పెన్నమ్మకు గర్భశోకం | Tdp sand mining in penna river | Sakshi
Sakshi News home page

పెన్నమ్మకు గర్భశోకం

Published Tue, Nov 5 2024 5:52 AM | Last Updated on Tue, Nov 5 2024 5:52 AM

Tdp sand mining in penna river

ఇసుకను తోడేస్తున్న టీడీపీ నాయకులు

ట్రాక్టర్‌కు గేటు వసూలు

అడుగంటుతున్న భూగర్భజలాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లాబాద్‌ గ్రామం సమీపంలో పెన్నానదిలోని ఇసుకను అక్రమదారులు ఇష్టా­రాజ్యంగా తవ్వేస్తున్నారు. పైగా గేటు వసూలు చే­స్తున్నారు. క్వారీలో నుంచి అవసరమైనప్పుడు ఇసు­కను ఉచితంగా తెచ్చుకోవచ్చని రాష్ట్ర ప్రభు­త్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. యర్ర­గుంట్ల మండలం పరిధిలో ఎక్కడా ఇసుక క్వారీ లేదు. దీంతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ పెన్నామ్మకు గర్భశోకం మిగిలిస్తున్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిస్మిల్లాబాద్‌ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు పెన్నా­నదిలోని ఇసుక­ను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు ఒక రేటు పెట్టి గేటు­ను వసూలు చేస్తున్నారు. రోజుకు ఒక్కరు చొప్పును వంతులు వేసుకొని బయట నుంచి ట్రాక్టర్లను రప్పించుకొని అనధికారంగా గేటును పెట్టుకుని వ­సూళ్లకు తెరలేపారు. రోజుకొకరు చొప్పున ఇసుక­ను అమ్ముకుంటున్నారు. ప్రొద్దుటూ­రు, రామేశ్వరం పొ­ట్లదుర్తి గ్రామాల నుంచి ఇసుక కోసం రోజూ ట్రాక్టర్లు వరుసలో నిలబడుతు­న్నాయి.

ఇసుక తర­లిపోతుండటం వల్ల భూగర్భ జ­లాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు వాపో­తు­న్నారు. వీరి అక్రమాలను మొదట్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. తర్వాత గ్రామం కోసం డబ్బు వసూలు చేస్తున్నా­మంటూ వారికి నచ్చజెప్పారు. పెన్నాలో అక్ర­మంగా ఇసుకను గేటు పెట్టి వసూళ్లు చేసుకుంటున్నారని గ్రామంలోని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికా­రులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement