![Seametrics And Boulder Hills Tigers Won T9 Golf Challenge - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/16/Untitled-10.jpg.webp?itok=kZw9y6-L)
T9 గోల్ఫ్ ఛాలెంజ్ రెండో సీజన్‌లో సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4-4 స్కోర్‌తో టై అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ బౌల్డర్ హిల్స్ టైగర్స్ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా...తర్వాత సిమెట్రిక్స్ టీమ్ అద్భుతంగా పుంజుకుంది. స్కోర్ సమం కావడంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇరు జట్ల కెప్టెన్లకు ట్రోఫీతో పాటు 5 లక్షల రూపాయల ప్రైజమనీ చెక్ ను అందజేశారు. అంతకు ముందు మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో జాగృతి జాగ్వర్స్ 3-1 స్కోర్ తో ఎకోలాస్టిక్ ఈగల్స్ పై విజయం సాధించింది. కాగా గోల్ఫ్ ను మరింత ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ఈ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నామని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ ఎన్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment