సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్నాళ్లుగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ అనే పాటతో ఆయన పాపులర్ అయ్యారు. ఆ పాటకిగానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. వడ్డేపల్లి శ్రీనివాస్ మృతిపై పలువురు సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment