శాంతినగర్(మహబూబ్ నగర్) : మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా నిల్వ చేసిన వడ్డేపల్లికి చెందిన ఇద్దరిపై శుక్రవారం కేసు నమోదుచేసినట్లు శాంతినగర్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి, మాదన్నలు గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు డంపులు (60 ట్రాక్టర్ల ఇసుకను) గుర్తించామన్నారు. అనంతరం డంపులను సీజ్‌చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించి వారిద్దరిపై కేసునమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.