
భద్రాద్రి జిల్లాలో మండలానికో అధికారి
సాక్షి,హైదరాబాద్: వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య తదితర విభాగాల బృందాలను నియమించినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మంగళవారం సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4,100 మందిని, మున్సిపల్ శాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బందితోపాటు మొబైల్ టాయిలెట్లు, ఎమర్జెన్సీ సామగ్రిని తరలించామని పేర్కొన్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతోపాటు పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల డైరెక్టర్లు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి వైద్య సేవలందించామన్నారు. -
ఫిర్యాదు కోసం వెళ్తే.. మసాజ్ చేయించుకున్నాడు
అధికార మదం.. మరో అధికారిని వార్తల్లోకి ఎక్కించింది. విధి నిర్వహణలో ఉండగానే మసాజ్ దుకాణం తెరిచిన ఓ పోలీస్ అధికారి వీడియో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్‌ల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంకేం ఆయనగారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. బీహార్ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహర్ అవుట్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సీనియర్ అధికారి శశిభూషణ్ సిన్హా.. మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్‌పోస్ట్‌లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌కు పిలిపించుకున్నాడాయన. ఆపై ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. షర్ట్‌ను అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు రుద్దించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్‌గా ఫోన్ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు. ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. ఆయనపై వేటు పడినట్లు సమాచారం. అయితే బీహార్ పోలీస్ శాఖ వీడియోపై, ఘటనపై, చర్యలపై అధికారికంగా మాత్రం స్పందించలేదు. Bihar police exposed on camera! Woman forced to give massage to cop to secure release of her son. Aditya joins us with details. #Bihar pic.twitter.com/8KNWWpZ9Ez — TIMES NOW (@TimesNow) April 29, 2022 -
గురుప్రసాద్ మహాపాత్ర మృతి: పీఎం మోదీ సంతాపం
సాక్షి,ముంబై: కరోనా సంబంధిత సమస్యలతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర కన్నుమూశారు.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన శనివారం కన్నుమూశారు. గురుప్రసాద్ మరణంపై ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురుప్రసాద్ మృతిపై విచారాన్ని వ్యక్తం చేశారు. మహాపాత్రను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందనీ సుదీర్ఘకాలంపాటు, దేశానికి ఎనలేని సేవలందించారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానికి ఆయన కుటుంబానికి స్నేహితులకు సానుభూతిని తెలిపారు. అటు ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ కూడా సంతాపం వెలిబుచ్చారు. అత్యంత సమర్థవంతమైన, డెడికేటెడ్ అధికారిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ నెలలో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయినా కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విచారు. గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గురుప్రసాద్ 2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్‌లోని సూరత్‌లో మునిసిపల్ కమిషనర్ పదవిని నిర్వహించిన వాణిజ్య విభాగంలో జాయింట్ సెక్రటరీగా తన సేవలను అందించారు. Deeply saddened by the demise of Dr.Guruprasad Mohapatra,Secretary DPIIT,GOI. A highly efficient and dedicated civil servant. Knew him as a former colleague through several interactions.Was always very responsive and constructive. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) June 19, 2021 Extremely saddened to hear about the loss of Dr. Guruprasad Mohapatra, Secretary DPIIT. His long-standing service and dedication to the Nation have left a lasting impact. I convey my deepest sympathies to his family and friends. ॐ शांति pic.twitter.com/JFwZJFDE1b — Piyush Goyal (@PiyushGoyal) June 19, 2021 -
కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి
సాక్షి, ముంబై : కరోనా కారణంగా మహారాష్ట్రకు చెందిన మాజీ ఎన్నికల కమిషనర్, మరాఠీ రచయిత్రి నీలా సత్యనారాయణ (72) మృతి చెందారు. ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని ఈస్ట్ అంధేరీ, సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భర్త, కుమారుడికి కూడా కోవిడ్-19 సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా సేవలందించిన సత్యనారాయణ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్దత గల అధికారిణి, సామాజిక స్పృహ కలిగిన మంచి వ్యక్తిని సమాజం కోల్పోయిందని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సహా రాజకీయ నాయకులు సత్యనారాయణకు నివాళులు అర్పించారు. ప్రభుత్వ అధికారిగానే కాకుండా, సాహిత్యరంగంలో కూడా తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారని సీఎం ఠాక్రే గుర్తు చేసుకున్నారు. యువతకు ఆమె ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు. ఆమె మరణం తనను షాక్‌కు గురిచేసిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. రాష్ట్ర మంత్రులు అశోక్ చవాన్, నవాబ్ మాలిక్, ధనంజయ్ ముండే, అనిల్ పరాబ్, ఎన్పీసీ ఎంపి సుప్రియా సులే కూడా సత్యనారాయణ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ట్విట్ చేశారు. ఇంకా పలువురు ఇతర ప్రముఖులు కూడా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కాగా ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించిన నీలా సత్యనారాయణ మహిళా ఐఏఎస్ అధికారుల ప్రాధాన్యత కోసం పోరాడారు. ఈ సందర్భంగా మహిళా బ్యూరోక్రాట్లు చేసిన తిరుగుబాటు, నిరససన చాలా విశేషంగా నిలిచింది. అలాగే జైలు శాఖ అధికారిగా పనిచేసిన సమయంలో మహిళా ఖైదీల కళా నైపుణ్యాలను ప్రోత్సహించే సంస్కరణలు చేపట్టారు. 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీలా సత్యనారాయణ 2009 లో రాష్ట్ర రెవెన్యూ విభాగానికి అదనపు ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం 2009-2014 మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. దీంతోపాటు ఆమె అనేక పుస్తకాలను రచించారు. మంచి గాయని కూడా. లాక్డౌన్ కాలంలో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని రచించారు. -
కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత
సాక్షి, కోల్‌కతా: కరోనా మహమ్మారి మరో సీనియర్ అధికారిని పొట్టన పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్ కరోనా వైరస్‌పై పోరులో ముందుండి పనిచేసి విశేష సేవలందించిన ప్రభుత్వ అధికారి దేబ్దత్తా రే(38) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో ఆమె సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తీభవించిన మానవత్వంతో, క్లిష్ట వ్యవహారాలను కూడా సునాయాసంగా పరిష్కరించడంలో ఆమె సునిశిత శైలిని గుర్తు చేసుకుని కన్నీంటి పర్యతమయ్యారు. హూగ్లీ జిల్లా, చందానగర్ సబ్ డివిజన్ డిప్యూటీ మేజిస్ట్రేట్ దేబ్దత్తా ఇటీవల కోవిడ్ అనుమానిత లక్షణాలతో హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆదివారం శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో సెరాంపూర్‌లోని శ్రమజీబీ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు భర్త, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. (అధ్వాన్నం: దేశాధినేతలకు డబ్ల్యూహెచ్ఓ అక్షింతలు ) మరోవైపు దత్తా ఆకస్మిక మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించిన ఆమె మరణం తీరని లోటని ట్వీట్ చేశారు. ప్రభుత్వం తరపున, ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. కాగా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనాతో మరణించడం తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి అని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. (పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!) I, on behalf of the Govt of West Bengal, salute her spirit & the sacrifice she's made in service of the people of #Bengal. Spoke to her husband today & extended my deepest condolences. May the departed soul rest in peace & lord give her family strength to endure this loss. (2/2) — Mamata Banerjee (@MamataOfficial) July 13, 2020 -
కరోనా : మరో సీనియర్ అధికారి మృతి
సాక్షి, ముంబై : కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లోమరో సీనియర్ అధికారి కరోనాకు బలయ్యారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ (బాంద్రా ఈస్ట్) అశోక్ ఖైర్నర్ (57) కరోనాతో ప్రాణాలు విడిచారు. నగరంలో కరోనాకు జరుగుతున్న పోరులో కీలక భూమికను పోషిస్తున్న ఆయన చివరకు వైరస్‌తో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల అనారోగ్యం పాలైన అశోక్‌ను కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొదట ఆయనను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. కాగా కోవిడ్-19 వ్యతిరేక యుద్ధంలో ఇప్పటికే 103 పౌర కార్మికులు చనిపోగా, 2 వేల మందికి పైగా వైరస్ సోకింది. ఇటీవల డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ (55) కరోనా కారణంగానే మరణించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,600 కు పెరిగింది -
రాజ్యసభను తాకిన కరోనా ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత పార్లమెంటును మరోసారి కరోనా వైరస్ ప్రకంపనలు ఆందోళన రేపాయి. రాజ్యసభ సచివాలయ అధికారి ఒకరికి నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. దీంతో పార్లమెంటు భవనంలోని రెండు అంతస్తులకు సీల్ వేసినట్టు అధికారులు వెల్లడించారు. అధికారి భార్య, పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డారని వారు తెలిపారు. శానిటైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందనీ, మిగిలిన ఉద్యోగులకు కూడా కరోనా పరీక్షలు చేయించి హోంక్వారంటైన్ చేయనున్నామని చెప్పారు. అలాగే సంబంధిత అధికారితో సన్నిహితంగా మెలిగిన వారు కూడా ఆరోగ్య అధికారులను సంప్రదించాల్సిందిగా కోరినట్టు అధికారులు చెప్పారు. గతవారం పార్లమెంటుకు చెందిన ఒక సీనియర్ అధికారి కరోనా వైరస్ బారిన పడ్డారు. కాగా కరోనా ఉధృతి, హౌస్ కీపింగ్ ఉద్యోగికి వైరస్ సోకడంతో మార్చి 23న బడ్జెట్ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే 2వ దశ లాక్ డౌన్ ముగిసిన అనతరం మూడవ వంతు సిబ్బందితో పార్లమెంట్ లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
మూక దాడుల భయంతో ఆ అధికారి ఏం చేశాడంటే..
భోపాల్ : దేశంలో అల్లరి మూకలు మూక దాడులతో చెలరేగుతున్న ఘటనలతో వీటి బారిన పడకుండా తన పేరును మార్చుకోవాలని భావిస్తున్నానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం అధికారి పేర్కొన్నారు. దేశంలో ముస్లింల భద్రత పట్ల భయాందోళనలు నెలకొన్నాయని సీనియర్ అధికారి నియాజ్ ఖాన్ వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. తన ముస్లిం గుర్తింపును దాచేందుకు తన పేరును మార్చుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అల్లరి మూకల దాడుల నుంచి తనను కొత్త పేరు కాపాడుతుందని చెప్పారు. తాను కుర్తా వేసుకోనని, గడ్డం పెంచుకోనని తన వేషధారణ కారణంగా తాను విద్వేష మూకల హింస నుంచి సులభంగా తప్పించుకోగలుగుతానని ఆ అధికారి పేర్కొనడం గమనార్హం. తన సోదరుడు సంప్రదాయ దుస్తులు ధరించి, గడ్డం పెంచుకోవడంతో అతనికి ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. అల్లరి మూకల నుంచి ఏ వ్యవస్థ ముస్లింలను కాపాడలేదని, అందుకే వారు తమ పేర్లను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ముస్లిం నటులు సైతం వారి సినిమాలను కాపాడుకోవాలంటే పేర్లు మార్చుకోవాలని సూచించారు. టాప్ స్టార్ల సినిమాలు సైతం మంచి బిజినెస్ చేయడం లేదని, దీనికి కారణం వారు గుర్తించాలని కోరారు. నవలలు కూడా రాసే ఈ అధికారి తన నూతన నవలలో తన ఆందోళనలకు అక్షరం రూపం ఇచ్చానని చెప్పడం గమనార్హం. -
ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ గుడ్ బై
సాక్షి, బెంగళూరు: భారతీయ రెండవ అతిపెద్ద ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ నుంచి మరో సీనియర్ పక్కకు తప్పుకున్నారు. ఇన్ఫీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్ నవీన్ బుధిరాజా తన పదవికి రాజీనామా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ హెడ్ నవీన్ బుధి రాజ్ రిజైన్ చేశారు. దీంతో గత ఏడాది మార్చి తరువాత కంపెనీని వీడిన మాజీ సాప్‌ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య12కు చేరింది. మరోవైపు బుధిరాజా నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కీలక నిర్వహణ సిబ్బంది రాజీనామా లేదా నియామకాలపై తాము వ్యాఖ్యానించలేమని ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధిరాజా రాజీనామాతో సంస్థ కృత్రిమ మేధస్సు-ఆధారిత వేదిక, బుధిరాజా మానసపుత్రిక ఇన్ఫోసిస్ ‘నియా’ ప్లాన్లను ప్రభావితం చేస్తుందని ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి అబ్దుల్ రజాక్ వ్యాఖ్యానించారు. కాగా బుధిరాజా 2014, ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరారు. జర్మన్ సాఫ్ట్వేర్ జెయింట్ సాప్‌నుంచి దాదాపు 16మంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ,ఇతర సీనియర్ ర్యాంకులతో ఇన్ఫోసిస్‌లో చేరిన వారిలో ఈయన కూడా ఒకరు. ఇన్ఫీ మాజీ సీఈవో విశాల్ సిక్కాకు ప్రధాన అనుచరుడిగా బుధిరాజాను పేర్కొంటారు. -
హైదరాబాద్ నుంచి లండన్‌కు ఇక ప్రతిరోజు విమానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/న్యూస్‌లైన్: విమానయాన సేవల సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్ నుంచి లండన్‌కు ప్రతి రోజు విమాన సర్వీసులు ప్రారంభించింది. వారంలో 5 సర్వీసులు కాస్తా 787 డ్రీమ్‌లైనర్ రాకతో ఏడుకు చేరాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ తొలి 787 డ్రీమ్‌లైనర్ లండన్ నుంచి హైదరాబాద్‌కు సోమవారం(మార్చి 31) ఉదయం 4.45కు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. కంపెనీ ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఈ విమానంలో తీసుకొచ్చింది. లండన్ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుకు వారంలో 48 సర్వీసులను నడుపుతున్నట్టు బ్రిటిష్ ఎయిర్వేస్ దక్షిణాసియా ప్రాంత వాణిజ్య మేనేజర్ క్రిస్టఫర్ ఫోర్డిస్ సోమవారమిక్కడ తెలిపారు. ప్రతిరోజు ఢిల్లీ, ముంబైలకు రెండు, హైదరాబాద్, బెంగళూరుకు ఒకటి, చెన్నైకి వారంలో 6 సర్వీసులు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక వంటకాలు, బాలీవుడ్ సినిమాలు భారతీయ ప్రయాణికులకు ప్రత్యేకమన్నారు. భారీ విహంగం ఏ380ని ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు.. తొలుత విదేశాల్లోని ప్రధాన నగరాలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. సంస్థకు ఉత్తర అమెరికా తర్వాత రెండో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలిచింది. దూర ప్రయాణాలకు అనువైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో 210 నుంచి 330 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది. డ్రీమ్‌లైనర్ విమానాన్ని ప్రారంభించిన బిగ్-బి.. హైదరాబాద్‌లో 787 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని ఉగాది పర్వదినం నాడు తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని బిగ్-బి అమితాబ్ బచ్చన్ అన్నారు. సోమవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్ ఆవరణలో బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాన్ని ప్రారంభించారు. ‘నమస్కారం... మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు...’ అంటూ తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ... ‘హైదరాబాద్ సంసృ్కతి, సంప్రదాయమంటే నాకెంతో ఇష్టం. ఇక్కడి ఆచార వ్యవహారాలు బాగుంటాయి. అందుకే నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌తో పాటు లండన్ నగరంతో కూడా మా కుటుంబానికి ఎన్నో ఏళ్ల నుంచి విడదీయరాని బంధం ఏర్పడింది. తాత ముత్తాతలతో పాటు మా కుటుంబానికి లండన్ నగరం ఎంతో ఇష్టమైంది. జయబచ్చన్‌తో వివాహం అనంతరం హనీమూన్‌కు లండన్‌కే వచ్చాం. నా సినిమాల షూటింగ్‌లు కూడా అప్పుడప్పుడు లండన్ నగరంలో జరుగుతుంటాయి. ఏ మాత్రం సెలవులు దొరికినా లండన్ నగరంలోనే గడుపుతాం. ఇలాంటి లండన్ నగరానికి చెందిన బ్రిటీష్ ఎయిర్వేస్ విమానాన్ని తాను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నాను... అని బిగ్-బి అమితాబ్ బచ్చన్ లండన్ నగరంతో ఉన్న అనుబంధాన్ని తన చిన్ననాటి జ్ఞాపకాలతో విలేకర్లకు వివరించారు.