వచ్చే నెల 6న నిర్వహించాలని నిర్ణయం
ముఖ్య అతిథిగా ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
నిర్ణయించిన హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్స్‌ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా తొలి హాక్–2023 సమ్మిట్ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024కు (హాక్ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.
నగర పోలీసు విభాగం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్ హోటల్‌లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించాలని, సైబర్‌తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే నిర్ణయించారు.
యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్ సమ్మిట్‌లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్ స్వ్కాడ్స్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్‌సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి.
చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Comments
Please login to add a commentAdd a comment