
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి ఎస్. పాణీరావు శుక్రవారం మృతి చెందారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న 72 ఏళ్ల పాణీరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయనకు బ్యాడ్మింటన్‌తో అనుబంధం ఉంది.
ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం రోజులనుంచి ప్రస్తుతం తెలంగాణ సంఘం వరకు వేర్వేరు హోదా ల్లో ఆయన పని చేశారు. ముఖ్యంగా వివిధ వయో విభాగాలకు సంబంధించిన టోర్నీల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న పాణీరావు వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు.
చదవండి: సెమీఫైనల్లో సాత్విక్ జోడీ