vaddepally
-
జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొన్నాళ్లుగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో ‘గన్నులాంటి పిల్ల..’ అనే పాటతో ఆయన పాపులర్ అయ్యారు. ఆ పాటకిగానూ ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా వచ్చింది. వడ్డేపల్లి శ్రీనివాస్ మృతిపై పలువురు సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
మధ్యాహ్నం పెళ్లి .. అర్ధరాత్రి వరుడి ఆత్మహత్య
శాంతినగర్ (అలంపూర్): వివాహమైన రోజు రాత్రే వరుడు ఆత్మహత్యకు పాల్పడటం.. జోగుళాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించింది. పెళ్లికూతురు పుస్తెలతాడు, మెట్టెలు, పెళ్లిచీర వదిలేసి పుట్టినింటికి వెళ్లిపోవడంతో వరుడి కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం తనగలకు చెందిన సూర్యబాబు (24), అయిజ మండలం సంకాపురానికి చెందిన యువతితో వివాహం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. కాగా ఆరోజు రాత్రి వరుడు, వధువు ఒకే గదిలో నిద్రించేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఏమి జరిగిందో గానీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అత్తమామల వద్దకు వచ్చిన ఆమె.. ‘మీ కొడుకు అగుపిస్తలేడు..’అని చెప్పింది. వారు ఇంటి పరిసరాలను పరిశీలించగా పక్కగదిలో సూర్యబాబు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. వెంటనే పుట్టినింటికి సమాచారం అందించిన పెళ్లికూతురు తమ వారు తీసుకొచ్చిన వాహనంలో స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఈ విషయమై సూర్యబాబు కుటుంబసభ్యులు శాంతినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శ్రీహరి పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యబాబు మృతదేహానికి అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయంత్రం తనగలలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కాజీపేట:వడ్డెపల్లి రిజర్వాయర్‌లో ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుని తల్లి పాలడుగుల లక్ష్మి కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాధు చేసిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమిడికి చెందిన పి.రాజేందర్ (28) శుక్రవారం బట్టలు ఉతుక్కునేందుకు రిజర్వాయర్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో కాలుజారి రిజర్వాయర్‌లో పడ్డాడు. తమ కుమారుడికి ఈత రాక నీటమునిగి మరణించినట్లు లక్ష్మి ఫిర్యాధుచేసింది. కాజీపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక డంప్ సీజ్.. ఇద్దరిపై కేసు నమోదు
శాంతినగర్(మహబూబ్ నగర్) : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన వడ్డేపల్లికి చెందిన ఇద్దరిపై శుక్రవారం కేసు నమోదుచేసినట్లు శాంతినగర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి, మాదన్నలు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు డంపులు (60 ట్రాక్టర్ల ఇసుకను) గుర్తించామన్నారు. అనంతరం డంపులను సీజ్‌చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించి వారిద్దరిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.